Bigg Boss Telugu Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎవరి అంచనాలకు అందకుండా దూసుకుపోతోంది. గత వారం ఫ్లోరా లేదా శ్రీజ, ప్రియలలో ఒకరు కచ్చితంగా ఎలిమినేష్ అవుతారని అందరూ భావించగా.. అనూహ్యంగా మర్యాద మనీష్ ను ఇంటి నుంచి బయటకు పంపి బిగ్ బాస్ షాకిచ్చారు. అయితే గత సీజన్లలో లాగానే ఈ వీక్ కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ఉంటుందని అంతా ముందుగానే గెస్ చేశారు. అయితే శుక్రవారం ఎపిసోడ్ లోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ చోటుచేసుకుంది. తాజాగా విడుదలైన సెకండ్ ప్రోమోలో సంజనా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు.
అర్ధరాత్రి నిద్రలేపి..
శుక్రవారం (సెప్టెంబర్ 26) ఎపిసోడ్ కు సంబంధించిన సెకండ్ ప్రోమో.. బిగ్ బాస్ వీక్షకులను ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఇంటి సభ్యులు గాఢ నిద్రలో ఉండగా వారిని డేంజర్ సైరన్ మోగించి మరి బిగ్ బాస్ నిద్రలేపడం ప్రోమోలో చూడవచ్చు. ఈ వారం ప్రారంభంలో సభ్యుల పేర్లతో సీడ్స్ ఇచ్చిన బిగ్ బాస్.. అందులో రెడ్ సీడ్ వచ్చిన వారికి ఒక ఆశ్చర్యకరమైన పవర్ ఇచ్చారు. ఇంటి నుంచి ఒక సభ్యుడ్ని బయటకు పంపే అవకాశం వారికి కల్పించారు.
సీరియస్ డిస్కషన్
దీంతో రెడ్ సీడ్ అందుకున్న భరణి, మాస్క్ మ్యాన్, పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, రాము.. ఎవరిని పంపించాలన్న దానిపై డిస్కస్ చేసుకోవడాన్ని ప్రోమోలో చూపించారు. తరుచూ ఇంట్లో దొంగతనాలకు పాల్పడి తోటి సభ్యులను రెచ్చగొడుతున్న కారణంగా తాను సంజనాను ఇంటి నుంచి బయటకు పంపాలని భావిస్తున్నట్లు మాస్క్ మ్యాన్ తేల్చి చెప్పారు. అటు రాము, డిమోన్ పవన్ సైతం సంజనపై ఆరోపణలు చేయడాన్ని ప్రోమోలో చూపించారు.
సంజనా ఎలిమేషన్..
రెడ్ సీడ్ పొందిన సభ్యులు తమ డిస్కషన్ తర్వాత బయటకు రాగా.. ఎవరిని బయటకు పంపాలని నిర్ణయించుకున్నారని బిగ్ బాస్ వారిని ప్రశ్నిస్తారు. దీంతో మాస్క్ మ్యాన్ స్పందిస్తూ తాము సంజనాను బయటకు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్తారు. దీంతో ఒక్కసారిగా తోటి సభ్యులు షాకవుతారు. అయితే తనను కార్నర్ చేసి బయటకు పంపుతున్నారని సంజన ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనల్ గా వారి నిర్ణయాన్ని రెస్పెక్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చివరకు తన బ్యాగ్ తీసుకొని ఇంటి బయటకు సంజన వెళ్లడాన్ని ప్రోమోలో చూడవచ్చు.
Also Read: Ind vs Pak Asia Cup Final: పాక్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్.. టీమిండియాను వేధిస్తున్న చెత్త రికార్డు.. ఓటమి తప్పదా?
ఇమ్మాన్యుయేల్ కన్నీరుమున్నీరు
సంజన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఇంటి సభ్యుల్లోని కొందరు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ కన్నీరు మున్నీరుగా విలపించడం ప్రోమోలో చూపించారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఇమ్మాన్యుయేల్ ఆపుకుంటుండగా.. తోటి ఇంటి సభ్యులు అతడ్ని వారించే ప్రయత్నం చేశారు. మెుత్తం సెకండ్ ప్రోమో కాస్త షాకింగ్.. మరికొంత ఏమోషనల్ గా ఉందనే చెప్పాలి.