Maoist Letter: చర్లలో మావోయిస్టులు విడుదల చేసిన లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. భూస్వాములు, రాజకీయ నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని లేదంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ లేఖను గురువారం మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట విడుదలైంది. లేఖలో ముఖ్యంగా పరుచూరి ప్రేమ్ చంద్(Prem Chand), పరుచూరి రవికుమార్, జవ్వాది రవికుమార్, ఇర్ఫా వసంత్ వాళ్ళకు సంబంధించిన కొలీగ్స్, లంక రాజు, కోటేరు శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి బ్రదర్స్ వీరితోపాటు వ్యాపారస్తులు శేశెట్టి సాంబయ్య, వలస లింగమూర్తి లు తమ పద్ధతి మార్చుకోవాలంటూ లేఖలో హెచ్చరించారు. జవ్వాది విలేఖరి పేరుతో ప్రజలను ఏమార్చుతున్నాడని లేఖ లో మావోయిస్టులు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు నల్లపు దుర్గా ప్రసాద్, అవును విజయ భాస్కర్ రెడ్డి, ఇందుల బ్రదర్స్ భూస్వాములకు, పెత్తందారులకు వంద పాడుతున్నారని మావోయిస్టులు లేఖలో వెల్లడించారు.
మావోయిస్టు అధికార ప్రతినిధి
ఇన్ ఫార్మర్లు భూస్వాములకు, పెత్తందారుల కనుసన్నల్లో పనిచేస్తున్నారని వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో వెల్లడైంది. కాగా, ఈ లేఖతో ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు(Mulugu) జిల్లా ఏజెన్సీ ప్రాంత గ్రామాల నాయకులు, వ్యాపారులు, జర్నలిస్టులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో కూడా కాల్పుల విరమణ చేస్తున్నామని లేఖ విడుదలైంది. ఇంతవరకు ఆ లేఖ వైరల్ అవుతున్న మావోయిస్టులు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వం చత్తీస్గడ్ రాష్ట్ర(Chhattisgarh State) ప్రభుత్వం సైతం మావోయిస్టులు విడుదల చేసిన లేఖ పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు పోలీసులు కూడా అభయ్ పేరిట విడుదలైన లేఖ పై ఎలాంటి స్పందన కనిపించలేదు. అసలు లేఖలు విడుదల అవుతున్నాయా..? అంటే విడుదల అవుతూనే ఉన్నాయి.. కానీ ఆ లేఖలకు సంబంధించి ఎవరు కూడా స్పందించకపోవడం గమనార్హం. అయితే ఇటీవల మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ పేరిట విడుదలైన లేఖ ఆగస్టు 15 లో లేఖ రాసినట్లు ఆ లేఖను పరిశీలిస్తే తెలుస్తుంది. అంటే దాదాపు నెల తర్వాత ఆ లేఖ బయటికి రావడంతో ఎందుకు ఇంత లేటుగా బయటకు వచ్చింది.
Also Read: TGPSC Controversy: గ్రూప్ 1 పోస్టులకు రూ.3 కోట్లు.. నిరూపించాలంటూ తల్లితండ్రులు డిమాండ్!
అసలు మావోయిస్టులు రాసిందేనా..?
మావోయిస్టులు రాస్తే రాసిన ఒకటి రెండు రోజుల్లోనే విడుదల చేయాలి కదా..? అది జరగలేదు. ఆ లేఖ దేశవ్యాప్తంగా వైరల్ అయినప్పటికీ అటు మావోయిస్టుల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడం గమనార్హం. ఈ లేఖల పరంపర ఎలా కొనసాగుతుందో..? ఎక్కడికి దారితీస్తుందోనని ఆదివాసీ గ్రామాలు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. రాజకీయ నాయకులు మొదలుకొని కొందరు వ్యాపారులు, భూస్వాములు పోలీసులకు పూర్తిగా ఇన్ఫార్మర్లుగా మారిపోయారని స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థలో పనిచేస్తూ మా పార్టీ కి సహకరిస్తున్నట్లుగా మోసపూరిత మాటలు చెప్పి కొందరు ఇన్ ఫార్మర్స్ మమ్ములను మాయ చేస్తున్నారు. వీరందరికీ ప్రజా కోర్టులో మారడం శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. ఖబర్దార్ పోలీస్ ఇన్ ఫార్మర్స్ అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
మారణకాండకు బదులు
ఈ వ్యవహారాన్ని మా నెట్వర్క్ ఆపరేషన్(Network operation) తో వెళ్లడైందని స్పష్టం చేశారు. అడవుల్లో ఖనిజ సంపదను ఎత్తుకెళ్లేందుకు బ్రాహ్మణీయ ఫాసిస్ట్ భాషా ప్రభుత్వంతో చేతులు కలుపుతూ మా పార్టీపై కుట్రలు పన్నుతున్నారని వివరించారు. గొల్ల గుప్ప గ్రామానికి చెందిన ఆదివాసి మహిళపై జరిగిన అత్యాచారంపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. పూసు గుప్పలో జరిగిన మరణాలపై కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఆపరేషన్ కగార్(Operation Kagar) లో అమరులైన వారి త్యాగాల స్ఫూర్తితో ముందుకు సాగుతామని వివరించారు. ఆదివాసీలు పార్టీ సభ్యులపై సాగుతున్న మారణకాండకు బదులు తీర్చుకుంటామన్నారు. ప్రజల కోసం పనిచేసే మావోయిస్టు పార్టీకి ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యావంతులు, జర్నలిస్టులు, పౌర హక్కులు, మానవ హక్కుల సంఘాలు విప్లవోద్యమాలు చేస్తున్న ఉద్యమకారులకు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే ఇందులో ట్విస్టెంటంటే ఈ లేఖ రాసింది మాత్రం ఇట్లు విప్లవ అని ఉంది.
Also Read: Bhatti Vikramarka: రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుపై నివేదిక ఇవ్వండి: భట్టి విక్రమార్క