Kona Venkat on The Raja Saab Trailer
ఎంటర్‌టైన్మెంట్

Kona Venkat: కోన వెంకట్ ‘ది రాజా సాబ్’ ట్రైలర్ రివ్యూ.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే!

Kona Venkat: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాబోయే చిత్రం ‘ది రాజా సాబ్’ టీజర్ ఇటీవల విడుదలై సినీ అభిమానుల్లో భారీ హైప్‌ను సృష్టించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2 దసరా కానుకగా విడుదల కాబోతున్న ‘కాంతార చాప్టర్ 1’ చిత్రంతో కలిపి థియేటర్లలో ‘ది రాజా సాబ్’ చిత్ర ట్రైలర్‌ను ప్రదర్శించబోతున్నట్లుగా ఇటీవల చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అదెలా అంటే, తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చూశానని చెబుతూ.. ప్రముఖ రచయిత కోన వెంకట్ ట్విట్టర్ వేదికగా తన రివ్యూని ఇచ్చేశారు. ఈ ట్రైలర్ చూసినా ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఎక్స్ వేదికగా ఆయన షేర్ చేసుకోవడంతో.. ఒక్కసారిగా అంతా మళ్లీ ‘రాజా సాబ్’ జపం చేస్తున్నారు. ఇక ఆయన ఇచ్చిన రివ్యూ విన్న తర్వాత ఫ్యాన్స్‌కి అయితే పూనకాలే వస్తున్నాయంటే నమ్మాలి మరి.

Also Read- OG Movie: తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చేసింది.. ప్రీమియర్ షో టికెట్ రేట్ ఎంతంటే..

బాక్సాఫీస్‌ దగ్గర సునామీనే!

ఇంతకీ కోన వెంకట్ ట్రైలర్ గురించి ఏం చెప్పారంటే.. ఇప్పుడే ది రాజా సాబ్ ట్రైలర్ చూశాను. నన్ను నమ్మండి.. ఇది భారతీయ సినిమాలో ఈ జానర్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది. డార్లింగ్ ప్రభాస్ అద్భుతంగా నటించాడు. డైరెక్టర్ మారుతి నీవు సూపర్బ్‌గా తీశావ్. అనేక వావ్ మూమెంట్స్ ఇందులో ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు అత్యద్భుతం. 9 జనవరి, 2026న భారతీయ బాక్సాఫీస్‌ దగ్గర ఈ సినిమా సునామీ సృష్టిస్తుంది’’ అని కోన వెంకట్ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Also Read- HCA Corruption: జగన్మోహన్​ రావు హెచ్​సీఏ అక్రమాలు పార్ట్ 7.. సంపత్ కుమార్​ విచారణతో వెలుగులోకి సంచలన నిజాలు

కోన వెంకట్ ట్వీట్‌తో అంచనాలు డబుల్

మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం, ప్రభాస్ అభిమానులకు పండగ కానుకగా 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది. ఇటీవల వచ్చిన టీజర్‌లో ప్రభాస్ వింటేజ్ శైలి, హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌ల గ్లామర్, సంజయ్ దత్ రోల్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ ఫ్యాన్స్‌కి పిచ్చపిచ్చగా నచ్చేశాయి. ఇప్పుడు కోన వెంకట్ ట్వీట్‌ చూస్తుంటే.. ఈ చిత్రం అత్యద్భుతమైన నిర్మాణ విలువలతో, హారర్ ఫాంటసీ జానర్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయనుందనేది అర్థమవుతోంది. ప్రభాస్ సినిమాలకు సంక్రాంతి సీజన్ ఎప్పుడూ లక్కీ అని, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ టైమ్‌లో కోన వెంకట్ ట్వీట్ ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచిందని చెప్పొచ్చు. ఇదే అంచనాలు సంక్రాంతి వరకు మెయింటైన్ చేయగలిగితే మాత్రం.. మారుతి బ్లాక్ బస్టర్ కొట్టినట్టే.  చూద్దాం.. ఏం జరగబోతుందో?

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?