Pawan Kalyan and Allu Arjun
ఎంటర్‌టైన్మెంట్

Allu Arjun: ఐకాన్ స్టార్ సర్‌ప్రైజ్.. ‘ఓజీ’ చూసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్!

Allu Arjun: మెగా కుటుంబ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న వార్త ఇది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’ (They Call Him OG) సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) వీక్షించారు. ఒక్క అల్లు అర్జున్ మాత్రమే కాదు.. దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎందరో సెలబ్రిటీలు సెప్టెంబర్ 24న ప్రీమియర్ షో చూశారు. ప్రశాంత్ నీల్, ప్రదీప్ రంగనాథన్ వంటి వారు కూడా ఈ సినిమాను వీక్షించిన వారిలో ఉన్నారు. హైదరాబాద్‌లోని విశ్వనాధ్ థియేటర్‌లో కొందరు, బాలా నగర్ విమర్ థియేటర్‌, గచ్చిబౌలి ఏఎమ్‌బి సినిమాస్ థియేటర్లలో మరికొందరు.. ఇలా సెలబ్రిటీలు ఈ సినిమాను చూసేందుకు క్యూ కట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్ ఏఎమ్‌బీ సినిమాస్‌లో ‘ఓజీ’ సినిమాను చూశారు. అల్లు అర్జున్ ఈ సినిమాను థియేటర్‌లో చూస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Also Read- Balineni: అది అవాస్తవం.. పవన్ కళ్యాణ్ సినిమాలపై చేసిన వ్యాఖ్యలకు బాలినేని క్లారిటీ!

‘ఓజీ’ థియేటర్‌లో పుష్పరాజ్..

ఈ సర్‌ప్రైజ్ వీడియో మెగా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. గత కొంతకాలంగా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య బాండింగ్ సరిగా లేదని, మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో మెగా ఫ్యామిలీ హ్యాపీగా లేదనే విషయానికి తెరపడేలా ఈ మధ్య కొన్ని సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. అందులో ఇదొకటిగా అభిమానులు వర్ణిస్తున్నారు. ‘ఓజీ’ సినిమా (OG Movie) ఇప్పటికే థియేటర్లలో ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. పవన్ కళ్యాణ్ స్టైల్, సుజీత్ దర్శకత్వం, థమన్ నేపథ్య సంగీతం సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ స్వయంగా థియేటర్‌కు వచ్చి సినిమా చూడటం పట్ల ఇటు ‘ఓజీ’ టీమ్‌కు, అటు అభిమానులకు మరింత సంతోషాన్నిచ్చింది. అన్నా నువ్వు మావాడివే.., ఆ రోజు అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది అన్నా.. అంటూ ఫ్యాన్స్ ఈ వీడియోకు రియాక్ట్ అవుతున్నారు. అంతేకాదు, త్వరగా ‘ఓజీ’పై రివ్యూ ఇచ్చెయ్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Also Read- Balakrishna Controversy: బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి- అఖిల భారత చిరంజీవి యువత

రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగితే..

ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్ పరంగా కూడా తీరిక లేకుండా ఉన్నారు. ఇటీవలే ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో రూల్ చేసిన అల్లు అర్జున్, సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు. ఆ భారీ విజయం తర్వాత, బన్నీ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్, ప్రముఖ దర్శకుడు అట్లీతో చేయబోయే సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ ‘ఓజీ’ సినిమాను థియేటర్‌కు వెళ్లి చూడటం ద్వారా, పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని, కుటుంబ బంధాన్ని అల్లు అర్జున్ చాటుకున్నారు. ఇలాంటివి ఇంకా రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగితే.. ఇప్పటి వరకు ఉన్న అపోహలు మొత్తం పోతాయని, వారి ఫ్యామిలీల మధ్య, ఫ్యాన్స్ మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని అంతా భావిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Treatment Rates: ప్రైవేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీపై సర్కారు స్క్రీనింగ్.. ట్రీట్మెంట్ రేట్లన్నీ ఒకేలా ఉండేలా ప్లాన్!

Delhi Red Fort Blast: ఢిల్లీ పేలుడు మిస్టరీని ఛేదిస్తున్న పోలీసులు.. పుల్వామా వ్యక్తికి నకిలీ పత్రాలతో కార్ విక్రయం

Hydraa: మాధాపూర్‌లో అపురూపమైన ప్రాంతం అందుబాటులోకి రానుంది: కమీషనర్ రంగనాథ్

Telangana Education: ప్రభుత్వం మరో సంచలనం నిర్ణయం.. కేజీబీవీల ఆధునీకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

Delhi Red Fort Blast: ఢిల్లీ పేలుడు కేసులో కీలక మలుపు.. డాక్టర్‌ ఉమర్‌ ఫోటోతో కొత్త ఆధారాలు వెలుగులోకి