Grama Dukan: మరో నూతన పథకానికి ప్రభుత్వం శ్రీకారం
Grama Dukan (imagecredit:twitter)
Telangana News

Grama Dukan: మరో నూతన పథకానికి ప్రభుత్వం శ్రీకారం.. ఇక మహిళలకు పండగే!

Grama Dukan: మహిళలను మరింతగా ఆర్థికంగా బలోపేతానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే పలు పథకాలకు శ్రీకారం చుట్టింది. గ్రామంలోనే ‘గ్రామదుకాణ్’ పేరిట అందుబాటులోకి తీసుకురాబోతుంది. అందుకు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పైలట్ ప్రాజెక్టులుగా ఐదు జిల్లాలను ఎంపిక చేసింది. అక్కడ ఏ మహిళా సంఘానికి బాధ్యతలు అప్పగించాలి? ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఏపీఎంలకు అప్పగించడంతో వారు వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది.

గ్రామ సమాఖ్యల ద్వారా..

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం, వారిని ఆర్ధికంగా బలోపేతం చేయడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారిని బలోపేతం చేస్తే కుటుంబం ఆర్థికంగా బలపేతం అవుతుందని దీంతో అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని భావిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సెర్ప్ ద్వారా ప్రభుత్వం చేపట్టేబోయే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది. ప్రజాప్రభుత్వం గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి, ఆర్థికంగా బలోపేతానికి ‘గ్రామదుకాణ్’ అనే మరోపథకానికి శ్రీకారం చుట్టబోతుంది. మండల కేంద్రంలో అయితే మండల సమాఖ్య, గ్రామాల్లో గ్రామ సమాఖ్యల ద్వారా ఈ గ్రామ దుకాణ్ ను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ దుకాణ్ లో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచనున్నారు. పట్టణాల్లో మార్ట్ ల మాదిరిగా ప్రతీ వస్తువును ప్రజలకు చేరువలో ఉంచనున్నారు. ఎమ్మార్పీ(MRP) ధరలకు నాణ్యమైన వస్తువులతో పాటు రైతులు పండించే పప్పుదాన్యాలు, ఇతర పంటలను సైతం గ్రామ దుకాణ్ లో అందుబాటులో ఉంటాయి.

Also Read: Pak Terrorist: పాక్ బట్టలిప్పి.. నడిరోడ్డున నిలబెట్టిన ఉగ్రవాది.. వీడియో వైరల్

రుణం నాబార్డు.. పర్యవేక్షణ సెర్ప్

ఈ గ్రామ దుకాణ్ కు నాబార్డు(NABARD) రుణాలు ఇవ్వనుంది. కానీ పర్యవేక్షణ బాధ్యతలను మాత్రం సెర్ప్ కు అప్పగించారు. ఒక్కో గ్రామ యూనిట్ కు 3.72లక్షలు అందజేయనున్నారు. ఈ దుకాణ్ కు రెండేళ్ల పాటు అద్దె, ఫర్నీచర్, సేల్స్ గర్ల్ కు సైతం వేతనంను ప్రభుత్వమే ఇవ్వనుంది. మహిళా సంఘాల బలోపేతంకోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు.

ఫైలట్ ప్రాజెక్టు కింద 5 జిల్లాలు

ప్రభుత్వం ‘గ్రామ దుకాణ్’ పైలట్ ప్రాజెక్టు కింద ఐదు జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిసింది. అందులో మహబూబ్ నగర్(Mahabubnagar), భువనగిరియాదాద్రి(Bhuvanagiri Yadadri) , రంగారెడ్డి(Rangareddy), సంగారెడ్డి(Sanga Reddy), జనగాం(Jangaon) జిల్లాలను ఎంపికచేసినట్లు సెర్ప్ అధికారులు తెలిపారు. అయితే ఆయా జిల్లాలోని పట్టణ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందా? మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తే ఈ దుకాణ్ సక్సెస్ అవుతుందనేదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని ఏపీఎంలకు బాధ్యతలు అప్పగించడంతో వారి స్థలం లేదా మడిగలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Harikatha: ‘హరికథ’కు మంత్రి వాకిటి శ్రీహరి సపోర్ట్.. ఏం చేశారంటే?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..