Nagarjuna Akkineni: సోషల్ మీడియా వాడకం రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్ళు వాడుతున్నారు. ఇక్కడికి వరకు బాగానే ఉంది కానీ సినీ సెలెబ్రిటీలను కూడా వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఇది ట్రెండ్ లాగా మారింది. అయితే, నటీ నటులు దీన్ని ఒప్పుకోవడం లేదు. మా పర్మిషన్ లేకుండా ఎవరూ కూడా మా ఫోటోలు వాడొద్దని చెబుతున్నారు. పేరు, ఫోటో సినిమా వాళ్ళది.. డబ్బులు మాత్రం వాడుకునే వాళ్ళవి. ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ఫైర్ అవుతున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలను అనధికారికంగా ఉపయోగించకుండా నిషేధం విధించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కారియా విచారణ చేపట్టనున్నారు. అంతక ముందు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అనిల్ కపూర్ వంటి బాలీవుడ్ నటులు కూడా ఇలాంటి వ్యక్తిగత రైట్స్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.