NCD Screening (imagecreditLtwitter)
తెలంగాణ

NCD Screening: రోగాలపై ఆరా.. ఇంటింటికీ వెరిఫికేషన్ ఎన్ సీ డీ స్క్రీనింగ్ పక్కా?

NCD Screening: నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ స్క్రీనింగ్ ను ఇక నుంచి పక్కాగా నిర్వహించాలని సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంటింటికీ విజిట్ చేసి స్క్రీనింగ్ చేయనున్నారు. బీపీ, షుగర్ లక్షణాలు ఉన్నాయా? ఎంత కాలం నుంచి ఉన్నాయి? మందులు వాడుతున్నారా? అంటూ క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్ ఎం(ANM)లు స్క్రీనింగ్ చేయనున్నారు. స్క్రీనింగ్ చేయడంతో పాటు పేషెంట్ ఇంటి నుంచే డీటేయిల్స్ నమోదు చేయనున్నారు. అంతేగాక పేషెంట్ ఇంటి నుంచే డిజిటల్ మోడ్ లో రికార్డు చేయనున్నారు. పేషెంట్ల వివరాలు స్పష్టంగా తెలిసేందుకు అక్కడ్నుంచే ఆశాలు, ఏఎన్ ఎంలు బయోమెట్రిక్ ఇవ్వనున్నారు. దీని వలన వివరాలు ఫర్ ఫెక్ట్ గా వస్తాయనేది వైద్యారోగ్యశాఖ అధికారులు భావన. ఈ మేరకు ఇప్పటికే ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ప్రత్యేక పరికరాలను కూడా క్షేత్రస్థాయిలోని స్టాఫ్​ కు అందజేసినట్లు వైద్యాధికారి ఒకరు తెలిపారు.

సుమారు 2 కోట్ల మందికి స్క్రీనింగ్..

గతంలో కేవలం బీపీ(BP), షుగర్(Shugar) స్క్రీనింగ్ చేయగా.. ఈ దఫా క్యాన్సర్ స్క్రీనింగ్ ను కూడా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినట్లు నేషనల్ హెల్త్ మిషన్(National Health Mission) ఆఫీసర్లు వివరించారు. 30 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికి నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఆఫీసర్లు వివరించారు. ఇక ఎన్ సీడీ వివరాలు నమోదుకు గతంలో కేంద్ర ప్రభుత్వం పోర్టల్ ను వినియోగించారు. ఈ సారి ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక వెబ్ పోర్టల్ ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక నుంచి ఎన్ సీడీ డేటా ఆ పోర్టల్ లోనే ఎంట్రీ చేయనున్నారు. దీని వలన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల డేటాల్లో వ్యత్యాసం కనిపించిందని ఆఫీసర్లు తెలిపారు.

Also Read: EPFO Passbook Lite: పీఎఫ్ విత్‌డ్రా ఇక చాలా సులభం .. కొత్త ఫీచర్ వచ్చేసింది

డిజిటల్ కార్డులకు ఈజీ?

డిజిటల్ హెల్త్ కార్డుల రూప కల్పనకు ఈ ఎన్ సీడీ ఫర్ క్ట్ గా ఉపయోగపడుతుందని ఎన్ హెచ్ ఎమ్(NHM) విభాగం స్పష్టం చేసింది. పేషెంట్ల డేటా పర్ ఫెక్ట్ గా డిజిటల్ కార్డులకు ఉపయోగపడనున్నది. వాస్తావనికి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కంట్రోల్ లో తెలంగాణ ఫర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. ఇతర రాష్ట్రాల కంటే ఎన్ సీడీ స్క్రీనింగ్ మన దగ్గర మెరుగ్గా జరుగుతుంది. ఇప్పటికే మూడు దఫాలుగా ఎన్ సీడీ స్క్రీనింగ్ జరిగింది. ఇప్పటి వరకు 30 ఏళ్లకు పైబడిన వారిలో దాదాపు కోటిన్నర మందికి పైగా పరీక్షలు చేశారు. బీపీ,షుగర్ బాధితులకు నెలకు సరిపోయే మందుల కిట్లను అందజేశారు. క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించి, వ్యాధి తీవ్రతరం కాకుండా మెడికల్ కాలేజీల కు కేసులను రిఫర్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఏన్ ఎంలు ఈ స్క్రీనింగ్ నుసక్సెస్ పుల్ గా కొనసాగిస్తున్నారు దీంతోనే గతంలో నేషనల్ సెమినార్ మన దగ్గర జరిగినట్లు హెల్త్ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది.

Also Read: OG Movie: తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చేసింది.. ప్రీమియర్ షో టికెట్ రేట్ ఎంతంటే..

Just In

01

H1B Exemption: హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు నుంచి వారికి మినహాయింపు.. సుముఖంగా ఉన్న ట్రంప్!

CM Revanth Reddy: సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నిలువెత్తు బంగారం సమర్పణ

DRDO Recruitment 2025: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!

Lord Hanuman: ఇక దేవుళ్ల వంతు.. హనుమంతుడిపై నోరు పారేసుకున్న ట్రంప్ పార్టీ నేత

Crime News: జోగిపేటలో దారుణం.. పండ్ల కోసం వెళ్లి యువకుడు మృతి