OG Movie Poster
ఎంటర్‌టైన్మెంట్

OG Censor Details: ‘ఓజీ’ సెన్సార్ పూర్తి.. తొలగించిన సన్నివేశాలివే..

OG Censor Details: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా (OG Movie) సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు ‘A’ (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికెట్‌ను జారీ చేసి.. టీమ్‌కు ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. ఈ సినిమాకు A సర్టిఫికెట్ లభించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, ‘పంజా’ (Panjaa) తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ రావడం ఇదే రెండోసారి. సినిమాలో హింస, రక్తపాతం ఎక్కువగా ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఇందులో రక్తపాతంతో నిండిన దాదాపు 2 నిమిషాల నిడివితో ఉన్న సన్నివేశాలను తొలగించినట్లుగా సెన్సార్ సర్టిఫికెట్ చూస్తుంటే తెలుస్తోంది. కటింగ్స్ అన్నీ పోయిన తర్వాత ‘ఓజీ’ సినిమా రన్‌టైమ్ 2 గంటల 34 నిమిషాల 15 సెకన్లు (154.15 నిమిషాలు) గా లాక్ చేశారు.

Also Read- Sai Durgha Tej: వేట‌కు సిద్ధ‌మైన‌ బెంగాల్ టైగ‌ర్.. సాయి దుర్గ తేజ్‌ ‘ఓజీ’ ట్రైల‌ర్‌ రివ్యూ

ట్రైలర్ ఆలస్యానికి అసలు కారణం ఇదేనా?

ఈ సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో నిర్మాతలు యుఏ సర్టిఫికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ, కొన్ని సన్నివేశాలను తొలగించమని సెన్సార్ బోర్డు సూచించిందని, అయితే ఆ కట్స్ వల్ల సినిమా అనుభూతి, ఫ్లో దెబ్బతింటుందని భావించిన నిర్మాతలు A సర్టిఫికెట్‌కు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ విషయంలో కూడా సెన్సార్ వల్లే ఆలస్యమని టాక్ నడుస్తుంది. ట్రైలర్‌లో కూడా కొన్ని సన్నివేశాలు తొలగించాలని సెన్సార్ బోర్డ్ సూచించిందట. అందుకే చివరి నిమిషంలో ట్రైలర్‌కు బ్రేక్ పడింది. ఆ కారణంగానే ఆదివారం రావాల్సిన ట్రైలర్‌ను సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఆలస్యంగా వచ్చిప్పటికీ ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. టాప్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది.

OG Censor Poster

Also Read- OG Trailer: ‘ఓజీ’ ట్రైలర్.. బొంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త! గూస్‌బంప్స్ పక్కా!

సెన్సార్ బోర్డు తొలగించిన సన్నివేశాలివే.. (OG Censor Cuts)

సినిమాలో చేతులు నరికే దృశ్యాలు, తల నరికే సన్నివేశాలు, సుత్తితో కొట్టే సీన్స్, ఇంకా లాడ్జిలో జరిగే హింసాత్మక సన్నివేశాలను పూర్తిగా తొలగించమని సెన్సార్ బోర్డు సూచించింది. రక్తం నిండిన సన్నివేశాలలో ఉన్న పిల్లల విజువల్స్ మార్చమని కోరింది. ఒక పోలీస్ అధికారి జిప్ ఓపెన్ చేసే విజువల్, మెడ కుట్టే దృశ్యాలను తొలగించమని లేదా మార్చమని సూచించింది. డ్రగ్స్, స్మోకింగ్ సన్నివేశాలు వచ్చే సమయంలో చట్టబద్ధమైన హెచ్చరిక‌లను డిస్‌ప్లే చేయాలని చెప్పినట్లుగా ఈ సెన్సార్ సర్టిఫికెట్‌ తెలియజేస్తుంది. మొత్తంగా ఒక నిమిషం 55 సెకన్ల సన్నివేశాలను తొలగించి, ఫైనల్‌గా 154 నిమిషాల 15 సెకన్ల రన్‌టైమ్‌కు సినిమాను లాక్ చేశారు. దీంతో సినిమా విడుదలకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే. ఇక బాక్సాలు డిస్ట్రిబ్యూషన్‌కు టీమ్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

OG Censor Certificate

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Land Cruiser Controversy: మరో వివాదంలో కేటీఆర్.. ఆయన వాడుతున్న కారు కథ వెలుగులోకి!

CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు దసరా కానుక.. బోనస్ ప్రకటించిన సర్కార్ ఒక్కొక్కరికి ఎన్ని లక్షలంటే..?

Crime News: సహజీవనం చేస్తున్న ప్రియురాలిని చంపేసి.. డెడ్‌బాడీ బ్యాగులో కుక్కి.. ఆ తర్వాత..

Bathukamma Kunta: 5న బ‌తుక‌మ్మ‌కుంట గ్రాండ్ ఓపెనింగ్‌. రూ.7.40 కోట్లతో అభివృద్ధి

Manchu Manoj: అయోధ్య రాములవారిని దర్శించుకుని క్షమాపణలు చెప్పిన బ్లాక్ స్వార్డ్.. విషయమిదే!