Reba Monica John: ‘కూలీ’ సినిమాలోని తన పాత్రపై హీరోయిన్ రెబా మోనికా జాన్ (Reba Monica John) సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో ఆమె పాత్రకు ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. ఇంకా చెప్పాలంటే, అసలు ఆమె ఈ సినిమాలో నటించిన విషయం కూడా చాలా మందికి తెలియదు. అలాంటి పాత్రలో రెబా నటించింది. అయినా కూడా సినిమా విడుదలకు ముందు ఒకలా, విడుదల తర్వాత మరోలా ఆమె మాట్లాడటం ఇప్పుడు పలు చర్చలకు తావిస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రమ్‌లో తన అభిమానులతో కాసేపు చిట్‌చాట్ నిర్వహించింది. ఈ చిట్‌చాట్‌లో ఆమెకు ‘కూలీ’ (Coolie) సినిమాలోని పాత్రపై ప్రశ్న ఎదురైంది. ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న క్రమంలో, ఎటువంటి ప్రాముఖ్యత లేని పాత్ర చేయడం ఎందుకు? అనే ప్రశ్నకు రెబా షాకింగ్‌గా రియాక్టైంది.
ఆశించిన స్థాయిలో నా పాత్ర లేదు
‘‘ఏం చేస్తాం.. కొన్ని సార్లు మనం అనుకున్నవేవీ జరగవు. నేను ఊహించిన, ఆశించిన స్థాయిలో అందులో నా పాత్ర లేదు. సినిమా విడుదల తర్వాత నేను కూడా చాలా డిజప్పాయింట్ అయ్యాను. కానీ, సూపర్ స్టార్ రజనీకాంత్ సార్‌తో కలిసి నటించే అవకాశం మళ్లీ మళ్లీ రాదు కదా. ఆయనతో కలిసి నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అని రెబా మోనికా జాన్ చెప్పుకొచ్చింది. ఈ చాట్‌లో ఇలా సమాధానం చెప్పినా, సినిమా విడుదలకు ముందు.. ఈ సినిమా అవకాశంపై ఆమె మాట్లాడిన మాటలను అందరూ సోషల్ మీడియాలో షేర్ చేసి, కామెంట్స్ చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ఆమె మరోలా.. ఈ సినిమా అవకాశం గురించి తెలిపారు. ఇప్పుడదే విషయాన్ని బయటపెట్టి, రెబాను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకిలా మాటలు మారుస్తున్నావంటూ సోషల్ మీడియా వేదికగా ఆమెను ప్రశ్నిస్తున్నారు.
Also Read- OTT Movie: బాయ్ ఫ్రెండ్ మీద కోపంతో మాఫియా డాన్ తో సంబంధం.. చివరకు ఏం జరిగిందంటే?
అయినా పర్లేదు.. చేస్తా!
ఇంతకీ ఆమె విడుదలకు ముందు ఈ సినిమా గురించి ఏం చెప్పారంటే.. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్‌ల కాంబినేషన్ చిత్రం ‘కూలీ’లో నటించే అవకాశం ఇవ్వమని నేనే అడిగానని, అప్పుడు లోకేష్ కనగరాజ్.. ఈ సినిమాలో పెద్ద రోల్ ఏమీ లేదు, ఒక చిన్న పాత్ర మాత్రమే ఉందని చెప్పారని అప్పట్లో మోనికా చెప్పింది. అయినా పర్లేదు.. చేస్తానని నేను వెళ్లి ఆ పాత్ర చేశానని మోనికా చెప్పిన మాటల్ని.. కొందరు నెటిజన్లు పోస్ట్ చేసి, మాటలు ఇలా కూడా మారుస్తారా? అంటూ కౌంటర్స్ ఇస్తున్నారు. ‘కూలీ’లో సత్యరాజ్ కుమార్తెలలో ఒకరిగా రెబా నటించిన విషయం తెలిసిందే. తన చెల్లెళ్లను చదివించడం కోసమే శృతి హాసన్ (Shruti Haasan) కష్టపడుతున్నట్లుగా చూపించారు తప్పితే.. రెబా పాత్రకు ప్రత్యేక సీన్స్ అంటూ ఏమీ లేవు. కింగ్ నాగ్ (King Nagarjuna) ఫస్ట్ టైమ్ విలన్‌గా నటించిన ఈ సినిమా.. ప్రేక్షకులను మెప్పించడంలో అంతగా సక్సెస్ కాలేదనే విషయం తెలియంది కాదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు