OG release hurdles: తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా బజ్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. సినిమాకు సంబంధించి అన్నీ పనులూ పూర్తి చేసుకుని సెప్టెంబర్ 25 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దంగా ఉంది సినిమా. అయితే విడుదలకు మందు ‘ఓజీ’ నిర్మాతలు ఏం చేసినా కలిసిరావడం లేదు. అంతే కాకుండా ఏ సినిమాకు లేని అవాంతరాలు అన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా మొదలు పెట్టారు కానీ వర్షం రావడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. అయినా ఏదోటి చేసి పవన్ కళ్యాణ్ ఆ ప్రోగ్రామ్ ను గట్టెంకించారు. ఈ ఘటన మరవక ముందే.. ఉత్తర అమెరికాలో ‘ఓజీ’ సినిమాను సెక్యురిటీ కారణాలతో ఆపేస్తున్నామంటూ ఓ సంస్థ తెలిపింది. అది నిజమో కాదో తెలియక ముందే.. డిస్టిబ్యూటర్లు సినిమా విడుదల ఆలస్యం చేయవద్దంటూ అసంతృప్తి లేఖను విడుదల చేశారు. ఇది కూడా ఎంత వరకూ నిజమో కాదో తెలీదు. అయితే వీటిని సాకుగా తీసుకుని యాంటీ ప్యాన్స్ సినిమాపై నెగిటివిటీని వ్యాప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా నేషనల్ మీడియాలో డిప్యూటీ సీఎం కత్తి పట్టాడు అంటూ వస్తున్న వార్తలు అభిమాన వర్గాల్లో ఆందోళన రేపుతున్నాయి. సినిమా విడుదలకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయంటే ఇదంతా రాజకీయ కుట్ర అని కొందరు పవన్ అభిమానులు వారిపై మండిపడుతున్నారు.
Read also-Smallest Vande Bharat: వందే భారత్ రైళ్లకు కజిన్స్ ఉన్నాయని తెలుసా? సేమ్ సేమ్ బట్ డిఫరెంట్!
సినిమా కోర్ స్టోరీ ఎంటంటే.. ఒక గ్యాంగ్‌స్టర్ రిటర్న్ చుట్టూ తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ ప్లే చేసే ‘ఓజస్ గంభీర’ (Ojas Gambheera) అనే క్యారెక్టర్, 10 సంవత్సరాల తర్వాత ముంబైకి తిరిగి వస్తాడు. ఆయన ముందు గ్యాంగ్ లైఫ్‌లో ఒక పాత శత్రువుతో (ఎమ్రాన్ హాష్మీ ప్లే చేసే ‘ఓమి భావు’ – Omi Bhau) సెటిల్ చేసుకోవాలని మనసులో పెట్టుకుని, రివెంజ్ మిషన్‌లో ఎంబార్క్ అవుతాడు. ఇది కేవలం యాక్షన్ కాదు – ఇది భావోద్వేగాలతో కూడిన డార్క్ డ్రామా. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్, బాడీ లాంగ్వేజ్, అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ ఇంటెన్సిటీ – ఇవన్నీ స్క్రీన్ మీద అభిమానులకు కావాల్సినట్టుగా ఉంటాయి.
‘ఓజీ’ సినిమా వెనుక ఉన్న క్రూ ఒక స్టార్ టీమ్ చిత్రాన్ని భారీ విజువల్ ఫీస్ట్‌గా మార్చింది. డైరెక్టర్ సుజీత్, ‘సాహో’ ఫేమ్‌తో, స్టైలిష్ యాక్షన్, గ్రిప్పింగ్ నరేషన్‌తో మ్యాజిక్ చేశాడు. ప్రొడ్యూసర్ డి.వి.వి. దానయ్య, ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్‌ను తీసిన అనుభవంతో, రూ.250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. సినిమాటోగ్రఫీ రవి కె. చంద్రన్ చేత అద్భుతమైన విజువల్స్‌తో, ఎడిటింగ్ నవీన్ నూలి చేత క్రిస్ప్‌గా రూపుదిద్ధుకుంది. థమన్ ఎస్ మ్యూజిక్ మాస్ బీట్స్‌తో స్క్రీన్‌ను షేక్ చేసేలా కంపోజ్ చేశారు. స్క్రిప్ట్ రైటర్స్ సైనాధ్ అల్లా, సుజీత్ కలిసి, ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు బలమైన కథనాన్ని అందించారు. ఈ టీమ్‌వర్క్ ‘ఓజీ’ని ఒక ఐకానిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది.