Godari Gattupaina
ఎంటర్‌టైన్మెంట్

Godari Gattupaina: సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ సోల్ ఫుల్ ఫస్ట్ బ్రీజ్ అదిరింది

Godari Gattupaina: ‘గోదారి గట్టుపైన’ అనే లిరిక్స్‌తో వచ్చిన పాటలన్నీ పెద్ద హిట్టయ్యాయి. ఇటీవల వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthi Ki Vastunnam) సినిమాలోని ‘గోదారి గట్టుపైన’ పాట ఎంత పెద్ద సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడా పాటలోని లిరిక్‌ని టైటిల్‌గా పెట్టి, సినిమా చేస్తున్నారు. ‘మేమ్ ఫేమస్’తో స్ట్రాంగ్ డెబ్యు ఇచ్చిన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) హీరోగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి ‘గోదారి గట్టుపైన’ (Godari Gattupaina) అనే టైటిల్‌ని ఖరారు చేసి, మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ఈ మధ్య అప్డేట్స్ రావడం లేదు కానీ, ఒక నెలకు ముందు ఏదో రకంగా ఈ సినిమాను వార్తలలో ఉండేలా మేకర్స్ ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. మళ్లీ ఈ సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ మొదలు పెట్టారు. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్‌కు ఫస్ట్ వెంచర్‌గా నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమాతో MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిధి ప్రదీప్ (Nidhi Pradeep) హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ బ్రీజ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Norma Movie: అత్తతో అల్లుడి రహస్య బంధం.. ఊపేస్తున్న సినిమా.. సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్!

ప్రేమికుల మనసును దోచేస్తోంది

‘గోదారి గట్టుపైన’ ఫస్ట్ బ్రీజ్ విషయానికి వస్తే.. లైట్ హౌస్ పైకి తన ప్రేమికురాలిని తీసుకెళ్లిన హీరో, గోదావరి సముద్రంలో కలిసిపోయే అద్భుత దృశ్యం చూపించే సీన్‌తో ఈ వీడియో ప్రారంభమైంది. ‘ఇదే సంగమం.. ఇక్కడే గోదారి సముద్రంలో కలుస్తుంది. ప్రకృతి ఎంత విచిత్రమైందో కదా. మంచినీరు ఉప్పునీరు వేరువేరు తత్వాలు అయినప్పటికీ రెండు ఒకటిగా కలిసిపోతున్నాయి. మనుషులు కూడా ఇలా బేధాభిప్రాయాలు లేకుండా ఒకటిగా కలిసిపోతే ఈ మత భేదాలు అనేవి ఉండవు కదా’ అని సుమంత్ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ప్రేమికుల మనసును దోచేస్తోంది. ఈ ఫస్ట్ బ్రీజ్ చాలా ఫ్రెష్ అండ్ సోల్ ఫుల్ గా వుంది. తన రచన, దర్శకత్వంతో సుభాష్ చంద్ర ఆకట్టుకున్నారు. సుమంత్ ప్రభాస్ తన పాత్రలో ఇమిడిపోతే, నిధి ప్రజెన్స్ కట్టిపడేసింది. జగపతి బాబు పాత్రకి ఇచ్చిన పరిచయం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

Also Read- Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య, కామినేని సంభాషణపై స్పందించిన చిరు.. అసలు వాస్తవం ఇదేనట!

విజువల్స్ చాలా నేచురల్‌

సాయి సంతోష్ చిత్రీకరించిన విజువల్స్ చాలా నేచురల్‌గా ఉండటమే కాకుండా, కథలోని భావోద్వేగాలను మరింత అందంగా మలిచాయి. నాగ వంశీ కృష్ణ అందించిన సంగీతం కట్టిపడేస్తుంది. ప్రావల్య ప్రొడక్షన్‌ డిజైనర్‌గా, అనిల్ కుమార్ పి ఎడిటర్‌గా, నాగార్జున సౌండ్‌ డిజైనర్‌గా ఈ సినిమాకు పని చేస్తున్నారు. హృదయాన్ని హత్తుకునే కథా నేపథ్యం, సహజమైన నటన, క్రియేటివ్ టచ్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతి అందించబోతోందనేది ఈ ఫస్ట్ బ్రీజ్ చెప్పకనే చెప్పేసింది. రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి వంటి వారంతా ఇతర పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Godari Gattupaina: సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ సోల్ ఫుల్ ఫస్ట్ బ్రీజ్ అదిరింది

Jatadhara: సుధీర్ బాబు ‘సోల్ ఆఫ్ జటాధర’.. ఎలా ఉందంటే?

Sujeeth: ‘ఓజీ 2’లో ప్రభాస్.. సుజీత్ ఏమన్నారంటే..

Hyderabad Metro: ఇకపై సర్కారు మెట్రో రైలు.. చర్చలు సఫలం

US Deportation: 73 ఏళ్ల పెద్దావిడను అమానవీయంగా భారత్ తిప్పిపంపిన అమెరికా.. ఇంతదారుణమా?