Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్ మెంట్ మార్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పుట్టపాక గ్రామస్తులు, రైతులు కలిశారు. ఈసందర్భంగా వారు ట్రిపుల్ ఆర్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను రామచందర్ రావు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్ మార్పు వల్ల రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గాన్ని రద్దుచేసి, పున:సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైతుల సమస్యలు
ప్రస్తుతం ఉన్న అలైన్ మెంట్ ప్రకారం పంట పొలాలు పోతున్నాయని, సర్కార్ కు అంతలా కావాలంటే అనర్హమైన కొండ భూములను రహదారి కోసం వినియోగిస్తే పంట భూములు కాపాడుకోవచ్చని రైతులు డిమాండ్ చేస్తున్నారన్నారు. చిన్న, సన్నకారు రైతులు కావడంతో అలైన్‌మెంట్ వల్ల వారిపై ఆర్థిక భారం పడుతోందని, జీవనోపాధి ప్రమాదంలో పడుతోందని రాంచందర్ రావు పేర్కొన్నారు. రైతుల సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించేందుకు చొరవ తీసుకుంటానని పేర్కొన్నారు. రైతుల భూములు, జీవనోపాధిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను రాస్ట్ర ప్రభుత్వం పున:సమీక్షించి, రైతులకు నష్టం లేకుండా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read: TIMS Hospital: డిసెంబర్‌లో టిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్.. ఎక్కడంటే..?
విద్యార్థి సంఘ ఎన్నికల్లో..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబీవీపీ(ABVP) ప్యానల్ ఘన విజయం సాధించడంపై వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అభినందనలు తెలిపారు. ఈ విజయంతో విద్యార్థుల నిజమైన ఆశయాలకు ప్రతినిధి ఏకైక శక్తి ఏబీవీపీ మాత్రమేనని మరోసారి నిరూపితమైందన్నారు. రోహిత్ వేముల ఘటనను వాడుకుని గతంలో ప్రతిపక్షాలు ఏబీవీపీ, బీజేపీపై అబద్ధాలు, దుష్ప్రచారం చేశారని, కులమతాల పేరుతో విద్యార్థులను విభజించాలనుకున్నారన్నారు. కానీ చివరికి విద్యార్థులే నిజం గుర్తించారని, అలజడి సృష్టించే వామపక్ష, విభజనశక్తులకు ఈ విజయం గట్టి సమాధానమన్నారు.
Also Read: Konda Surekha: దేవుడి భూములు కబ్జా చేసే వారిపై పీడీ యాక్ట్.. మంత్రి కొండా సురేఖ హెచ్చరిక