Karimnagar District: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా ఒక వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. దుర్గామాత విగ్రహం తరలింపులో ఉపాధి కోసం డీజే ఏర్పాటు చేసిన తనను డీజే వినియోగిస్తున్నాడనే ఆగ్రహంతో పోలీసులు తనను కొట్టారని ఆరోపిస్తూ టేకుమట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకున్నారు. టవర్ ఎక్కిన శ్రీనివాస్ ను పోలీసులు కిందకి దిగమని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
దాదాపు అరగంటకు పైగా కొనసాగిన చర్చల తర్వాత శ్రీనివాస్ టవర్ నుంచి సురక్షితంగా కిందకి దిగాడు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు పథకం కింద మంజూరైన డీజేను ఉపాధి కోసం వాడుకుంటే తప్పేంటని స్థానికులు పోలీసులను ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు, దళిత బంధు లబ్ధిదారుల మధ్య జరిగిన ఈ ఘటన హుజురాబాద్ లో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసుల వైఖరి చర్చనీయాంశంగా మారింది.
Also Read: Bathukamma 2025: రేపటి నుంచే బతుకమ్మ సంబురాలు.. ఉత్సవాల షెడ్యూల్ విడుదల.. సీఎం కీలక ప్రకటన