og-creze( image :x)
ఎంటర్‌టైన్మెంట్

OG movie: ‘ఓజీ’ టీంపై మండిపడుతున్న అభిమానులు.. ఎందుకంటే?

OG movie: పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్ ఎలాంటిదో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది పవన్ సినిమా ఓజీ విడుదల అవుతుంది అంలే టీం ఏ రేంజ్ లో ప్రచారం చెయ్యాల్లో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఓజీ సినిమాకు ఇంకా రోజులు మాత్రమే ఉండటంతో సినిమా నుంచి అనుకున్న స్థాయిలో ప్రచారం చేయడం లేదంటూ అభిమానులు మండిపడుతున్నారు. సెప్టెంబర్ 25 న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా పాన్ ఇండియా స్థాయిలో నిర్మాతలు ప్రచారం మొదలు పెట్టలేదు. దీంతో రికార్డులు కొట్టలేమంటూ నిర్మాతలపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చివరిలో ఎనౌన్స్ చేశారు. దీంతో ఫాన్స్ మండి పడుతున్నారు. ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. టైలర్ కూడా అనుకున్న సమయానికి విడుదల చేయలేదు దీంతో అభిమానుల కోపం తారా స్థాయికి చేరుకుంది. దీని కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాతలు ఏం చెబుతారో వేచి చూడాలి మరి. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని ఎల్ బీ స్టేడియంలో జరగనుంది.

Read also-Ind Vs Pak: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ టీమ్‌తో జత కలిసిన అనూహ్య వ్యక్తి.. నవ్వుకుంటున్న ఇండియన్స్

“ఓజి” కథ, ముంబై అండర్‌వరల్డ్‌లో 10 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చే మాఫియా బాస్ ఓజస్ గంభీర (పవన్ కళ్యాణ్) ప్రతీకార యాత్రలో ఆధారపడి ఉంది. స్క్రిప్ట్‌ను సుజీత్ రాసి, డైరెక్ట్ చేశారు. థమన్ స్కోర్, ముఖ్యంగా “గన్స్ ఎన్ రోజెస్” ట్రాక్, ఫ్యాన్స్‌ను మైకమయం చేసింది. టీజర్ “హంగ్రీ చీటా” 100 మిలియన్ వ్యూస్ దాటింది. ట్రైలర్ సెప్టెంబర్ 21న విడుదలవుతుంది. బడ్జెట్ 250 కోట్లు, నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ – ఇది పవన్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్ సినిమా. పవన్ డెప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది అతని మొదటి పూర్తి షెడ్యూల్ హీరో రిలీజ్. ఫ్యాన్స్ దీన్ని “కమ్‌బ్యాక్”గా చూస్తున్నారు. ప్రియాంక మోహన్ కథలో కన్మని పాత్రలో ఉంది. ఎమ్రాన్ విలన్ ఓమి భావ్‌గా, ప్రకాష్ రాజ్ సత్య దాదాగా – మల్టీ-స్టారర్ కాస్ట్ హైప్‌ను మరింత పెంచింది.

Read also-Rachakonda Police: ఆవారాల అంతు చూస్తున్న షీ టీమ్స్ బృందాలు.. 310 మంది పోకిరీలను అరెస్టు!

ఇదిలా ఉండగా హీరో సిద్ధు జొన్నలగడ్డ చేసిన ట్వీట్‌ ఫ్యాన్స ను ఆందోళనకు గురిచేస్తుంది. అందులో ఏం అన్నారంటే.. ‘పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై ఈ హైప్ ఫ్యాన్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. “25వ వరకు మేము ఉంటామో పోతామో అర్థం కాదు” అంటూ హాస్యంగా చెప్పినా, ఇది రియల్ ఇష్యూ. ఫ్యాన్స్ ఎక్సైట్‌మెంట్ మధ్య ఆంక్షైటీ, స్లీప్‌లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు. రెడ్డిట్‌లో “హైప్ బ్యాక్‌ఫైర్ అయితే?” చర్చలు. టికెట్ ఆక్షన్స్ ఆర్థిక ఒత్తిడి కలిగిస్తున్నాయి. ఒక ఫ్యాన్ పోస్ట్: “OG హైప్ మా డెత్ రీజన్”. ఇది ఫ్యాన్ కల్చర్ డార్క్ సైడ్‌ను చూపిస్తుంది – భావోద్వేగాలు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం. కానీ, ఈ హైప్ పాజిటివ్‌గా కూడా పని చేస్తోంది. డీవీవీ పోస్టర్స్ ఫ్యాన్స్‌ను యూనైట్ చేస్తున్నాయి. పవన్ “కామ్ బ్యాక్”గా సక్సెస్ అయితే, ఇది తెలుగు సినిమా మైలురాయి అవుతుంది.

Just In

01

Telangana: జాతీయ రహదారులు ఎందుకు ఆలస్యమవుతున్నాయ్ ..?

Yedupayala Vana Durga: ఏడుపాయలలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?

OG Benefit Show: మొత్తానికి సాధించారు.. ఏపీలో బెనిఫిట్ షో టైమింగ్ మారింది!

Haris Rauf controversy: పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ భార్య షాకింగ్ పోస్టు.. వివాదానికి మరింత ఆజ్యం