Sai Tej on OG TRailer
ఎంటర్‌టైన్మెంట్

Sai Durgha Tej: వేట‌కు సిద్ధ‌మైన‌ బెంగాల్ టైగ‌ర్.. సాయి దుర్గ తేజ్‌ ‘ఓజీ’ ట్రైల‌ర్‌ రివ్యూ

Sai Durgha Tej: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), సుజీత్ (Sujeeth) కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఓజీ’ సినిమా (OG Movie) ట్రైలర్ రావడం కాస్త ఆలస్యమై ఉండొచ్చు కానీ, రికార్డులు మాత్రం పక్కా అనేలా దూసుకెళ్తోంది. ఆదివారం విడుదల కావాల్సిన ఈ ట్రైలర్‌ని సోమవారం మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ట్రైలర్ రాక ఆలస్యమని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవడమే కాకుండా, నిర్మాణ సంస్థను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా తిట్టిపోశారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఓజీ’ ట్రైలర్ ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది. ఈ ట్రైలర్ చూసిన వారంతా.. దర్శకుడు సుజిత్‌ను, సంగీత దర్శకుడు థమన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పేదేముంది. చాలా కాలం తర్వాత వింటేజ్ పవన్‌ని చూసినట్లుగా ఉందంటూ.. తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ సోషల్ మీడియా వేదికగా ఈ ట్రైలర్‌పై రియాక్ట్ అయిన తీరు అయితే.. ముందు థియేటర్‌లోకి వెళ్లి విజిల్స్ వేయాలని అనిపిస్తుందంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇంతకీ సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) ఇచ్చిన ‘ఓజీ’ ట్రైలర్ రివ్యూ ఎలా ఉందంటే..

Also Read- OG Trailer: ‘ఓజీ’ ట్రైలర్.. బొంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త! గూస్‌బంప్స్ పక్కా!

బెంగాల్ టైగర్.. వేటకు సిద్ధమైంది

‘ఓజీ’ ట్రైలర్‌ చూసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్ అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది. ‘‘మేం ఇన్నాళ్లుగా మిస్ అవుతున్న బెంగాల్ టైగర్.. ఇప్పుడు వేటకు సిద్ధమైంది. నాతో సహా ప్రతీ అభిమాని కోరిక తీర్చిన, అందరినీ సంతృప్తి పరిచిన దర్శకుడు సుజీత్‌కు థ్యాంక్స్. ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు.. నాకెంతో ఇష్టమైన స్నేహితుడు థమన్ ఇచ్చిన బీజీఎం అయితే నిజంగానే ఫైర్ స్ట్రోమ్. ఇక నా హీరో, నా గురువు పవన్ కళ్యాణ్ మామయ్య ప్రతీ ఫ్రేమ్‌లో అగ్గిని రాజేశారు. ఆయన స్క్రీన్ ప్రెజన్స్, శ్వాగ్, స్టైల్ ఇవన్నీ కూడా ఆయనకు తప్పా ఇంకెవ్వరికీ సాధ్యం కావు అన్నట్టుగా ఉంది.. ఓజీని మనమంతా కలిసి సెలెబ్రేట్ చేసుకోవాల్సిందే. నేను ఈ సినిమా చూస్తే విజిల్స్ వేస్తూ సెలబ్రేట్ చేసుకునేందుకు ఎంతగానో వెయిట్ చేస్తున్నాను’’ అని సాయి దుర్గ తేజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read- Kantara Chapter 1 Trailer: ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్ ఎలా ఉందంటే?

పండుగ వాతావరణం వచ్చేసింది

సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 24న పెయిడ్ ప్రీమియర్లకు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్‌కి అనుమతి ఇవ్వగా, ఏపీ ప్రభుత్వం ఇచ్చిన టైమ్‌ని ఛేంజ్ చేసే పనిలో నిర్మాతలు ఉన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. సుజీత్ విజన్, థమన్ సంగీతం, పవన్ కళ్యాణ్ తిరుగులేని పవర్‌తో.. ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద ఒక పండుగ వాతావరణాన్ని తీసుకు వచ్చేలా ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bathukamma Kunta: 5న బ‌తుక‌మ్మ‌కుంట గ్రాండ్ ఓపెనింగ్‌. రూ.7.40 కోట్లతో అభివృద్ధి

Manchu Manoj: అయోధ్య రాములవారిని దర్శించుకుని క్షమాపణలు చెప్పిన బ్లాక్ స్వార్డ్.. విషయమిదే!

KTR: స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించండి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

BJP: త్వరలోనే స్థానిక ఎన్నికలు… కానీ, బీజేపీలో మాత్రం వింత పరిస్థితి?

Kavitha: పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా?.. కవిత కీలక వ్యాఖ్యలు