Uttam Kumar Reddy (imagecredit:swetcha)
తెలంగాణ

Uttam Kumar Reddy: కృష్ణా జలాల్లో 70% వాటా కావాలి.. వాదనలు వినిపించిన మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా రావాలని కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ –II)ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తోందని, మొత్తం 1050 టీఎంసీలలో దాదాపు 70% అంటే 763 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కృష్ణా ట్రైబ్యునల్ విచారణ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసు చివరి దశకు చేరుకుందని, ఫిబ్రవరి నుండి తెలంగాణ తుది వాదనలు వినిపిస్తున్నదన్నారు. ఈ విచారణలు సెక్షన్-3 రిఫరెన్స్ కింద జరుగుతున్నాయని, అన్ని పిటిషన్లు పూర్తయ్యాయని గత కొన్ని నెలలుగా సీనియర్ అడ్వకేట్ ఎస్.వైద్యనాథన్ తెలంగాణ తరఫున వాదనలు వినిపిస్తున్నారని, ఆయనకు మూడ్రోజుల సమయం ఇచ్చారన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ ముందు స్వయంగా నీటి పారుదల శాఖ మంత్రి హాజరుకావడం బహుశా దేశంలో ఇదే మొదటి సారి అయి ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ఎంతగానో సీరియస్‌గా తీసుకుందో అర్థం అవుతుందన్నారు. తెలంగాణకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దే విధంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

అంశాల ఆధారంగా లెక్కలు

కేడబ్ల్యూడీటీ-II అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీలు కేటాయించిందని గుర్తు చేశారు. ఇందులో 811 టీఎంసీలు 75% డిపెండబిలిటీ ఆధారంగా, 49 టీఎంసీలు 65% డిపెండబిలిటీ ఆధారంగా, 145 టీఎంసీలు సగటు ప్రవాహాల ఆధారంగా కేటాయించబడ్డాయని తెలిపారు. అదనంగా గోదావరి డైవర్షన్ ద్వారా 45 టీఎంసీలు ఇచ్చారని, మొత్తం 1050 టీఎంసీలు కేటాయించారన్నారు. సగటు ప్రవాహాల కంటే ఎక్కువగా వచ్చే నీటిని వినియోగించుకోవచ్చని కూడా స్వేచ్ఛ ఇచ్చారన్నారు. 2014లో తెలంగాణ వేరుగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు కొత్తగా బేసిన్ పారామీటర్ల ఆధారంగా వాటాను కోరుతోందని వెల్లడించారు. తెలంగాణ(Telangana) డిమాండ్ శాస్త్రీయమైనది, అంతర్జాతీయంగా అంగీకరించబడిన పారామీటర్ల మీద ఆధారపడి ఉందని తెలిపారు. క్యాచ్‌మెంట్ ఏరియా, బేసిన్‌లోని జనాభా, కరవు ప్రాంతం విస్తీర్ణం, సాగు భూములు వంటి అంశాల ఆధారంగా లెక్కలు వేసి 75% డిపెండబుల్ వాటర్‌లో 555 టీఎంసీలు, 65% డిపెండబుల్ వాటర్‌లో 43 టీఎంసీలు, సగటు ప్రవాహాల నుంచి 120 టీఎంసీలు, గోదావరి డైవర్షన్ నుంచి మొత్తం 45 టీఎంసీలు తెలంగాణకు రావాలని కోరుతున్నామని, మొత్తంగా 763 టీఎంసీలుగా అవుతుందన్నారు. సగటు ప్రవాహాలపై మిగిలిన అదనపు నీటిని వినియోగించే స్వేచ్ఛ కూడా తెలంగాణదేనని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Sai Durgha Tej: వేట‌కు సిద్ధ‌మైన‌ బెంగాల్ టైగ‌ర్.. సాయి దుర్గ తేజ్‌ ‘ఓజీ’ ట్రైల‌ర్‌ రివ్యూ

అన్యాయాన్ని సరిచేసే చర్యగా..

ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీల్లో పెద్ద భాగాన్ని బేసిన్ వెలుపలికి మళ్లించిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఇలాంటివి ఆపాలని, బదులుగా ప్రత్యామ్నాయ వనరులను వినియోగించాలని ట్రైబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపించిందన్నారు. అలా మిగిలిన నీటిని ప్రాంతాలలో వాడుకోవాలన్నారు. ప్రవాహాలపై మిగిలిన మొత్తం నీటిని వినియోగించే హక్కు తెలంగాణకే ఉందని, దీన్ని ట్రైబ్యునల్ ముందు బలంగా వాదిస్తామని వెల్లడించారు. ఇది కేవలం ఒక డిమాండ్ మాత్రమే కాకుండా, దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిచేసే చర్యగా అభివర్ణించారు. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం వల్లే కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. కేవలం 299 టీఎంసీలకు అంగీకరిస్తూ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సంతకం చేసిందన్నారు. ఏపీ(AP)కి 512 టీఎంసీలకు ఒప్పందానికి కేసీఆర్ అప్పగించి రైతులకు, కరువు ప్రాంతాలకు మోసం చేశారని మండిపడ్డారు. ఈ చర్యతో తెలంగాణకు పదేళ్లుగా అన్యాయం జరుగుతోందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 780 టీఎంసీలను కోరుతుందన్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఒప్పందాన్ని తిరస్కరించిందని వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ హక్కులపై రాజీపడబోదనిస్పష్టం చేశారు. ఒక్క చుక్క నీళ్లను కూడా వదులుకోబోమని వెల్లడించారు.

తెలంగాణ వాటా తగ్గించే చర్య..

అల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచే కర్ణాటక యోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆ నిర్ణయం తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యాం ఎత్తును అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తామని, మా ప్రభుత్వ అభిప్రాయం చాలా స్పష్టంగా ఉందని, తెలంగాణ వాటా తగ్గించే చర్య ఏదీ అనుమతించబోమని వెల్లడించారు. ‘ఇది కేవలం న్యాయ పోరాటం మాత్రమే కాదు.. రైతుల జీవనాధారానికి, కరవు ప్రాంతాల భవిష్యత్తుకు సంబంధించినదని పేర్కొన్నారు. ట్రైబ్యునల్ న్యాయమూర్తి బ్రిజేష్ కుమార్(Brijesh Kumar) నేతృత్వంలోని విచారణలో తెలంగాణకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డిపెండబుల్ ఫ్లోస్ అయినా, సగటు ప్రవాహాలు అయినా, అదనపు నీరు అయినా, గోదావరి డైవర్షన్లు అయినా.. తెలంగాణల తన హక్కు కోసం పోరాడుతుందని, చారిత్రక అన్యాయం ఇకపై కొనసాగదు. తెలంగాణ తన హక్కు దక్కించుకుంటుందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గదని వెల్లడించారు.

Also Read: OG Benefit Show: మొత్తానికి సాధించారు.. ఏపీలో బెనిఫిట్ షో టైమింగ్ మారింది!

Just In

01

OG Movie: ‘మిరాయ్’ మాత్రమే కాదు.. ‘లిటిల్ హార్ట్స్’ థియేటర్లు కూడా.. బన్నీ వాసు సంచలన ప్రకటన

OTT Movie: బాయ్ ఫ్రెండ్ మీద కోపంతో మాఫియా డాన్ తో సంబంధం.. చివరకు ఏం జరిగిందంటే?

Smiling Emoji Murder: తాత మరణంపై ఫేస్ బుక్ పోస్ట్.. స్మైలింగ్ ఎమోజీ పెట్టాడని.. యువకుడి హత్య

OTT Movie: ఫ్యామిలీ సీక్రెట్ తెలుసుకునే క్రమంలో బయటపడిన డెడ్ బాడీ.. ఏం జరిగిందంటే?

OG Movie: గంటకు ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!