Puri Jagannadh: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ప్రేక్షకులతో పంచుకున్నారు నిర్మాతలు. అసలు ఈ సినిమా టైటిల్ కూడా ఏంటో తెలియకుండా షూటింగ్ జరుగుతోంది. ఈ టైటిల్ ఏంటో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని గురించి ఎదురు చూసే అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది మూవీ టీం. టైటిల్, టీజర్ ఒకే సారి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నవారు. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ సినిమాకు టైటిల్, టీజర్ ను సెప్టెంబర్ 28 విడుదల చేయనున్నారు. దీనిని చూసిన పూరీ జగన్నాధ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురు చూస్తున్న పూరీ ఫ్యాన్ కు ఈ సినిమాతో మంచి విజయం దొరుకుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Read also-CM Revanth Reddy: తమిళనాడు మోడల్‌లో తెలంగాణ విద్యా రంగం.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలుగు సినిమా దిగ్గజం పూరీ జగన్నాథ్ మరోసారి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో రానున్నాడు. ఈ సారి అతని దర్శకత్వంలో తమిళ సూపర్‌స్టార్ విజయ్ సేతుపతి నటిస్తున్నారు. టాబు, సమ్యుక్త మేనన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ అన్‌టైటిల్డ్ మూవీ, తాత్కాలికంగా ‘పూరీసేతుపతి’ అని పిలుస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటుంది. ఇది ఒక న్యూ-ఏజ్ సోషల్ డ్రామా, ‘రా అండ్ రియల్’ సినిమాటిక్ జర్నీగా వర్ణించబడుతోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రం, చర్మి కౌర్ ప్రెజెంటేషన్‌లో జేబీ మోషన్ ఆర్ట్స్‌తో కలిసి రూపొందుతోంది. ఈ సినిమా ఎమోషనల్ డెప్త్‌తో కూడిన కథగా ఉంటుందని సమాచారం. ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాలు తీసిన పూరీ ఈ సారి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అవ్వాలని చూస్తున్నారు. అందుకే ఇలాంటి కథలతో సినిమా తీస్తున్నారని సమాచారం. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలిమరి. టైటిల్ టీజర్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. పూరీ ఈ సారి హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు.
Read also-Ambati Rambabu: అంబటి రాంబాబుకు ఇది తెలియదు అనుకుంటా.. ‘ఓజీ’ గురించి మళ్లీ..
తెలుగు సినిమా పరిశ్రమలో ‘పోకిరి’తో మాస్టర్ మైండ్‌గా పేరుపొందిన పూరీ జగన్నాథ్, ఒక మల్టీ-టాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్. డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్‌రైటర్, ఒక్కోసారి యాక్టర్‌గా కూడా కనిపించే ఈయన, తన యూనిక్ స్టైల్‌తో పాన్-ఇండియా లెవెల్‌లో గుర్తింపు పొందారు. 2000లలో తెలుగు సినిమాను షేక్ చేసిన ఈయన, ఇప్పటికీ కొత్త ప్రాజెక్టులతో ఫ్యాన్స్‌ను ఎక్సైట్ చేస్తున్నారు. కన్నడలో పూనీత్ రాజ్‌కుమార్‌ను ‘అప్పు’ (2002)తో లాంచ్ చేశారు. యాక్టింగ్‌లో క్యామియోలు.. ‘బిజినెస్‌మ్యాన్’లో టాక్సీ డ్రైవర్, ‘టెంపర్’లో బైకర్, ‘గాడ్‌ఫాదర్’ (2022)లో గోవర్ధన్. ఫైట్ మాస్టర్స్‌తో (విజయన్, అలాన్ అమిన్) క్లోజ్ వర్కింగ్ ఫేమస్. అయితే ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
