Jupally Krishna Rao (imagecredit:swetcha)
తెలంగాణ

Jupally Krishna Rao: మాదకద్రవ్యాల నివారణ అందరి బాధ్యత: మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupally Krishna Rao: యువత జీవితాలకు ప్రమాదకరంగా మారిన మాదకద్రవ్యాల నివారణ సమాజంలో అందరి బాధ్యత అని మంత్రి జూపల్లి కృష్ణ రావు(Min Jupally Krishna Rao) అన్నారు. హైదరాబాద్(Hyderabad), హిమాయత్ నగర్(Himayath Nagar), మఖ్డూమ్ భవన్, రాజ్ బహదూర్ గౌర్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజానాట్య మండలి నిర్వహించిన మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళారూపాల వర్కుషాప్ ను గురువారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఈ సమస్యను ఎదుర్కోవడంలో కళాకారులూ కీలక పాత్ర పోషించాలన్నారు.

ప్రజానాట్య మండలి కళాకారులు

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అన్ని వసతులు, సౌకర్యాలతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. దీనిపై ప్రజల్లో చైతన్యం కల్పించే దిశగా విధినాటకాలను, కళారూపాలను ప్రదర్శించాలని తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, ప్రభుత్వ వైద్యం పై ముఖ్యమంత్రి రేవంత రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక ద్రుష్టి కేంద్రీకరించారన్నారు. ప్రజలు ప్రైవేట్(Private), కార్పొరేట్(Carporate) ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని కోరారు.

Also Read: Harikatha: ‘హరికథ’కు మంత్రి వాకిటి శ్రీహరి సపోర్ట్.. ఏం చేశారంటే?

ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దురా!

అంతకు ముందు ప్రజానాట్య మండలి కళాకారులూ ప్రదర్శించిన ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దురా! మరియు కార్పొరేట్ వద్దురా ప్రభుత్వ ఆసుపత్రులు ముద్దురా ! అనే విధి నాటకాలను మంత్రి తిలకించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం(MLC Nellikanthi Satyam), సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణి శంకర్, ఛాయాదేవి, మరుపాక అనిల్ కుమార్, స్టాలిన్, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కె. శ్రీనివాస్, లక్ష్మి నారాయణ కళాకారులు పాల్గొన్నారు.

Also Read: Shocking News: చనిపోయాడని అంత్యక్రియలు నిర్వహిస్తే..16 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు!

Just In

01

Raasi: స్నానం చేస్తూ చేసే.. అలాంటి సీన్స్ నాకు సెట్ అవ్వవు.. సంచలన కామెంట్స్ చేసిన రాశి

Mahabubabad District: బతుకమ్మ ఆడుతూ.. గుండెపోటుతో హిళ మృతి.. ఎక్కడంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమొదు

Pawan Kalyan: తెలంగాణలో ఈవెంట్ పెట్టి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పలేదు.. పవన్ ని ఏకిపారేస్తున్న నెటిజన్స్

Mahabubabad District: ప్రభుత్వ అధికారుల బహిరంగ వాగ్వాదం.. బతుకమ్మ వేడుకల్లో ఉద్రిక్తత