OG release issue: పవన్ ‘ఓజీ’ సినిమాకు అక్కడ ఎదురుదెబ్బ!
pawan-kalyan(image :x)
ఎంటర్‌టైన్‌మెంట్

OG release issue: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాకు అక్కడ ఎదురుదెబ్బ!.. ఎందుకంటే?

OG release issue: ఉత్తర అమెరికాలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా విడుదల విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి పంపిణీదారు అయిన ‘యోర్క్ సినిమాస్’ ‘ఓజీ’ సినిమాను విడుదల చేయలేమంటూ తెలిపిన నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ఏం ఉందంటే.. ‘ప్రియమైన ప్రేక్షకులారా ఇది కఠినమైన నిర్ణయమే అయినా ప్రేక్షకుల గురించి తీసుకోక తప్పడం లేదు. ఈ నిర్ణయం ‘ఓజీ’ అభిమానులను ఎంతో నిరాశకు గురిచేస్తుంది. అయినా తప్పడంలేదు. “They call him OG” అనే చలనచిత్రం అన్ని రాబోయే ప్రదర్శనలను రద్దు చేయాలని నిర్ణయించాము. ఈ చిత్రం ఉత్పత్తి పంపిణీలో ఉన్న వివిధ సాంస్కృతిక రాజకీయ శక్తుల గురించి పెరిగిన ఆందోళన కారణంగా, ఈ చిత్రాన్ని ఉత్తర అమెరికాలో పంపిణీ చేసే విషయంలో ప్రజా భద్రతకు ఆందోళన కలిగింది. ఈ నిర్ణయం కారణంగా మీకు ఎలాంటి అసౌకర్యం కలిగినా, మేము క్షమాపణలు తెలుపుతున్నాము. ముందుగా టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులందరికీ పూర్తి మొత్తంలో రీఫండ్‌లు అందించబడతాయి.’ అంటూ రాసుకొచ్చింది.

Read also-CM Revanth Reddy: కుంభమేళాకు వేల కోట్లు కుమ్మరిస్తున్నారు… మరి మేడారానికి ఏవి..?

అంతే కాకుండా.. ‘ప్రేక్షకులు, ఉద్యోగులు సాధారణ ప్రజల భద్రత మా ప్రధాన విషయం. యార్క్ సినిమాస్ కు గతంలో “OG” చిత్రం ఉత్తర అమెరికా పంపిణీదారులతో అనుబంధం ఉన్న కొంతమంది వ్యక్తుల నుండి అభ్యర్థనలు వచ్చాయి. వీరు చిత్ర టికెట్ అమ్మకాల సంఖ్యలను కృత్రిమంగా పెంచడం ద్వారా భవిష్యత్తులో ఉత్తర అమెరికాలో దక్షిణ ఆసియన్ చలనచిత్రాల ఆర్థిక విలువను పెంచే ప్రయత్నం చేశారు. దీని ద్వారా వీరు ఉత్తర అమెరికాలో దక్షిణ ఆసియన్ చలనచిత్ర పరిశ్రమపై ఎక్కువ నియంత్రణ పొందాలని ఉద్దేశించారు. అలాగే, ఈ వ్యక్తులు సామాజిక స్థాయి రాజకీయ అనుబంధాల ఆధారంగా దక్షిణ ఆసియన్ సముదాయాల్లో సాంస్కృతిక విభజనను సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.’ అని అన్నారు.

Read also-Shreyas Iyer: అయ్యర్‌కు ఏమైంది?.. మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఇండియా-ఏ టీమ్ నుంచి వైదొలగిన వైనం

‘యార్క్ సినిమాస్ అవినీతి ఆధారిత వ్యాపార పద్ధతుల్లో పాల్గొనడానికి నిరాకరిస్తుంది. దక్షిణ ఆసియన్ సముదాయంలోని అన్ని సమూహాలు వికసించేలా ప్రోత్సహిస్తుంది. అదనంగా, పంపిణీదారులు భారతదేశంలోని కొన్ని ఆన్‌లైన్ మీడియాలో యార్క్ సినిమాస్ కు సంబంధించి తప్పుడు ప్రకటనలు చేశారు. యార్క్ సినిమాస్ ఈ ప్రకటనల నిజాయితీని స్పష్టంగా ఖండిస్తుంది. తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటుంది.’ అంటూ రాసుకొచ్చారు. అయితే సోషల్ మీడియాలో తిరుగుతున్న వార్తలపై సినిమా టీం నుంచి కానీ నిర్మాతల నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ అంటే గిట్టనివారు ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు.

Just In

01

Ranga Reddy District: దేవాదాయ భూమిపై రియల్ కన్ను.. చక్రం తిప్పిన పాత ఆర్డీవో!

Xiaomi Launch: అల్ట్రా ఫీచర్లతో Xiaomi 17 Ultra లాంచ్

Phone Tapping Case: ట్యాపింగ్ వెనుక రాజకీయ ఆదేశాలేనా? కేసీఆర్, హరీశ్ రావుల విచారణపై చర్చ!

Gram Panchayat: గ్రామ పంచాయతీలకు నిధులొస్తాయా?.. సర్పంచుల్లో టెన్షన్!

Ugandhar Muni: ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా.. ‘శంబాల’ కథ రాశా!