Ramachandra Rao: కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై విచారణ చేయాలని, కాంట్రాక్టర్లు, పొలిటీషియన్స్ నూ విచారణ చేపట్టాలని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) డిమాండ్ చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతి దానికి అడ్డుకుంటున్నది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అని విమర్శలు చేస్తున్నారని, సీఎంకు కిషన్ రెడ్డి, బీజేపీ ఫోబియా పట్టుకుందేమోనని చురకలంటించారు. అందుకే నిత్యం ఆయన పేరు తలుస్తున్నాడని ఎద్దేవాచేశారు. సీఎం ఇప్పటికే 50కి పైగా ఢిల్లీ పర్యటనలు చేశారని, చేస్తూనే ఉంటారని, దీన్ని సెలెబ్రేట్ చేయాలని సెటైర్లు వేశారు. ఈ తరహా పాలనలో తెలంగాణలో అభివృద్ధి ఎలా సాధ్యమని రాంచందర్ రావు ప్రశ్నించారు.
హైడ్రోజన్ బాంబు పేలుస్తా..
అడ్మినిస్ట్రేషన్ లో బ్యూరోక్రసీ చాలా కీలకమని, బ్యూరోక్రాట్ల నియామకంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందని విమర్శలు చేశారు. విద్యారంగం పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ఉద్యోగుల జీతాలనే సకాలంలో ఇవ్వడంలేదని, కానీ సీఎం ఓయూకు వెళ్లి రూ.వందల కోట్లు ఇస్తానని అంటున్నారన్నారు. ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు పార్టీలకతీతంగా దేశ సమగ్రతను కాపాడేందుకు అంతా ఒక్కటిగా నిలవాల్సింది పోయి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారంటూ ఫైరయ్యారు. ఆఖరికి బలగాలను కూడా అవమానించేలా వ్యాఖ్యానించారన్నారు. రాహుల్.. హైడ్రోజన్ బాంబు పేలుస్తానని ఏవేవో కబుర్లు చెప్పారని, అన్నీ తుస్సు బాంబులే అయ్యాయని రాంచందర్ రావు ఎద్దేవాచేశారు. ఇకపోతే పాక్.. తన సొంత ఇల్లులా అనిపిస్తోందని శ్యామ్ పిట్రోడా.. మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ వచ్చిందని, అయినా దేశం నిలబడిందని, ఇలాంటి వ్యాఖ్యలకు భయపడుతామా? అని వ్యాఖ్యానించారు. రాహుల్ ఇప్పుడు ఓట్ చోరీ అంటున్నారని, ఎలా ఓట్ చోరీ అయిందో చెప్పాలని రాంచందర్ రావు ప్రశ్నించారు.
Also Read: Ameesha Patel: వారితో డేటింగ్‌కు రెడీ అంటున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్!.. కారణం ఇదేనా..
వారి వెనుక విదేశీయుల హస్తం..
గత ఎన్నికల్లో బోగస్ ఓట్లు నమోదయ్యాయని, దీని వెనుక కాంగ్రెస్(Congress), ఎంఐఎం(MIM) ఉన్నాయని ఆరోపించారు. రాజ్ నాథ్ సింగ్(Rajnadah Singh) లైనప్ విషయంలో ఈటలకు, పార్టీకి మధ్య ఎలాంటి ఇష్యూ జరగలేదన్నారు. ఇకపోతే రాష్ట్రంలో పొలిటికల్ వాక్యూమ్ ఉందని, తాము దాన్ని ఫిలప్ చేసి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ధీమా వ్యక్తంచేశారు. ఇప్పుడిప్పుడే కమిటీలు ఏర్పాటుచేసుకున్నామని రాంచందర్ రావు వివరించారు. కాళేశ్వరం విషయంలో సీబీ(CBI)ఐకి కేసు ఇవ్వాలని తాము డిమాండ్ చేశామని, సీబీఐ వాళ్లు ఎప్పుడు రావాలనేది వారు డిసైడ్ చేసుకున్నాక ఎంటర్ అవుతారని పేర్కొన్నారు. ఇందులో బీజేపీకి, మోడీ(Modhi)కి ఎలాంటి సంబంధం ఉండదన్నారు.
ఇదిలాఉండగా నక్సల్స్ కు డబ్బులు, వెపన్స్ ఎలా అందుతున్నాయని రాంచందర్ రావు ప్రశ్నించారు. వారి వెనుక విదేశీయుల హస్తం ఉందనే అనుమానాలున్నాయన్నారు. అందుకే వారిని లొంగిపోవాలని డెడ్ లైన్ విధించామని తెలిపారు. నక్సల్స్ ను చర్చల కోసం కాంగ్రె(Congress)స్ పిలిచి ఎన్ కౌంటర్ చేయొచ్చని, కానీ తాము మాత్రం నక్సల్స్ ను పిలిచి చర్చించాలా? అని రాంచందర్ రావు ప్రశ్నించారు. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టవద్దని కాంగ్రెస్ భావిస్తోందని, అందుకే ఆలస్యం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోతాయన్నారు. ఇకపోతే.. జూబ్లీహిల్స్ బైపోల్ లో పోటీకోసం తనవద్దకు 2, 3 అప్లికేషన్లు వచ్చాయని రాంచందర్ రావు తెలిపారు.
Also Read: Huzurabad: అంగన్‌వాడీ గుడ్లతో.. మందుబాబులకు స్నాక్స్.. వామ్మో ఇలా ఉన్నారేంట్రా!