Bigg Boss Telugu Promo: తెలుగు బిగ్ బాస్ లో హై ఓల్టేజ్ ఉండే ఎపిసోడ్ గా శనివారం గురించి చెబుతుంటారు. ఎందుకంటే ఆ రోజే హోస్ట్ నాగార్జున వచ్చి.. ఆ వారంలో ఇంటి సభ్యులు చేసిన తప్పొప్పుల గురించి వేదికపై మాట్లాడతారు. కాస్త అతిగా ప్రవర్తించిన సభ్యులకు చురకలు సైతం అంటిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ శనివారం (సెప్టెంబర్ 27) ఎపిసోడ్ లోనూ హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో కంటెస్టెంట్స్ కు చురకలు అంటించినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన శనివారం మెుదటి ప్రోమోలో పలువురు ఇంటి సభ్యులపై నటుడు నాగార్జున మండిపడటం చూడవచ్చు.
ప్రోమోలో ఏముందంటే?
బిగ్ బాస్ సీజన్ 9.. టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అనుకున్నామని కానీ ఎక్కడా అది కనిపించడం లేదని హోస్ట్ నాగార్జున చెప్పే డైలాగ్ తో ప్రోమో మెుదలైంది. ఈ వారం జరిగిన బజర్ టాస్క్ కు ఇంటి సభ్యురాలు శ్రీజ సంచాలక్ గా వ్యవహరించగా.. ఆమె చేసిన తప్పును నాగార్జున ప్రశ్నించడం ప్రోమోలో చూడవచ్చు. సంచాలక్ గా ఏం చేశావమ్మ అని నాగ్ ప్రశ్నించగా.. కరెక్ట్ గానే చేశానని శ్రీజ సమాధానం ఇస్తుంది. నువ్వు అనుకుంటే సరిపోతుందా? జనం కూడా అనుకోవాలి కదా? అంటూ హోస్ట్ నాగార్జున ఇచ్చే కౌంటర్ తో ఒక్కసారిగా శ్రీజ షాక్ కు గురవుతుంది.
రీతూ, మాస్క్ మాన్ కు చురకలు
ఈ వారం ఇమ్యూనిటీ టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యురాలు రీతూ చాలా ఏమోషనల్ అవుతుంది. టాస్క్ లో కష్టపడినా ఓడిపోవడంతో తనకు లక్ లేదని తల బాదుకుంటుంది. దీనిని ప్రోమోలో నాగార్జున ప్రశ్నించడం చూడవచ్చు. అవతలి వారు చెప్పింది విని కామ్ గా ఆడుతున్నావంటూ చరకలు సైతం అంటించారు. ఆ తర్వాత వెంటనే లత్కోర్ హరీశ్ అంటూ మాస్క్ మాన్ ను నాగార్జున పిలవడం తోటి సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. నామినేషన్స్ సందర్భంగా హరీశ్ ఈ లత్కోర్ పదాన్ని ఉపయోగించడాన్ని హోస్ట్ నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు. ఆ పదం వాడినప్పుడు హ్యుములేటింగ్ గా అనిపించలేదా? అని నాగార్జున ప్రశ్నిస్తారు. అందుకు మాస్క్ మాన్ సమధానం ఇస్తూ ఇది చాలా కామన్ గా ఉపయోగించే పదమని అన్నారు.
Also Read: Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ దసరాకి నో ముక్కా, నో చుక్కా..!
నువ్వు అంటే తప్పు.. లత్కోర్ అంటే కాదా?
అయితే హౌస్ లోని అందరూ కూడా ఇకపై లత్కోర్ హరీశ్ అంటారు నీకు ఓకేనా అంటూ మాస్క్ మాన్ ను నాగార్జున ప్రశ్నిస్తారు. అప్పుడు హరీశ్ షాకవుతూ తాను ఎవరినీ ఉద్దేశించి అలా అనలేదని సమాధానం ఇస్తారు. దీంతో హరీశ్ ఆ పదం వాడినప్పుడు అక్కడే ఉన్న ప్రియ అభిప్రాయాన్ని నాగార్జున కోరడం ప్రోమోలో చూడవచ్చు. అయితే ప్రియ కూడా లత్కోర్ అని అనడం.. చాలా పెద్ద మిస్టేక్ అని పేర్కొంటుంది. అయినప్పటికీ హరీశ్ తన తప్పును ఒప్పుకోకపోవడంతో నాగార్జున సీరియస్ అవుతారు. ‘హరీశ్.. నీలాంటి లత్కోర్ మాటలు మాట్లాడను అంటే ఏమంటావు’ అని నాగార్జున ఘాటుగా ప్రశ్నిస్తారు. ‘నువ్వు అనకూడదు.. మీరు అనండి అని పదే పదే అడుగుతున్నప్పుడు లత్కోర్ అనే పదం కరెక్ట్ కాదు హరీశ్’ అని నాగార్జున చురకలు అంటించడంతో ప్రోమో ముగుస్తుంది.