Accenture Campus (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Accenture Campus: ఏపీకి గుడ్ న్యూస్.. 12వేల ఉద్యోగాలతో.. టాప్ గ్లోబల్ కంపెనీ వచ్చేస్తోంది!

Accenture Campus: టెక్‌ కన్సల్టెన్సీ దిగ్గజం అక్సెంచర్‌ (Accenture) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త క్యాంపస్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీని ద్వారా 12,000 కొత్త ఉద్యోగాలను సృష్టించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అంతర్జాతీయ వార్త సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఇటీవల టీసీఎస్ (TCS), కాగ్నిజెంట్‌ (Cognizant), గూగుల్ (Google) వంటి సంస్థలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. భారీగా ఉద్యోగావకాశాలు కల్పించే పెద్ద సంస్థలకు ఎకరానికి కేవలం 99 పైసలు (సుమారు $0.0112) లీజుతో భూమి కేటాయిస్తామన్న ఏపీ సర్కార్ ఆఫర్ ను అవి ఉపయోగించుకున్నాయి. ఇప్పుడు ఆక్సెంచర్ సైతం అదే ఒప్పందం ద్వారా ఏపీలో అడుగుపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

విశాఖలో.. 10 ఎకరాల విస్తీర్ణంలో
ప్రస్తుతం అక్సెంచర్‌కు ప్రపంచవ్యాప్తంగా 7.9 లక్షల మంది ఉద్యోగులు ఉండగా అందులో 3 లక్షల మందికి పైగా భారతదేశంలోనే పని చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో కొత్త క్యాంపస్ ను ఏర్పాటు చేయడం ద్వారా మరో 12వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అయితే అక్సెంచర్ తన కొత్త క్యాంపస్ ను విశాఖలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఇందుకోసం దాదాపు 10 ఎకరాల భూమిని కేటాయించాలని ఆ సంస్థ కూటమి ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ‘అక్సెంచర్‌ మరి ఎక్కువగా భూమి కోరలేదు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందుతుంది. కానీ కొంత సమయం పట్టవచ్చు’ అని ఏపీ ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారి వెల్లడించారు.

పెట్టుబడులు ఎంత?
క్యాంపస్‌ ఏర్పాటు కోసం అక్సెంచర్‌ ఎంత పెట్టుబడి పెట్టనుందో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇదే విధానంలో టీసీఎస్‌ సుమారు $154 మిలియన్లు, కాగ్నిజెంట్‌ $183 మిలియన్లు పెట్టుబడి పెట్టి విశాఖలో క్యాంపస్‌లను నిర్మిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు కలిపి దాదాపు 20,000 ఉద్యోగాలు సృష్టించనున్నాయి.

టైర్-2 నగరాలపై టెక్ కంపెనీల దృష్టి
భారతదేశంలో టెక్ సంస్థలు ఇప్పుడు హైదరాబాద్‌, బెంగళూరు, పుణే వంటి ప్రధాన కేంద్రాల నుంచి బయటకు వచ్చి చిన్న నగరాలపై దృష్టి పెడుతున్నాయి. ప్రధాన నగరాలతో పోలిస్తే భూముల ధర తక్కువగా ఉండటం, పరిమితమైన అద్దె, తక్కువ వేతనాలు దృష్ట్యా అవి తరలిపోతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా వచ్చిన నష్టాలు ఇప్పటికీ ఆయా టెక్ సంస్థలను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ పెట్టుబడులు పెట్టి క్యాంపస్ లను స్థాపించే స్థితిలో అవి లేవు. కాబట్టి టైర్ – 2 నగరాల్లో క్యాంపస్ లను స్థాపించి.. అక్కడి ఉద్యోగులను నియమించుకోవాలని గ్లోబల్ కంపెనీలు భావిస్తున్నాయి.

Also Read: Shocking News: తెలంగాణలో షాకింగ్ ఘటన.. యువకుడి ప్రాణం తీసిన కుక్క గోరు

అమెరికా విధానాల ప్రభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు గ్లోబల్ కంపెనీలను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొత్తగా జారీ చేసే H-1B వీసాల ఫీజును ఏకంగా 1,00,000 డాలర్లకు పెంచడంపై కార్పోరేట్ సంస్థలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఔట్ సోర్సింగ్ సేవలను ఉపయోగించే సంస్థలపై 25% పన్ను విధించే ప్రతిపాదనను సైతం ట్రంప్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్ వంటి నాణ్యమైన మానవ వనరులు ఉన్న దేశంలో కంపెనీలను విస్తరించేందుకు గ్లోబల్ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రమైన ఏపీకి

Also Read: Delhi Baba: బాబా ముసుగులో రాసలీలలు.. 17 మందిపై లైంగిక దాడి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

Just In

01

Smiling Emoji Murder: తాత మరణంపై ఫేస్ బుక్ పోస్ట్.. స్మైలింగ్ ఎమోజీ పెట్టాడని.. యువకుడి హత్య

OTT Movie: ఫ్యామిలీ సీక్రెట్ తెలుసుకునే క్రమంలో బయటపడిన డెడ్ బాడీ.. ఏం జరిగిందంటే?

OG Movie: గంటకు ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Huzurabad Collector: మద్యం షాపులో అంగన్‌వాడీ గుడ్లపై.. కలెక్టర్ ఆగ్రహం

Ghaati OTT: స్వీటీ ‘ఘాటి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంకొన్ని గంటల్లోనే!