Mirai Movie: సూపర్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలోకి వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో, పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా థియేటర్లలో దూసుకెళుతోంది. సరికొత్త రికార్డులను ఈ సినిమా క్రియేట్ చేస్తుందనేలా అప్పుడే టాక్ కూడా మొదలైంది. అలాగే మొదటి రోజు కలెక్షన్స్ కూడా ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీస్ గురించి బాగా సెర్చింగ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా స్టోరీ మొదట ఏ హీరో దగ్గరకి వెళ్లింది? ఆ హీరో ఎందుకు కాదన్నాడు? అనేలా ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళిలే..
Also Read- TG Vishwa Prasad: రజినీకాంత్ ‘అరుణాచలం’ టైప్ కాదు.. నాకు డబ్బు విలువ తెలుసు!
‘మిరాయ్’ని రిజిక్ట్ చేసిన హీరో ఎవరంటే..
ఈ దర్శకుడికైనా హిట్ ఉంటేనే హీరోలు వెంటపడతారు. సినిమాటోగ్రాఫర్‌గా సక్సెస్ అయిన కార్తీక్ ఘట్టమనేని, దర్శకుడిగా మాత్రం ఇప్పటి వరకు నిరూపించుకోలేకపోయాడు. కానీ, రవితేజ మాత్రం అతన్ని బాగా నమ్మాడు. ఏదో ఒక రోజు.. ఇండస్ట్రీని షేక్ చేస్తాడని రవితేజ చెప్పినట్టే.. ‘మిరాయ్’తో కార్తీక్ తన సత్తా చాటాడు. ఈ ‘మిరాయ్’ కథని మొదట టాలీవుడ్ చాలా మంది హీరోలకు వినిపించాడట. ఎవరూ చేయడానికి ముందుకు రాలేదు. ఆఖరికి నేచురల్ స్టార్ నానికి ఈ కథ చెప్పగా, ఆయనకు నచ్చింది కానీ, ఓ విషయం ఆయనకు నచ్చక పోవడంతో.. ఆయన ఈ సినిమా చేయలేదని అంటున్నారు. ఆ విషయం ఏదో కాదు.. రెమ్యూనరేషన్. అవును, రెమ్యూనరేషన్ తను అడిగినంతా ఇవ్వక పోవడంతో నాని ఈ ప్రాజెక్ట్‌ని వదిలేసుకున్నాడని టాక్. ఇప్పుడు నిజంగా ఈ సినిమా సక్సెస్‌ను చూసి కచ్చితంగా ఫీలవుతాడని అంతా అనుకుంటూ ఉండటం విశేషం.
Also Read- Charan and Upasana: రామ్ చరణ్, ఉపాసన దంపతులు చెప్పబోయే గుడ్ న్యూస్ ఇదేనా?
టీమంతా హ్యాపీ
నాని ఒక్కడే కాదు.. అంతకు ముందు కార్తీక్ ఈ కథ చెప్పిన హీరోలంతా ఇప్పుడు బాధపడతారనడంలో సందేహమే లేదు. ఎందుకంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్‌లో దుమ్ము రేపుతోంది. విడుదలైన రెండో ఆట నుంచే స్ర్కీన్స్ పెరుగుతున్నాయంటే.. ప్రేక్షకులు ఈ సినిమాపై చూపిస్తున్న ప్రేమ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్ థ్యాంక్ యూ మీట్ కూడా నిర్వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతిబాబు, జయరామ్ వంటి వారు ఇతర పాత్రలను పోషించారు. ఈ సక్సెస్‌తో నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు