Sujeeth On OG2
ఎంటర్‌టైన్మెంట్

Sujeeth: ‘ఓజీ 2’లో ప్రభాస్.. సుజీత్ ఏమన్నారంటే..

Sujeeth: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఓజాస్ గంభీరగా నటించిన కాదు కాదు గర్జించిన చిత్రం ‘ఓజీ’ (OG). సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలున్న విషయం తెలియంది కాదు. సెప్టెంబర్ 24 రాత్రి నుంచి ప్రత్యేక షోలతో ‘ఓజీ’ చిత్ర ప్రదర్శనలు మొదలయ్యాయి. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టే దిశగా థియేటర్లలో దుమ్ము రేపుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని విధంగా దర్శకుడు సుజీత్ చూపించిన తీరుకి ఫ్యాన్స్ అందరూ ఫిదా అవుతున్నారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, సుజీత్ దర్శకత్వ ప్రతిభ, తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం, రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసల సినిమాటోగ్రఫీ కలిసి.. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయి చిత్రంగా మలిచాయనేలా టాక్ నడుస్తుండగా.. ఆట ఆటకు కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంతో చిత్ర యూనిట్ తమ సంతోషాన్ని తెలిపేందుకు మీడియా సమావేశం నిర్వహించింది.

Also Read- Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య, కామినేని సంభాషణపై స్పందించిన చిరు.. అసలు వాస్తవం ఇదేనట!

ఆయనకు వీరాభిమానిని

ఈ కార్యక్రమంలో దర్శకుడు సుజీత్ (Director Sujeeth) మాట్లాడుతూ.. ‘ఓజీ’.. దాదాపు మూడేళ్ళ ప్రయాణం. మొదటి రోజు నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, మా పక్కనే ఉండి.. మాకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసిన నిర్మాతలు దానయ్య, కళ్యాణ్‌లకు కృతఙ్ఞతలు. ‘ఓజీ’ కథకి ఇంతటి భారీతనం రావడానికి కారణమైన పవర్‌స్టార్‌కు మొదటగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఆయనకు వీరాభిమానిని అని అందరికీ తెలుసు. ‘జానీ’ సినిమా సమయం నుంచి ఆయనను ఒక్కసారి కలిస్తే చాలు అనుకునేవాడిని. అలాంటిది ఇప్పుడాయనతో సినిమా చేయడం, అది బ్లాక్ బస్టర్ టాక్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. తమన్, నవీన్ నూలి, రవి చంద్రన్ ముగ్గురూ ఈ సినిమాకి మూడు పిల్లర్లు‌గా నిలిచారు. వారి వల్లే సినిమా ఇంత గొప్పగా వచ్చింది. అందరిలో తమన్ అందరికంటే ఎక్కువగా ఈ సినిమాని నమ్మాడని చెప్పుకొచ్చారు.

Also Read- Prasads Multiplex: మేము బాధ్యత వహించలేము.. ‘ఓజీ’ ఫ్యాన్స్‌కి ప్రసాద్స్ మల్టీప్లెక్స్ రిక్వెస్ట్!

సుజీత్ సినిమాటిక్ యూనివర్స్‌లో ప్రభాస్

ఇంకా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఇందులో ‘సాహో’కు లింక్ పెట్టారు కదా.. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్‌లో ప్రభాస్ కూడా యాడ్ అవుతారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇంకా అలాంటిదేమీ అనుకోలేదు. ప్రభాస్ (Prabhas) అన్న నాకు బాగా తెలుసు. ‘ఓజీ’తో కళ్యాణ్ సార్‌తో బంధం ఏర్పడింది. ఈ యూనివర్స్‌లో ‘ఓజీ 2’కి ఇద్దరు హీరోలు యాడ్ అవడంపై ఇకపై ఆలోచించాలని తెలిపారు. అలాగే ‘జానీ’ సినిమా నుంచి ఆ సాంగ్స్ తీసుకోవడానికి కారణం చెబుతూ.. ఆ సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. అందులో నుంచి ఏదైనా రీ క్రియేట్ చేయాలని అనుకున్నాను. థమన్, రమణ గోగుల కలిసి నా కోరికను నెరవేర్చారని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత దానయ్య, హీరోయిన్ ప్రియాంక మోహన్, సంగీత దర్శకుడు థమన్ వంటి వారంతా పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Godari Gattupaina: సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ సోల్ ఫుల్ ఫస్ట్ బ్రీజ్ అదిరింది

Jatadhara: సుధీర్ బాబు ‘సోల్ ఆఫ్ జటాధర’.. ఎలా ఉందంటే?

Sujeeth: ‘ఓజీ 2’లో ప్రభాస్.. సుజీత్ ఏమన్నారంటే..

Hyderabad Metro: ఇకపై సర్కారు మెట్రో రైలు.. చర్చలు సఫలం

US Deportation: 73 ఏళ్ల పెద్దావిడను అమానవీయంగా భారత్ తిప్పిపంపిన అమెరికా.. ఇంతదారుణమా?