Shocking News (Image Source: Twitter)
తెలంగాణ

Shocking News: తెలంగాణలో షాకింగ్ ఘటన.. యువకుడి ప్రాణం తీసిన కుక్క గోరు

Shocking News: కుక్కలను విశ్వాసాలకు మారుపేరుగా చెబుతుంటారు. అందుకే మానవులకు ఏ జీవితో లేనంత అనుబంధం శునకాలతో ఏర్పడింది. అయితే శునకాల పట్ల ఎంతటీ ప్రేమ ఉన్నప్పటికీ వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు తరుచూ సూచిస్తుంటారు. ఏమాత్రం తేడా జరిగినా ప్రాణాలకే ముప్పు అని హెచ్చరిస్తుంటారు. సరిగ్గా దీనికి అద్దం పట్టే ఘటన తాజాగా చోటుచేసుకుంది. తెలంగాణలో ఓ యువకుడు కుక్క గోరు కారణంగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అసలేం జరిగిందంటే?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముత్తెబోయిన సందీప్ (25).. రెండు నెలల క్రితం ఓ కుక్కపిల్లను పెంచుకునేందుకు ఇంటికి తీసుకొచ్చాడు. దానిని మచ్చిక చేసుకునేందుకు సందీప్, అతడి తండ్రి పున్నయ్య ప్రయత్నించారు. ఈ క్రమంలో సందీప్ తండ్రిని ఆ కుక్క ఒక్కసారిగా కరిచింది. దీంతో తండ్రికి దూరంగా కుక్క పిల్లను తీసుకెళ్తున్న క్రమంలో దాని గోరు సందీప్ కు గుచ్చుకుంది.

గోరే కదా అని నిర్లక్ష్యం
కుక్క పిల్ల కరవడంతో తండ్రిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లిన సందీప్ అక్కడే చికిత్స అందించాడు. అయితే తనకైన గాయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేశాడు. గోరు మాత్రమే తగిలింది కాబట్టి తనకేం కాదని భావించాడు. అదే అతడి పాలిట శాపంగా మారింది. రెండు నెలల గడిచిన తర్వాత సందీప్ లో క్రమంగా రేబిస్ లక్షణాలు బయటపడటం ప్రారంభించాయి. వ్యాధి తీవ్రం కావడంతో మణుగూరు, భద్రాచలం ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. అయినప్పటికీ అది ఫలించలేదు. దీంతో వ్యాధి ముదిరి సోమవారం రాత్రి సందీప్ ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: Delhi Baba: బాబా ముసుగులో రాసలీలలు.. 17 మందిపై లైంగిక దాడి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

రేబిస్ ఎందుకంత ప్రమాదకరం!
మనుషులకు సోకే అత్యంత ప్రాణాంతకమైన వ్యాధుల్లో రేబిస్ ఒకటి. ఇది కుక్కలు, గబ్బిలాలు వంటి జంతువుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంటుంది. రేబిస్ అనేది ఒక ప్రమాదకరమైన వైరస్. ఇది మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వెన్నుపామును సైతం దెబ్బతీస్తుంది. రేబిస్ నుంచి బయటపడాలంటే కుక్కకాటు జరిగిన వెంటనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. రాబిస్ లక్షణాలు బయటపడ్డ తర్వాత దీని నుంచి బయటపడటం దాదాపు అసాధ్యమని వైద్యులు చెబుతున్నారు. ముందస్తు వ్యాక్సినేషన్, తక్షణ వైద్యం ద్వారానే రేబిస్ నుంచి బయటపడవచ్చని స్పష్టం చేస్తున్నారు.

Also Read: Post Office Schemes 2025: మహిళల కోసం బెస్ట్ స్కీమ్స్.. వీటిలో పెట్టుబడి పెడితే.. లైఫ్ లాంగ్ హ్యపీగా బతకొచ్చు!

Just In

01

Ghaati OTT: స్వీటీ ‘ఘాటి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంకొన్ని గంటల్లోనే!

Big Breaking: తెలంగాణలో ఓజీకి ఎదురుదెబ్బ.. ప్రీమియర్స్ ఇక లేనట్లేనా?

Jogulamba Temple: జోగులాంబ ఆలయ మిస్టరీ.. అమ్మవారిని నేరుగా ఎందుకు దర్శించుకోరో తెలుసా?

OTT Movie: ఈ సీరియల్ కిల్లర్‌కు దొరికితే అంతే.. భయపడితే మాత్రం చూడకండి

OG Movie: విజయవాడలో పవన్ కళ్యాణ్ ఆల్ టైం రికార్డ్..!