KTR (imagecredit:twitter)
తెలంగాణ

KTR: మెట్రోకు ఎంత నష్టం? భూములు అమ్ముతారా?.. కేటీఆర్ ఫైర్!

KTR: ప్రభుత్వం తీసుకున్న బాధ్యతారాహిత్య, అనాలోచిత నిర్ణయంతో రాష్ట్ర ప్రజలపై ఒక్కరోజే ఏకంగా 15 వేల కోట్ల అప్పుల భారం పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. ప్రభుత్వ నియంతృత్వ పోకడలతోనే నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో నుంచి అర్ధాంతరంగా వైదొలగిందని ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో బీఆర్ఎస్ ను బద్నాం చేసే అవకాశం ఇవ్వకుండా, తామే మరమ్మతులు చేస్తామని ఎల్ అండ్ టీ సంస్థ ముందుకురావడమే రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి కంటగింపుగా మారిందని ఆరోపించారు. అప్పటి నుంచే ఆ సంస్థపై కక్షగట్టి వేధించి, రాష్ట్రం విడిచి వెళ్ళిపోయేలా చేశారని మండిపడ్డారు.

2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి మెట్రో పనులు కేవలం 20-25% మాత్రమే పూర్తయ్యాయని, కేసీఆర్(KVR) కేవలం మూడేండ్లలోనే 2017 నవంబర్ 29న ప్రధాని మోదీ చేతుల మీదుగా మొదటి దశను ప్రారంభించారన్నారు. కరోనాలోనూ సంస్థ నష్టాల్లో ఉందని భయపడితే, కేసీఆర్ మరోసారి అండగా నిలిచారని, 3,000 కోట్ల వడ్డీలేని రుణం (సాఫ్ట్ లోన్) మంజూరు చేసి, అందులో 900 కోట్లు విడుదల చేసి మెట్రోను కాపాడారన్నారు.

ఎయిర్‌పోర్ట్ మెట్రోకు టెండర్లు పూర్తి..

బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రోజుకు 5 లక్షల మంది ప్రయాణించే స్థాయికి, పీక్ అవర్స్‌లో కోచ్‌లు సరిపోనంతగా మెట్రోను అభివృద్ధి చేశామని, 69 కిలోమీటర్ల లైన్ పూర్తిచేసి, దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దామన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆవాస హోటల్ వరకే ఉన్న లైన్‌ను, లక్షలాది ఐటీ ఉద్యోగులు పనిచేసే మైండ్ స్పేస్ వరకు పొడిగించి, స్కైవాక్‌లు నిర్మించి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించామన్నారు. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 400 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్రణాళికలు రచించామని, ఓఆర్ఆర్(ORR) చుట్టూ 160 కి.మీ., భువనగిరి, సంగారెడ్డి(Sangareddy), షాద్‌నగర్, కడ్తాల్ వరకు విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపామన్నారు.

అత్యంత కీలకమైన మైండ్‌స్పేస్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు టెండర్లు పూర్తిచేసి, కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించామన్నారు. భూసేకరణ అవసరం లేకుండా, పిల్లర్లు లేకుండా భూమ్మీదనే నిర్మించేలా దీన్ని డిజైన్ చేశామని తెలిపారు. కానీ, కాంగ్రెస్(Congress) అధికారంలోకి రాగానే తీసుకున్న మొదటి అనాలోచిత నిర్ణయం ఎయిర్‌పోర్ట్ మెట్రో రద్దు అన్నారు. నా భూములు ఉన్నాయని, బీఆర్ఎస్ నేతలకు లబ్ధి చేకూరుతుందని ఆరోపణలతో ప్రాజెక్టును రద్దు చేసి ఎల్ అండ్ టీపై మొదటి దెబ్బ వేశారన్నారు. కక్ష సాధింపు చర్యలు భరించలేకే 2070 వరకు లీజు ఉన్న ఎల్ అండ్ టీ సంస్థ రాష్ట్రం నుంచి వాకౌట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రైజింగ్’ అని చెప్పుకొనే సీఎం.. పెట్టుబడులకు స్వర్గధామమైన రాష్ట్రం నుంచి ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఎందుకు పోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: Anaganaga Oka Raju promo: ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి ప్రోమో చూశారా.. యాడ్ అనుకుంటే పొరపాటే..

వెనుక పెద్ద కుట్ర..

ఐటీడీఏ ఉద్యోగులకు ఏడు నెలలుగా జీతాల్లేవు.. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే దిక్కులేదు.. ఆరు గ్యారెంటీల అమలుకు పైసల్లేవు.. ఇలాంటి పరిస్థితుల్లో, ప్రైవేటు సంస్థ మోస్తున్న భారాన్ని ప్రభుత్వం నెత్తికెత్తుకొని 15 వేల కోట్ల అప్పు చేయడం దేనికి? ఈ నిర్ణయాలతో ప్రజలపై ఈ భారాన్ని ఎందుకు మోపారు?” అని నిలదీశారు. మెట్రోకు ఎంత నష్టం? భూములు అమ్ముతారా? మాల్స్ అమ్ముతారా? చెప్పాలనిడిమాండ్ చేశారు. కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్రం ఇప్పటికే 2.20 లక్షల కోట్ల అప్పు చేసిందని, దానికి ఈ 15 వేల కోట్లు అదనమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఎల్ అండ్ టీకి కేటాయించిన 280 ఎకరాల విలువైన భూములపై సీఎం సన్నిహితులకు కన్ను పడిందని ఆరోపించారు.

ఆ భూములను అడ్డగోలుగా అమ్మకోవడానికి లేదా తమ అనుయాయులకు చెందిన సంస్థలకు కట్టబెట్టడానికే ఈ స్కెచ్ వేశారన్నారు. ఈ నిర్ణయంలో పారదర్శకత లేదని, కనీసం కేబినెట్ సబ్ కమిటీ వేయలేదని, కేబినెట్‌లో చర్చించలేదన్నారు. ‘చట్ మంగ్నీ, ఫట్ షాదీ’ అన్నట్టు నిర్ణయం తీసుకుంటారా? దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రులు రాష్ట్రం నుంచి ఇద్దరు ఉన్నారని వారు స్పందించాలన్నారు. ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. మేం సృష్టించిన 20 వేల కోట్ల ఆస్తిని మీ చేతిలో పెడితే, మీరు 15 వేల కోట్ల అప్పును ప్రజలపై రుద్దడాన్ని చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు.

స్కూటీలు ఎప్పుడిస్తావని..

“నన్ను అరెస్టు చేస్తారని కాంగ్రెస్ నేతలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారన్నారు. నేను పదేళ్లు మంత్రిగా చేశాను, లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమని చెప్పాను. నా నిజాయితీకి భయం లేదు. అరెస్టు చేసుకుంటే చేసుకోమనండి. కానీ ప్రజల పక్షాన వృద్ధులకు 4000 పెన్షన్, ఆడబిడ్డలకు 2500, విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తావని అడుగుతూనే ఉంటాం.. నిలదీస్తూనే ఉంటామన్నారు. ఫార్మూలా ఈ కారు రేసులో నేను ఏతప్పు చేయలేదని వెల్లడించారు. ప్రభుత్వం ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. మరో కార్పొరేట్ సంస్థను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో నాలుగైదు రోజుల్లో ఆధారాలతో సహా బయటపెడతానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పాలనలో ‘హైడ్రా’ అనే భూతంతో రియల్ ఎస్టేట్‌ను దెబ్బతీశారన్నారు. పెద్దల ఇండ్ల జోలికి వెళ్లని హైడ్రా పేదల ఇండ్లపై మాత్రం తన ప్రతాపం చూపిస్తుందని విమర్శించారు. ఇవాళ బ్లాక్ మెయిల్, బ్లాక్ మెయిలర్స్ కు హైడ్రానే కేంద్రంగా ఉందని ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్‌కే పట్టం కడతారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. స్మగ్లిగ్ కారు వాడుతూ తప్పు చేసినట్లయితే కేసు పెట్టండి.. ఏ విచారణ అయినా చేసుకోండి అని అన్నారు.

Also Read: Threat to Ajit Doval: కెనడా లేదా, అమెరికా రా.. అజిత్ ధోవల్‌కు ఖలిస్థానీ తీవ్రవాది పన్నున్ బహిరంగ వార్నింగ్

Just In

01

MP Kadiyam Kavya: అభివృద్ధి పనులకు నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ కడియం కావ్య

Lokah Chapter 2: ‘కొత్త లోక చాప్టర్ 2’పై అప్డేట్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్.. ఇది ఏ రేంజ్‌లో ఉంటుందో!

Bigg Boss Telugu Promo: ‘నీ లాంటి లత్కోర్ మాటలు మాట్లాడను’.. మాస్క్ మాన్‌పై నాగ్ మామ ఫైర్!

Jupally Krishna Rao: గోల్ఫర్లు ప్రీమియర్ గమ్యస్థానంగా హైదరాబాద్ తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

RV Karnan: బిల్డ్ డౌన్ టీడీఆర్‌లకు.. కమిషనర్ కర్ణన్ కీలక ఆదేశాలు!