The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
the-rajasab (image :x)
ఎంటర్‌టైన్‌మెంట్

The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ది రాజాసాబ్’ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?

The Raja Saab: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది రాజా సాబ్’ యాక్షన్, రొమాన్స్, డ్రామాతో ఒక గ్రాండ్ సినిమాటిక్ అనుభవాన్ని అందించనుంది. ‘ది రాజా సాబ్’ సినిమాను మారుతి దర్శకత్వంలో తెరకెక్కతుంది. ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఎం స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నిర్మితమవుతోంది. ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోందని, రొమాంటిక్, భావోద్వేగ ఎలిమెంట్స్‌తో కూడిన కథాంశం ఉంటుందని సమాచారం. సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో కూడా విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-Local Body Elections: స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం జీవో పై కసరత్తు.. మరోవైపు అధికారులకు ట్రైనింగ్!

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా ట్రైలర్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ ట్రైలర్ సెన్సార్ బోర్డ్ నుండి U/A సర్టిఫికేట్ పొందింది. దాని రన్‌టైమ్ 3 నిమిషాల 30 సెకండ్లుగా ఉంది. దీనిని అక్టోబర్ 2 నుండి ‘కాంతార చాప్టర్ 1’ సినిమాతో పాటు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్ ప్రభాస్ డైనమిక్ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు భావోద్వేగ హైలైట్స్‌తో ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ది రాజా సాబ్ సినిమా ఒక భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.

Read also-FSD Officer Controversy: మెడికల్ కార్పొరేషన్‌లో పెత్తనం అంతా ఆయనదే?.. చక్రం తిప్పుతున్న ఎఫ్​ఎస్‌డీ ఆఫీసర్

బాహుబలి, సలార్ వంటి భారీ విజయాల తర్వాత, ప్రభాస్ నటించిన ప్రతి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ది రాజా సాబ్ కూడా అతని స్టార్‌డమ్‌కు తగ్గట్టుగా ఒక భారీ బ్లాక్‌బస్టర్‌గా రూపొందుతోందని అభిమానులు ఆశిస్తున్నారు. దర్శకుడు మారుతి, గతంలో రొమాంటిక్ కామెడీ చిత్రాలకు పేరుగాంచినవారు, ఈ సినిమాతో ఒక కొత్త జోనర్‌లో తన సత్తా చాటనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. ఈ సినిమా సంక్రాతి సందర్భంగా జనవరి 9, 2025న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, భాషల్లో విడుదలకానుంది.

Just In

01

Remand Prisoner Died: సబ్‌జైలులో రిమాండ్ ఖైదీ మృతి.. కారణం ఏంటంటే?

Hindu Family Home Fire: బంగ్లాదేశ్‌లో ఆగని ఊచకోత.. హిందువులే టార్గెట్.. ఐదు ఇళ్లకు నిప్పు

Emmanuel: బిగ్ బాస్‌ షో పై ఇమ్మానుయేల్ సంచలన వ్యాఖ్యలు

Samsung Galaxy S26 Plus: లాంచ్‌కు ముందు లీకైన Samsung Galaxy S26 Plus ఫీచర్లు

Women Driver Job Mela: హైదరాబాద్ మహిళలకు ఉపాధి అవకాశాలు.. సజ్జనార్ కీలక ప్రకటన