Minister Adluri Laxman (imagecredit:twitter)
తెలంగాణ

Minister Adluri Laxman: విద్యార్థులు కాదు వాల్లు మా కన్న బిడ్డలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌

Minister Adluri Laxman: తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్(Minister Adluri Laxman Kumar) అన్నారు. రంగారెడ్డి జిల్లా(Ragareddy) షాద్ నగర్ లో రెండు రోజులపాటు జరిగిన కృత్రిమ మేధా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) జాతీయ ముగింపు సదస్సుకు మంత్రి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్(Veerlapally Shankar), సాంఘిక సంక్షేమ శాఖ విద్యాసంస్థల రాష్ట్ర కార్యదర్శి కే. సీతాలక్ష్మి(Seethlaxmi) సంబంధిత శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని ఆ జిల్లాలకు చెందిన గిరిజన గురుకుల డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

 విద్యాశాఖకు నిధులు..

స్థానిక కుంట్ల రామిరెడ్డి గార్డెన్ లో జరిగిన ముగింపు సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..విద్యా రంగంలో నేడు వస్తున్న సమూల మార్పులను ఆకలింపు చేసుకొని భవిష్యత్తు ప్రణాళికలను ఏర్పాటు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళుతుందని అన్నారు. రాష్ట్రంలో గత పాలకుల తప్పుడు విధానాల వల్ల విద్యాశాఖకు నిధులు కేటాయించలేదని జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొనేలా చేశారని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చాక గత 18 నెలల పాలనలో విద్యాశాఖకు పెద్దపీట వేసి ప్రాధాన్యత కల్పించారన్నారు.

Also Read: Vikarabad Rice Mill Scam: వికారాబాద్​ రైస్ మిల్లులో.. రూ.200 కోట్ల విలువైన బియ్యం మాయం?

ఎంత కష్టమైనా విద్యాభివృద్ధి కోసం..

విద్యాభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ రాజీ పడరని అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఓ సందర్భంలో వాహనంలో ప్రయాణించే సమయంలో విద్యా విషయంలో తనతో స్వయంగా మాట్లాడారని అవసరమైన నిధులు ఎంత కష్టమైనా విద్యాభివృద్ధి కోసం కేటాయిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. విద్య విషయంలో అభివృద్ధి నిధులు భవనాల నిర్మాణం వేతనాలు తదితర అంశాలలో సంబంధిత శాఖ కార్యదర్శి ఎక్కడ వెనక్కి తగ్గకూడదని ఒక మంత్రిగా తాను ఆదేశాలు జారీ చేస్తున్నానని విద్యా అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా వెచ్చించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.గత ప్రభుత్వాల మాదిరిగా విద్యను అస్తవ్యస్తం చేయకుండా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుదామని సూచించారు.

కృత్రిమ మేధా జాతీయ సదస్సు

రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయడం ఒక్కో పాఠశాలకు 200 కోట్లకు పైగా ఖర్చు చేయడం విద్యాభివృద్ధిపై రేవంత్ రెడ్డికి ఉన్న ఆసక్తి చిత్తశుద్ధి ఏమిటో నిరూపిస్తుందని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునేవారు విద్యార్థులే కాదు వారు తమకన్న బిడ్డలని మంత్రి ఉద్ఘాటించారు. షాద్ నగర్ లాంటి ప్రాంతంలో కృత్రిమ మేధా జాతీయ సదస్సును రెండు రోజులపాటు నిర్వహించిన ప్రిన్సిపల్ డాక్టర్ నీతా పోలేను మంత్రి లక్ష్మణ్ కుమార్ అభినందించారు. ఇక్కడ సదస్సు కోసం తన వంతు సహకారం అందించిన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు మంత్రి తన శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. మా గిరిజన బిడ్డలు ఎంతో గొప్ప మేధస్సుతో సదస్సులు పాల్గొనడం శుభసూచకమని అన్నారు. గొప్ప చదువులను మా బిడ్డలకు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని విద్యార్థులు ప్రజలు అధికారులు మీడియా పూర్తి సహకారం అందించాలని కోరారు.

Also Read: Damodara Rajanarasimha: గుడ్ న్యూస్.. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు

Just In

01

Splitsville review: ఈ బోల్డ్ కామెడీ చూడాలనుకుంటే ఏం చేయాలో తెలుసా..

Chhattisgarh Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తెలుగు అగ్రనేతలు హతం

Digital Arrest: పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉందంటూ వృద్ధుడి డిజిటల్ అరెస్ట్

Telusu Kada second song: సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ నుంచి సెకండ్ మెలొడీ.. అదిరింది మావా..

Harish Rao: రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం.. హరీష్ రావు ఫైర్