Sandeep Raj: ప్రముఖ సినీ అభిమాని, దర్శకుడు సందీప్ రాజ్ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. 8 సంవత్సరాల క్రితం చేసిన ఒక పాత పోస్ట్‌ను తిరిగి పంచుకుని సినిమా ప్రపంచంపై తనకున్న అభిప్రాయం ఏమీ మారలేదని ఇందులో తెలియజేశారు. 2017, సెప్టెంబర్ 20న రాసిన ఈ పోస్ట్‌లో, అతను ఒక పెద్ద చిత్రం విడుదలకు ముందు తన ఉత్సాహాన్ని పంచుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అభిమానం, జోష్‌లో మార్పు రాలేదని ‘ఓజీ’ విడుదలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ పోస్ట్ చేశారు. ఆయన పాత పోస్ట్‌ను ఒకసారి గమనిస్తే..
కొత్త ఉత్సాహం ఇస్తుందనే నమ్మకం
‘‘జీవితం ఎన్ని సం*లు నాకుతున్నా, లైఫ్ ఎన్ని కష్టాల్లో ఉన్నా, పనులు ఆగిపోయినా, బ్రెయిన్ ఆలోచనలు లేక అల్లాడి పోతున్నా, బాస్ తిట్టినా, లవర్ అలిగినా.. పెద్ద సినిమా రిలీజ్ ముందు రోజు.. ఒక పండగ వాతావరణం, రేపు మనకి థియేటర్ అనే ఒక కొత్త ప్రపంచం, కొత్త ఉత్సాహం ఇస్తుంది అనే నమ్మకం’’ అని రాసి ఉంది. సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా ఆయన రాసిన మాటలు వర్తిస్తాయి అని ‘ఓజీ’ మూవీ ప్రస్తావనను తీసుకొచ్చారు. 8 సంవత్సరాల క్రితం నేను చేసిన పోస్ట్ ఇప్పటికీ రిలవెంట్. ఇంకా కొన్ని గంటలే.. అని ‘ఓజీ’ సినిమాను ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్.. ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై ఫ్యాన్స్ కూడా ‘అవును అన్నా.. మీరు చెప్పింది వంద శాతం నిజం’ అని కామెంట్స్ చేస్తున్నారు.
సెలబ్రిటీలు కూడా వెయిటింగ్
ఒక్క సందీప్ రాజ్ మాత్రమే కాదు.. ‘ఓజీ’ సినిమా కోసం సెలబ్రిటీలు ఎందరో వేచి చూస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు, ఈ సినిమాను మొదటి నుంచి ప్రమోట్ చేస్తుంది కూడా వేరే సినిమా వాళ్లే. ఈ సినిమాకు సంబంధించి పెట్టిన ఒక్క ఫంక్షన్ కూడా సరిగా జరగలేదు. అయినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు ఎగబడుతున్నారు. ప్రీమియర్స్ అన్ని ఫుల్ అయ్యాయి. కలెక్షన్ల పరంగా మొదటి రోజు ఈ సినిమా సంచలనాలను క్రియేట్ చేయబోతుందనే రిపోర్ట్స్ కూడా వచ్చేశాయి. ఒక్కసారి పాజిటివ్ టాక్ బయటకు వస్తే.. ఈ సినిమాను ఆపడం ఇంక ఎవరితరం కాదు. పవన్ కళ్యాణ్ రేంజ్, స్థాయి ఏంటో అందరికీ మరోసారి అర్థమవుతోందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ వంటి వారంతా ఇతర కీలక పాత్రలు పోషించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు