Jeevana Saphalya Awards: భూమి పుత్రుడు పొన్నం సత్తయ్య అని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) కొనియాడారు. ఉపాధి కోసం బాంబే వెళ్లి మళ్ళీ భూమిని నమ్ముకొని కష్టాన్ని పిల్లలను ప్రయోజకులను చేసిన వ్యక్తి సత్తయ్య అని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్టు ద్వారా పొన్నం సత్తయ్య జీవితసాపల్య పురస్కారాలను అంపశయ్య నవీన్, అంతడుపల రమాదేవిలకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో కలిసి శనివారం రవీంద్ర భారతిలో అట్టహాసంగా అవార్డులను ప్రధానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవం లో పొన్నం అశోక్ గౌడ్(Ashock Goud) స్వాగతం తెలపగా ,పొన్నం రవిచంద్ర వందనం సమర్పించారు.
సమాజానికి దూరమైన..
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సమాజం పై అవగాహన ఉన్న వ్యక్తి సత్తయ్య అన్నారు. పొన్నం ప్రభాకర్ తండ్రిని మించిన తనయుడని తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారు. ఇప్పుడు బీసీ(BC) లకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి పోరాడుతున్నారని అభినందించారు. కస్టపడి పనిచేసే తత్వమని పిల్లలను బాగా చదివించి ప్రయోజకులు చేశారని కొనియాడారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భూమి పుత్రుడు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం కవులు కళాకారులకు అందించడం అభినందనీయమన్నారు. సమాజానికి దూరమైన ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను కాపాడుకోవాలని సూచించారు. పొన్నం సత్తయ్య ఎంతో కాయ కష్టం చేసి భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసి పిల్లలను ప్రయోజకులను చేశారని ,పొన్నం ప్రభాకర్ చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు మంత్రి అయ్యారని ,తెలంగాణ ఉద్యమ సమయంలో అధికార పార్టీ ఎంపీగా ఉండి అధిష్టానాన్ని ధిక్కరించి ఉద్యమాన్ని చేశారని పోరాట యోధులుగా పొన్నం ప్రభాకర్ నిలిచారని అభినందించారు.
వ్యవసాయ కుటుంబం నుంచి..
మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మాట్లాడుతూ పొన్నం సత్తయ్య కుమారులు రైతు కుటుంబం నుంచి వచ్చి తెలంగాణ ప్రాంతంలో నైపుణ్యం ఉన్న అనేక మందిని గుర్తించి వారికి పురస్కారం అందిస్తున్నారన్నారు. పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం అందుకున్న వారికి అభినందనలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తాము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చామని కరీంనగర్ అవార్డు గ్రహీత అయిన అంపశయ్య నవీన్ ఇంట్లో తానే స్వయంగా పాలు పోసేవాడినని గుర్తు చేసుకున్నారు. గత సంవత్సరం బలగం కొమురవ్వకి అవార్డు ఇవ్వడం జరిగిందని వారికి ఇచ్చిన హామీ ప్రకారం ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షేట్కర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీడ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు,కార్పొరేషన్ చైర్మన్ లు చల్ల నరసింహారెడ్డి , జేరిపాటి జైపాల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి ,మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ,జాజుల శ్రీనివాస్ గౌడ్ , బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Anuparna Roy: గురువు మాట కూడా లెక్కచేయని వెనీస్ అవార్డు గ్రహీత.. ఎందుకంటే?