Thummala Nageswara Rao: ఆయిల్ పెడ్ అధికారుల అధికారుల తీరుమారడం లేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) ఉద్యోగుల సమయపాలన పాటించాలని ఆదేశించారు. తీరుమార్చుకొని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. అయినా అధికారులు మాత్రం ఆదేశాలను పట్టించుకోవడంలేదని స్పష్టమవుతుంది. హైదరాబాదు లోని తెలంగాణ ఆయిల్ ఫెడ్ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం నాలుగోసారి ఆకస్మికంగా తనికీ చేశారు. ఉదయం 10.30 గంటలకు సైతం కొంతమంది ఉద్యోగులు విధులకు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో విధులకు రాని ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శంకరయ్యకు సూచించారు. వ్యవసాయశాఖ కింద ఉన్న అన్ని శాఖలు మరియు కార్పోరేషన్లు సంబంధించిన ఉద్యోగులు సకాలంలో హాజరయ్యేట్టు అన్ని శాఖల వివరాలు రోజువారిగా లైవ్ అప్డేట్ ఉండే విధంగా డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శికి సూచించారు. మరోసారి రిపీట్ కావద్దని మంత్రి ఉద్యోగులను హెచ్చరించారు.
ఆయిల్ ఫాం సాగు పెంచాలి..
రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడేళ్లలో 10లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగుపెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. అన్ని ఉమ్మడి జిల్లాలలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆయిల్ ఫెడ్ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగార నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని, ఖమ్మం జిల్లా కల్లూరుగూడంలో, గద్వాల జిల్లా బీచుపల్లిలో, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో, పెద్దపల్లి జిల్లా పెద్దరాత్పల్లిలో, ఖమ్మం జిల్లా అంజనాపురం లో, ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఆయిల్ పాం నర్సరీలలో అధిక దిగుబడినిచ్చే తక్కువ ఆకు నిడివి గల, తక్కువ ఎత్తు పెరిగే మేలైన రకాలను పెంచాలని, ప్రపంచవ్యాప్తంగా అనుభవం ఉన్న కంపెనీలతో మాట్లాడి శాస్త్రవేత్తల సూచనలతో నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు.
రిఫైనరీ యూనిట్ శంకుస్థాపన..
ఆయిల్ ఫెడ్ నర్సరీలలో రానున్న కాలంలో డిమాండుకు అనుగుణంగా 10 లక్షల మొక్కలు పెంచాలని సూచించారు. సిద్దిపేటలో ఎలాంటి కాలుష్యానికి తావులేని అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబడిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సీఎం రేవంత్ రెడ్డితో ఓపెనింగ్ కు సిద్ధంగా ఉందని తెలిపారు. అదే విధంగా రిఫైనరీ యూనిట్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను కాపాడే దిశలో పంట మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లో ఎన్ఎంఈఓపీ పథకంలో దేశంలోనే ఆయిల్ పెడ్ ప్రథమ స్థానంలో ఉందని, ఆదిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్తుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు అన్ని జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సమన్వయంతో ప్రతి జిల్లా లో రివ్యూ చేసి ఆయిల్ ఫామ్ సాగుకు విస్తీర్ణం పెరగడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సరైన పురోగతి లేని ప్రైవేట్ ఆయిల్ ఫామ్ కంపెనీలపై తగు చర్యలను తీసుకోవాలని వీలైతే ఆ కంపెనీ లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందన్నారు. ఆయిల్ ఫెడ్ లో త్వరలోనే కొత్త ఉద్యోగస్తుల నియమాకాలతో బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు.
Also Read: Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. ఆదివాసి అడవి బిడ్డలకు తీరని తిప్పలు