Jayammu Nischayammu Raa: నాకు ఆ డ్యాన్స్‌లేవీ రావ్- ప్రభుదేవా!
Jagapathi Babu Show
ఎంటర్‌టైన్‌మెంట్

Jayammu Nischayammu Raa: నాకు ఆ డ్యాన్స్‌లేవీ రావ్.. జగపతిబాబు షోలో ప్రభుదేవా!

Jayammu Nichayammu Raa: విలక్షణ నటుడు జగపతి బాబు (Jagapathi Babu), వెండితెరపైనే కాకుండా.. ఇప్పుడు బుల్లితెర, ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోన్న విషయం తెలిసిందే. నందమూరి నటసింహం బాలయ్య తరహాలోనే జగ్గూభాయ్ కూడా సెలబ్రిటీ టాక్ షో హెస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతిబాబు’ (Jayammu Nischayammu Raa With Jagapathi Babu) పేరుతో ఆయన నిర్వహిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో.. మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. జీ5 ఓటీటీ, జీ తెలుగు కోసం చేస్తున్న ఈ షో.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆగస్ట్ 15న గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్‌కు కింగ్ నాగార్జున (King Nagarjuna) గెస్ట్‌గా వచ్చారు. నాగ్ తర్వాత శ్రీలీల, నేచురల్ స్టార్ నాని, సందీప్ రెడ్డి వంగా – రామ్ గోపాల్ వర్మ, మీనా – సిమ్రాన్ – రవళి, తేజ సజ్జా వంటి వారంతా ఈ షోలో సందడి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవా (Prabhudeva) వంతు వచ్చింది. మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన ప్రభుదేవా ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా మేకర్స్ ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Also Read- Land Cruiser Controversy: మరో వివాదంలో కేటీఆర్.. ఆయన వాడుతున్న కారు కథ వెలుగులోకి!

కొట్టినప్పుడు కమ్మగా లేదు

ఈ ప్రోమోని గమనిస్తే.. ప్రభుదేవాకు జగపతిబాబు గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికారు. ఆ తర్వాత ‘మాములుగా చిన్నప్పుడు అందరూ సిగ్గు పడతారు ఓకే.. నువ్వేంటి.. ఇన్నేళ్లుగా సిగ్గు పడతానే ఉన్నావ్..’ అనగానే ప్రభుదేవా నవ్వేశారు. మరి గోవాలో మాత్రం సిగ్గులేకుండా ఉన్నావే? అని జగపతిబాబు ప్రశ్నించగానే.. ‘ఈ షోను గోవాలో పెట్టి ఉంటే బాగుండేది’ అని ప్రభుదేవా సమాధానమిచ్చారు. మీ నాన్న సుందరం అంత పెద్ద డ్యాన్స్ మాస్టర్ కదా.. అని అనగానే ‘నాకు మా ఫాదర్ అంటే భయం’ అని ప్రభుదేవా సమాధనమిచ్చారు. వెంటనే జగ్గు భాయ్.. ‘ఎప్పుడైనా కొట్టారా?’ అని ప్రశ్నించగానే బ్యాక్‌గ్రౌండ్‌లో ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ.. ఎంత కమ్మగా ఉందిరో యబ్బ’ అని సాంగ్ ప్లే అయింది. ‘కొట్టినప్పుడు కమ్మగా లేదు’ అని సరదాగా సమాధానమిచ్చారు.

Also Read- Manchu Manoj: అయోధ్య రాములవారిని దర్శించుకుని క్షమాపణలు చెప్పిన బ్లాక్ స్వార్డ్.. విషయమిదే!

నాకు నా డ్యాన్స్ మాత్రమే వచ్చు

అందరికీ తెలుసు డ్యాన్స్ అంటే ప్రభుదేవా, ప్రభుదేవా అంటే డ్యాన్స్ అని.. అని జగపతిబాబు అనగానే.. హిప్‌హాప్‌, బ్రేక్‌ డ్యాన్స్‌ వంటివేమీ నాకు తెలియదు.. నాకు నా డ్యాన్స్ మాత్రమే తెలుసని ప్రభుదేవా చెప్పారు. మరి నీ డ్యాన్స్ చూడాలి కదా.. అని జగ్గూ భాయ్ అనగానే.. ‘స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్’ అనే పాటకు డ్యాన్స్ చేశారు. తనదైన శైలిలో ప్రభుదేవా వేసిన ఈ స్టెప్‌లు అందరినీ అలరించాయి. ఈ ప్రోమోకి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి జీ5 ఓటీటీలో అందుబాటులోకి రానుంది. అలాగే ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులోనూ ఈ షో ప్రసారం కానుంది. డోంట్ మిస్..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Nukala Ramachandra Reddy: ప్రజల కోసమే జీవించిన నాయకడు.. తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపం నూకల రామచంద్రారెడ్డి!

Ariana Glory: వర్షతో కిసిక్ టాక్స్‌లో సందడి చేసిన అరియానా.. రూమ్ రెంట్ కోసం ఏం చేసేదంటే?

Jabalpur: జబల్పూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో మహిళపై లైంగిక దాడి.. ఇద్దరు అరెస్ట్

GHMC: జీహెచ్ఎంసీలో విలీనమై 60 సర్కిళ్లుగా 12 జోన్లుగా ఏర్పాటు.. సరికొత్త పరిపాలనకు సర్కారు శ్రీకారం!

Sandhya Theatre Case: ఛార్జ్‌షీట్‌లో అల్లు అర్జున్ పేరు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం