Andhrapradesh Senior IAS Officer As New CS Of AP
Politics

CS Of AP: ఏపీ సీఎస్‌గా నీరబ్‌ కుమార్‌ ప్రసాద్

Andhrapradesh Senior IAS Officer As New CS Of AP: ఏపీలో వైసీపీ పార్టీ గెలుస్తుందన్న సర్వేల అంచనాలన్ని తారుమారు అయ్యాయి. వైసీపీ పార్టీ గెలుస్తుందని తెలిపిన సర్వేలన్నింటికి ఊహించని షాక్‌ ఇచ్చారు ఏపీ ప్రజలు. ఇందులో భాగంగానే తాజాగా వెల్లడించిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన పార్టీ ఎమ్యేల్యేలకు పట్టం కట్టి, బ్రహ్మరథం పట్టారు. అయితే నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అన్ని శాఖలపై ఫోకస్‌ పెట్టి అధికారులను నియమించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త సీఎస్‌గా ఆయన పేరును ప్రభుత్వం పరిశీలించి నియమించారు. బుధవారం రోజున ఆయన ఉండవల్లి నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో ఏపీ నెక్స్ట్ సీఎస్ ఆయనే అని ప్రచారం జరుగుతోంది. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. సీఎస్‌గా ఆయన నియామకంపై జూన్ 7న ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుత సీఎస్‌ కె.ఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఆయన జూన్‌ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో నీరభ్‌ కుమార్‌ని నియమించింది రాష్ట్రప్రభుత్వం. అంతేకాదు గతంలో ఆయా శాఖలకు పనిచేసిన అనుభవం ఉండటంతో ఆయన పేరునే ఫైనల్ చేసి రాష్ట్ర సీఎస్‌గా నియమించారు. సీఎస్‌గా నియమితులైన అనంతరం ఉన్నతాధికారులతో మీటింగ్ నిర్వహించారు.

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!