Telangana Tourism: తెలంగాణలో తొలిసారి కన్ క్లేవ్
Telangana Tourism ( image credit: twitter)
Telangana News

Telangana Tourism: తెలంగాణలో తొలిసారి కన్ క్లేవ్..పెట్టుబడులే లక్ష్యంగా టూరిజంశాఖ ప్రణాళికలు

Telangana Tourism: 10వేలకోట్ల పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా టూరిజంశాఖ (Telangana Tourism) ప్రణాళికలు రూపొందిస్తుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం నిర్వహించని విధంగా తొలిసారి టూరిజంశాఖ పెట్టుబడుల కోసం కన్ క్లేవ్ నిర్వహిస్తుంది. దీంతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం, టూరిస్టులను ఆకర్షించడం, ప్రభుత్వానికి ఆదాయానికి సమకూర్చాలని భావిస్తుంది. దేశంలోనే మోడల్ టూరిజం అంటే తెలంగాణ అనేవిధంగా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. అందుకోసం ఇప్పటికే నూతన టూరిజంపాలసీని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ కన్ క్లేవ్ తో టూరిజంలో నూతనశకంను ప్రారంభించేందుకు సిద్ధమైంది.

Also Read: Jagapathi Babu: రూ. 800 కోట్ల మోసం.. ఈడీ విచారణకు జగపతి బాబు

టూరిజం ప్రాంతాల అబివృద్ధిపై ఫోకస్

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టూరిజం ప్రాంతాల అబివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కొన్ని ప్రాంతాల అభివృద్ధి చేపడుతుంది. మరోవైపు కేంద్రం ఇచ్చే నిధులతోనూ పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే టూరిజంను మరింత బలోపేతం చేయాలని భావించిన ప్రభుత్వం ఈ నెల 27న మాదాపూర్ లోని సాంప్రదాయవేదిక శిల్పారామంలో టూరిజంశాఖ ఆధ్వర్యంలో కన్ క్లేవ్ నిర్వహిస్తుంది. ఈ కన్ క్లేవ్ లో 10వేల కోట్ల పెట్టుబడులకు బడా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పదుల సంఖ్యలో కంపెనీలు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఓ కంపెనీ 2వేలకోట్ల పెట్టుబడులు పెడతామని ప్రభుత్వానికి తెలిపినట్లు సమాచారం. ఈ కాన్ క్లేవ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారని, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు సమాచారం. టూరిజంలో రాబోయే పెట్టుబడులతో పర్యటక ప్రాంతాల దశమారనుంది.

 శిల్పారామంతోపాటు ట్యాంక్ బండ్ పై కార్నివాల్ ను ఏర్పాటు

అదే రోజూ కార్నివాల్ ను సైతం ప్రభుత్వం నిర్వహించబోతుంది. శిల్పారామంతోపాటు ట్యాంక్ బండ్ పై కార్నివాల్ ను ఏర్పాటు కు సిద్ధమవుతుంది. పలు స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రజలను రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల విశిష్టతను వివరించబోతున్నట్లు సమాచారం. విస్తృత ప్రచారం చేసి గతంలో ఎప్పుడు లేని విధంగా టూరిజం బలోపేతానికి చర్యలు తీసుకోబోతున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు పలు సందర్భాల్లో పర్యాటకం కేవలం వినోదం కాకుండా ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ ద్వారా పెట్టుబడుల‌కు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నదన్నారు. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టండి.. వారికి పూర్తిగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామ‌ని ఈ కన్ క్లేవ్ లో పారిశ్రామిక వేత్తలకు భరోసా కల్పించనున్నారు. ప్రపంచస్థాయి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని వ‌న‌రులు తెలంగాణలో ఉన్నాయ‌ని వివరించనున్నారు. ఏది ఏమైనా ఈ కన్ క్లేవ్ పర్యాటక రంగంలో మైలురాయిగా నిలువనుంది.

 Also Read: Balakrishna Controversy: బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి- అఖిల భారత చిరంజీవి యువత

Just In

01

BSNL WiFi Calling: మెరుగైన కనెక్టివిటీ కోసం దేశమంతటా BSNL Wi-Fi కాలింగ్ లాంచ్

Harish Rao on CM Revanth: మూసి కంపు కంటే.. సీఎం నోటి కంపే ఎక్కువ.. హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్

Drive OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన ఆది పినిశెట్టి ‘డ్రైవ్’..

Chamala Kiran Kumar Reddy: యూరియా సరఫరా విషయంలో కేటీఆర్ విమర్శలు ఫేక్: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Rohini Statement: మహిళలకే నిబంధనలా? మగవారికి పద్ధతులు ఉండవా?.. నటి రోహిణి చురకలు