kottalokha-chapter-2( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Lokah Chapter 2: ‘కొత్త లోక చాప్టర్ 2’పై అప్డేట్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్.. ఇది ఏ రేంజ్‌లో ఉంటుందో!

Lokah Chapter 2: మలయాళ సినిమా ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు హీరో దుల్కర్ సల్మాన్. ‘లోకహ్ చాప్టర్ 1 – చంద్ర’ సినిమాకు సీక్వెల్‌గా ‘లోకహ్ చాప్టర్ 2’ టైటిల్‌తో కొత్త చాప్టర్ అధికారికంగా ప్రకటించబడింది. ఈ సూపర్‌హీరో ఫాంటసీ ఫ్రాంచైజీలో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు, మరియు దుల్కర్ సల్మాన్ కూడా తిరిగి వస్తున్నాడు. డైరెక్టర్ డొమినిక్ అరున్ రాసిన, డైరెక్ట్ చేసిన ఈ సినిమాను వేఫరర్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. కొత్త లోక చాప్టర్ 1 చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. తాజాగా ‘కొత్తలోక చాప్టర్ 2’ కి మూవీకి సంబంధించి చిన్న వీడియోను విడుదల చేశారు. అందులో టోవినో ధామస్ తో దుల్కర్ సల్మాన్ కనిపించారు. ‘చాప్టర్ 2’ కి సంబంధించి అప్డేట్ రావడంతో చాప్టర్ 1 చూసిన అభిమానులు దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-The Paradise Update: మోహన్ బాబు స్టన్నింగ్ లుక్ రిలీజ్.. ఏ సినిమా అంటే?

కొత్త లోక చాప్లర్ 2 గురించి నిర్మాత దుల్కర్ సల్మాన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రత్యేక ప్రోమో వీడియోను విడుదల చేశారు. దీంట్లో ‘లోక చాప్టర్ 2’ అనౌన్స్‌మెంట్ జరిగింది. అందులో “బియాండ్ మిథ్స్. బియాండ్ లెజెండ్స్. ఎ న్యూ చాప్టర్ బిగిన్స్. ‘లోకహ్‌చాప్టర్2” అనే క్యాప్షన్‌తో రాసుకొచ్చారు. అంతే కాకుండా దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ కలిసి కనిపించారు. టోవినో తన పాత్ర మైఖేల్/చాతన్‌గా, దుల్కర్ చార్లీ/ఒడియన్‌గా తిరిగి వస్తున్నారని స్పష్టమైంది. ఈ ప్రోమోలో టోవినో తన సోదరుడితో ఎదుర్కొనే ఫైట్ సీన్స్, దుల్కర్‌తో కలిసి కనిపించే ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. మలయాళ సినిమాలో ఇలాంటి లీడింగ్ యాక్టర్స్ కాంబో చాలా రేర్‌గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి.

Read also-Bigg Boss Telugu Promo: ‘నీ లాంటి లత్కోర్ మాటలు మాట్లాడను’.. మాస్క్ మాన్‌పై నాగ్ మామ ఫైర్!

2025లో విడుదలైన మలయాళ సూపర్‌హీరో ఫాంటసీ సినిమా ‘లోక చాప్టర్ 1: చంద్ర’ డొమినిక్ అరున్ రాసి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ వేఫరర్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసింది. ఇది భారతదేశంలో మొదటి మహిళా ప్రధాన సూపర్‌హీరో సినిమాగా చరిత్ర సృష్టించింది. కల్యాణి ప్రియదర్శన్ చంద్ర పాత్రలో మెరిసిన ఈ సినిమాలో నస్లెన్, టోవినో థామస్ (చాతన్‌గా ఎక్స్‌టెండెడ్ కేమియోలో), దుల్కర్ సల్మాన్ (చార్లీ/ఒడియన్‌గా) ప్రధాన పాత్రలు చేశారు. మమ్మూట్టి కూడా స్పెషల్ రోల్‌లో కనిపించాడు. బెంగళూరులో నైట్ షిఫ్ట్‌లో కెఫెలో పని చేసే గాథ్- ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ యంగ్ మహిళ చంద్ర మిస్టీరియస్ జర్నీని ఈ చిత్రం చూపిస్తుంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.268 కోట్లు వసూలు చేసింది. ప్రేక్షకుల నుంచి అభినందనలు అందుకుంది. ఇప్పుడు OTT ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం, మలయాళ సినిమా ఫ్రాంచైజీలకు కొత్త డైమెన్షన్ ఇచ్చి, తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.

 

 

Just In

01

Ponguleti Srinivas Reddy: ఈ జిల్లాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి కీలక అదేశాలు

OG villain Jimmy viral: ‘ఓజీ’ విలన్ చేసిన పనికి నవ్వుతున్న జనం.. ఎందుకంటే?

Crime News: మధ్యప్రదేశ్‌లో దారుణం.. కన్నతల్లిముందు ఐదేళ్ల బాలుడి హత్య

Kothagudem Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. ఎస్పీ కీలక సూచనలు

OTT Movie: ప్రతీ ప్రేమకథ నిజంతో మొదలవుతుంది.. కానీ ఇక్కడ మాత్రం..