telusu-kada( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Telusu Kada second song: సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ నుంచి సెకండ్ మెలొడీ.. అదిరింది మావా..

Telusu Kada second song: యూత్ సెన్సేషన్‌ సిద్దు జొన్నలగడ్డ మరోసారి అభిమానులను ఆకట్టుకోవడానికి ‘తెలుసు కదా’ అనే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ మెలొడీని విడుదల చేశారు నిర్మాతలు. ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ఈ యువ హీరో, తన కెరీర్‌లో మరో మైలురాయిని నెలకొల్పుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా తొలిసారి పరిచయమయ్యే ఈ చిత్రం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్లల రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. టీజర్ అయితే యువతను అమితంగా ఆకట్టుకుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ప్రచారాన్ని పెంచడంలో హిట్ అయిందనే చెప్పాలి.

Read also-Bathukamma Record: గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లక్ష్యంగా బల్దియా ‘బతుకమ్మ’ వ్యూహం

నిర్మాతలు విడుదల చేసిన రోండో మెలొడీ సినిమాకు ఎసెర్ట్ కానుంది. ఈ పాటను చూస్తుంటే.. తెలుసుకదా తెలుసు కదా.. ఆగమంటే ఆగుతుందా అంటూ మొదలవుతోంది సాంగ్. కృష్ణ కాంత్ రాసిన ఈ పాటను కార్తిక్ ఆలపించగా మెలొడీలతో మైమరపించే థమన్ సంగీతం అందించారు. ఈ పాటలో సింగర్ కార్తిక్, సంగీత దర్శకుడు థమన్, సింగర్ అద్వైత కలిసి కనిపిస్తారు. ఈ పాట మొత్తం ఎంతో వినసొంపుగా చాలా కాలం తర్వాత కొత్తదనంతో కూడిన మెలొడీలా అనిపించింది. లొకేషన్స్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ శ్రీనిధి శెట్టి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. విడుదలైన ఈ పాట మంచి మెలొడీ ఉండటంతో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. విడుదలైన కొంత సేపటికే లక్షల్లో వ్యూస్ సంపాదించుకుంది. థమన్ ఈ సినిమాకు మరో హిట్ మెలొడీ అందించారని అర్థమవుతోంది.

Read also-Nongjrang Village: మహా అద్భుతం.. మేఘాల కంటే ఎత్తులో గ్రామం.. లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

‘తెలుసు కదా’ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోంది. సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇది యూత్‌లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిత్ర యూనిట్ సూచించినట్టు, కథలో పూర్తిగా కొత్త కథాంశం ఉంటుంది, ఇది యువతను ఆకర్షించేలా రూపొందించబడింది. హీరోయిన్‌గా రాశీ ఖన్నా, KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. వైవా హర్ష కీలక పాత్రలో మెరిసనున్నాడు. సంగీత దర్శకుడు ఎస్. థమన్ అందించిన ట్యూన్స్, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి (జాతీయ అవార్డు విజేత) ఎడిటింగ్‌తో ఈ చిత్రం హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో భారీ బడ్జెట్‌లో నిర్మించబడుతోంది. అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ వంటి టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ కూడా ఈ సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.

Just In

01

OG advance booking: ఆ రికార్డుపై కన్నేసిన పవన్ కళ్యాణ్.. ఈ సారి మనదే అంటున్న ఫ్యాన్స్

Mahabubabad Rally: ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలి.. ర్యాలీ నిర్వహించిన నిరుద్యోగులు

Ponnam Prabhakar: జీఎస్టీ టాక్స్ తో ఏం మంచి పని జరిగింది?.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

OG release: ఉత్తరాంధ్రలో ‘ఓజీ’ బ్యాంగ్ మోగించేందుకు సర్వం సిద్ధం..

Land Encroachment: భూ కబ్జాలపై సర్కార్ షాక్?.. హైడ్రా ఆపరేషన్ తర్వాత విస్తుపోయే విషయాలు వెలుగులోకి?