Ankith Koyya on beauty
ఎంటర్‌టైన్మెంట్

Ankith Koyya: ‘బ్యూటీ’లో హీరో నేను కాదు.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్

Ankith Koyya: ‘బ్యూటీ’ (Beauty)లో హీరో నేను కాదని అన్నారు యంగ్ హీరో అంకిత్ కొయ్య (Ankith Koyya). ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై అంకిత్ కొయ్య, నీలఖి, వీకే నరేష్, వాసుకి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్యూటీ’. విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమూర్ భన్సల్ నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా, జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో అంకిత్ కొయ్య మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Mahavatar Narsimha OTT: ఇంకొన్ని గంటల్లోనే ఓటీటీలోకి ‘మహావతార్ నరసింహ’.. ఈ సడెన్ ట్విస్ట్ ఏంటి?

హీరో నేను కాదు..

‘‘ఈ సినిమా కథ ప్రతీ ఇంట్లో, ప్రతీ వీధిలో జరిగేదే. అందరికీ చాలా బాగా తెలిసిన కథే. అయినా సరే అందరూ తెలుసుకోవాల్సిన కథ ఇది. ప్రతీ ఒక్కరూ ప్రస్తుతం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియచెప్పే కథ. మిడిల్ క్లాస్ ఫాదర్ ఎమోషన్స్‌ను ఇందులో అద్భుతంగా చూపించారు. ఈ సినిమా టైటిల్‌ను, లోగోను అంతా కూడా డైరెక్టర్ మారుతి (Director Maruthi) డిజైన్ చేశారు. ఈ టైటిల్ పెట్టిన తర్వాత, అంతా ఫిక్స్ అయిన తర్వాతే నేను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ఈ కథ విని షాక్ అయ్యాను. కథ చాలా బాగా నచ్చింది. కాకపోతే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మొదట భయపడ్డాను. ఇందులో ఇంత వరకు నన్ను ఎప్పుడూ చూడనటువంటి పాత్రలో ప్రేక్షకులు చూస్తారు. అర్జున్ పాత్రలో నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఫస్ట్ భయపడ్డాను. ఆ తర్వాత ఓ నటుడిగా పాత్రకు న్యాయం చేయాలన్నదే నేను మైండ్‌లో పెట్టుకుని.. పాత్రకు కావాల్సినట్టుగా నటించాను. అసలు ఈ ‘బ్యూటీ’ చిత్రానికి హీరో నేను కాదు. నరేష్ (VK Naresh) హీరో. ఇందులోని ఆయన పాత్ర నాకు చాలా ఇష్టం. కథ విన్నప్పుడే ఆ పాత్రకి బాగా కనెక్ట్ అయ్యాను. ఓ మిడిల్ క్లాస్ ఫాదర్‌గా ఆయన నటించిన తీరుకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు, ఎమోషనల్ అవుతారు. ఈ మూవీకి ప్రధాన బలం కూడా ఆయనే. ఈ సినిమా విడుదల తర్వాత నరేష్, వాసుకి (Vasuki) వంటి వారి గురించే ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటారు.

Also Read- Rail Ticket Booking: ఈజీగా అన్‌రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్‌.. దక్షిణమధ్య రైల్వే సరికొత్త ముందడుగు

ప్రతి పాత్రకు జస్టిఫికేషన్..

ఇందులో హీరోయిన్ అలేఖ్య పాత్రలో నీలఖి అద్భుతంగా నటించింది. ఇంటిమేట్ సీన్లలో నటించేందుకు కాస్త ఇబ్బందిగా అనిపించినా.. నీలఖికి ఎక్కడ అసౌకర్యం కలుగుతుందో అని అనుకునే వాడిని. కానీ ఆమె మాత్రం పాత్రకు తగ్గట్టుగా చక్కగా నటించి, ఎంతగానో సహకరించారు. ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. ‘కన్నమ్మ’ పాట అయితే ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. విజయ్ బుల్గానిన్ చాలా మంచి పాటలు ఇచ్చారు. ఇక ఆర్ఆర్‌తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఎమోషనల్ సీన్స్‌కు అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. దర్శకుడు వర్దన్‌తో నేను కూడా కథా చర్చల్లో పాల్గొన్నాను. ప్రతీ చిన్న విషయాన్ని డీటైలింగ్‌గా చర్చించేవాళ్లం. ఇందులోని ప్రతి పాత్రకు ఓ జస్టిఫికేషన్ ఉంటుంది. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మాకు ఏం కావాలంటే అది వెంటనే ఏర్పాటు చేసేవారు. ప్రొడక్ట్ బాగా రావాలని ఆయన ఎప్పుడూ పరితపించేవారు. ఇక మాకు అండగా మారుతి, జీ స్టూడియో ఉండటంతో ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Jayammu Nischayammu Raa: నాకు ఆ డ్యాన్స్‌లేవీ రావ్.. జగపతిబాబు షోలో ప్రభుదేవా!

Sai Pallavi: బికినీలో నేచురల్ బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్!

Telangana: జాతీయ రహదారులు ఎందుకు ఆలస్యమవుతున్నాయ్ ..?

Yedupayala Vana Durga: ఏడుపాయలలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?