Upendra in Andhra King Taluka
ఎంటర్‌టైన్మెంట్

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. ఉపేంద్ర రాకింగ్ లుక్ విడుదల

Andhra King Taluka: ‘పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా’‌ను దృష్టిలో పెట్టుకుని ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) మోస్ట్ ఎవైటెడ్, యూనిక్ ఎంటర్‌టైనర్‌ చిత్రానికి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Taluka Movie) అనే టైటిల్‌ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. మహేష్ బాబు పి దర్శకత్వంలో, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ హిట్ సాంగ్స్‌తో ఈ సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అంటే ఓన్లీ రామ్, ఆయన సందడి మాత్రమే వినవచ్చింది. ఎందుకంటే, ఈ సినిమాతో రామ్ హీరోగానే కాకుండా తన మల్టీ టాలెంట్‌ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన ఓ పాట రాశారు. మరో పాట పాడారు. ఇలా తనలోని రచయితని, సింగర్‌ని ప్రేక్షకులకు తెలిసేలా చేసిన రామ్ పేరే అంతా వినిపిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడీ సినిమాలో మరో స్టార్ హీరోని మేకర్స్ పరిచయం చేశారు. ఆయన ఎవరో కాదు..

Also Read- OG Trailer Update: ‘ఓజీ’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

ఉపేంద్ర పుట్టినరోజు స్పెషల్‌గా..

ఈ సినిమాలో ఆంధ్రా కింగ్‌గా నటిస్తున్న సూపర్ స్టార్ ఉపేంద్ర (Upendra). సెప్టెంబర్ 18 హీరో ఉపేంద్ర పుట్టినరోజు పురస్కరించుకుని ‘హ్యాపీ బర్త్ డే ఆంధ్రా కింగ్’ (Happy Birthday Andhra King) అంటూ మేకర్స్ ఓ రాకింగ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పుడీ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో సూపర్ స్టార్ అవతార్‌లో ఉపేంద్ర తన అభిమానులకు అభివాదం చేస్తూ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో నిజ జీవితంలోని రోల్‌నే ఉపేంద్ర చేస్తున్నారని మేకర్స్ ఇప్పటికే చెప్పి ఉన్నారు. ఇక ఈ సినిమాలో రామ్‌ డై-హార్డ్ సినిమా ఫ్యాన్‌గా, ఆంధ్రా కింగ్‌కు అసలు సిసలు అభిమానిగా అలరించబోతున్నారు. ఇది ఒక అభిమాని బియోపిక్‌గా ఉండబోతోందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఉపేంద్ర లుక్‌తో ఈ సినిమాను చూసే కోణమే మారిపోతుందని మేకర్స్ భావిస్తున్నారు.

Also Read- Daksha: ‘దక్ష’తో హ్యాట్రిక్.. మంచు లక్ష్మి కాన్ఫిడెంట్ చూశారా!

ఈసారి హిట్ పక్కా..

ప్రస్తుతం రామ్‌కి మంచి హిట్ కావాలి. ఆయన నుంచి హిట్ వచ్చి ఇస్మార్ట్ కాలం అవుతుంది. అందుకే, ఈసారి రొటీన్‌గా కాకుండా చాలా కొత్తగా రామ్ ట్రై చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొడతాననే ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ సినిమా కోసం ఆయన ఎంతగానో కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వివేక్ అండ్ మెర్విన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 28న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Delhi Blast: ఒక్కొక్కటిగా వెలుగులోకి నిజాలు.. ఇంటెలిజెన్స్ తాజా అనుమానం ఇదే

Jubilee Hills Bypoll: పోలింగ్ రోజూ పంపకాల జోరు?.. జూబ్లీహిల్స్‌లో ఎంత పంచారంటే?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బై పోలింగ్ లో హీట్ ట్రెండ్.. మాస్ లోని మెజార్టీ లంతా నవీన్ వైపే?

Delhi Blast: పేలుడుకు ముందు 3 రోజులపాటు అండర్‌గ్రౌండ్‌లోకి ఉమర్.. వెలుగులోకి సంచలన నిజాలు

Gadwal District: నిధులు లేక నిరీక్షణ రెండేళ్ల నుంచి రాని గ్రాంట్లు.. చెక్కులు పాస్ కాక పంచాయతీ కార్యదర్శుల అవస్థలు