Adluri Laxman Kumar (ుimagecrdit:twitter)
తెలంగాణ

Adluri Laxman Kumar: మైనార్టీ ఉద్యోగుల జీతాల్లో టెక్నికల్ ఎర్రర్.. త్వరలో జీఓ జారీ!

Adluri Laxman Kumar: మైనార్టీ వెల్ఫేర్ ఉద్యోగుల జీతాల విషయంలో టెక్నికల్ ఎర్రర్(Technical error) సమస్య వచ్చిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్​(Minister Adluri Lakshman) పేర్కొన్నారు. ఆ సమస్యను వెంటనే పరిష్కరించి జీవో విడుదల చేసి జీతాలు ఇవ్వనున్నామన్నారు. సోమవారం లేదా మంగళవారం లో ఉద్యోగులకు జీతాలు అందుతాయన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్(Finance Department) అధికారుల తప్పిదం వల్ల టెక్నికల్ ఎర్రర్ వచ్చిందన్నారు. సమస్యపై సీఎం(CM), డిప్యూటీ సీఎం తో మాట్లాడి పరిష్కారం చేశామన్నారు. శనివారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ.. తన పరిధిలోని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత తనపై ఉన్నదన్నారు.

వేతనాల విషయంలో..

ఉద్యోగుల పదోన్నతులు ఇతర అంశాల పై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఉద్యోగులకు ఎల్లప్పుడూ కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 24 క్యాడర్లలో 18 క్యాడర్ల ఉద్యోగుల వేతనాలు యధాతధంగా కొనసాగుతున్నాయన్నారు. జూనియర్ లెక్చరర్స్‌, పీజీటీ, టీజీటీ, స్టాఫ్‌ నర్స్‌, ఐసీటీ, ఇన్‌స్ట్రక్టర్స్‌, మ్యూజిక్‌, ఆర్ట్‌ టీచర్ల వేతనాల విషయంలో తప్పుడు లెక్కింపు జరిగిందన్నారు. వీరిని పొరపాటున పార్ట్‌టైమ్‌ ఉద్యోగులుగా పరిగణించడం వల్ల గందరగోళం నెలకొన్నదని క్లారిటీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదన్నారు.

Also Read: Pakistan Saudi: పాక్‌కు అండగా భారత్‌తో సౌదీఅరేబియా యుద్ధం చేస్తుందా?.. పాక్ మంత్రి క్లారిటీ

సమగ్ర అబ్స్ట్రాక్ట్ సిద్ధం

విద్య పట్ల సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం వెనుకాడదనీ మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోందని, అందుకు అనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. టీం వర్క్‌తో, సమన్వయంతో పనిచేయాలని, గ్యాప్‌లకు తావివ్వకూడదని మంత్రి సూచించారు.పెండింగ్ సమస్యల పరిష్కార బాధ్యత తనదేనని మంత్రి స్పష్టం చేశారు. అన్ని వెల్ఫేర్ సొసైటీలు, శాఖలు ఒక సమగ్ర అబ్స్ట్రాక్ట్ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రి ఆదేశించారు.

Also Read: Kavitha Vs BRS: కవితతో టచ్‌లో ఉన్నది ఎవరు?.. బీఆర్ఎస్ అధిష్టానం ఆరా?

Just In

01

Pak Army vs People: పాక్ ఆర్మీపై తిరగబడ్డ ప్రజలు. తమ పిల్లలు ఉగ్రవాదులా అంటూ ఫైర్!

Damodar Rajanarsimha: ఎన్ని అడ్డంకులు వచ్చినా రోడ్డు వెడల్పు చేయాల్సిందే: మంత్రి దామోదర రాజనర్సింహ

Sandeep Reddy Vanga: సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగా .. త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్

Viral Video: నషా ఎక్కిన యువ జంట.. పోలీసు జీపుపైనే రొమాన్స్.. ఎంతకు తెగించార్రా!

Siddipet District: నీ రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు ప్రచారమా.. బీజేపీ నేతలు ఫైర్