TG Vishwa Prasad: సూపర్ హీరో తేజ సజ్జా (Teja Sajja) నటించిన ‘మిరాయ్’ (Mirai Movie) చిత్రం బ్రహ్మాండంగా థియేటర్లలో దూసుకెళుతోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు (Manchu Manoj) పవర్ ఫుల్ పాత్రను పోషించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, శ్రియా శరణ్, జయరామ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్రహ్మండమైన సక్సెస్‌ను అందుకుని, హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో రికార్డులు క్రియేట్ చేసే దిశగా దూసుకెళుతోంది. చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్ శనివారం థ్యాంక్ యూ మీట్ నిర్వహించారు.
Also Read- Teja Sajja: ప్రభాస్ కారణంగానే.. ‘మిరాయ్’ సక్సెస్‌పై హీరో తేజ సజ్జా స్పందనిదే!
2024 మాకు అంతగా కలిసి రాలేదు
ఈ కార్యక్రమంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (Producer TG Vishwa Prasad) మాట్లాడుతూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జర్నీ 2017లో మొదలైంది. ‘గూఢచారి’ మా సంస్థకు ఫస్ట్ క్రెడిబిలిటీ తీసుకొచ్చింది. ఆ తర్వాత ప్రతి ఏడాదిలో దాదాపు పది సినిమాలు చేస్తూ వచ్చాం. కానీ 2024 మాకు అంతగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలో ‘మిరాయ్’ వంటి అద్భుతమైన విజయం మాకు మరెన్నో సినిమాలు చేసే గొప్ప ఎనర్జీని ఇచ్చింది. ఈ సినిమాను మా దగ్గరికి తీసుకొచ్చిన డైరెక్టర్ కార్తీక్‌కే ఈ క్రెడిట్ ఇస్తాను. కార్తీక్‌తో ‘నిన్ను కోరి’ సినిమా నుంచి మాకు మంచి రిలేషన్ ఉంది. ఈ స్పాన్‌లో కచ్చితంగా కార్తీక్ చేయగలడనే నమ్మకం నాకు ఫస్ట్ నుంచి ఉంది.
Also Read- Mirai success meet: ‘మిరాయ్’ సక్సెస్ మీట్‌లో ఎమోషనల్ అయిన మంచు మనోజ్.. ఎందుకంటే?
రూ. 2 వేలతో నా జర్నీ మొదలైంది
నేను చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చాను. నేను ‘అరుణాచలం’ సినిమాలో రజినీకాంత్ టైప్ కాదు. రూ. 2 వేలతో నా జర్నీ మొదలైంది. నాకు డబ్బు విలువ తెలుసు. ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలుసు. కార్తిక్ ఈ కథ చెప్పినప్పుడు తేజ వంటి కమిట్‌మెంట్ ఉన్న హీరోతో చేయాలనుకుని అనుకున్నాం. అప్పటికి ఇంకా ‘హనుమాన్’ కూడా రాలేదు. నాకు తేజాతో మంచి అనుబంధం ఉంది. ‘ఓ బేబీ’ చేసాం. మా నమ్మకం ఈరోజు నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో ఆడియన్స్ నుంచి గొప్ప క్రెడిబిలిటీ సంపాదించాము. అందరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. గౌరహరి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా నెక్స్ట్ నాలుగు సినిమాలకు కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. రానా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. హిందీలో రిలీజ్ చేయడానికి ఆయన ఎంకరేజ్‌మెంటే కారణం. డిస్ట్రిబ్యూటర్స్, మీడియా వారికి థాంక్యూ. ఈ సినిమాకు అద్భుతమైన విఎఫ్ఎక్స్ వర్క్ చేసిన మా టీమ్ అందరికీ థాంక్ యూ. మా అమ్మాయి కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా తన జర్నీ మొదలుపెట్టి.. ఈ సినిమాతో నిర్మాతగా మారారు. తను మా లక్కీ చార్మ్ అని భావిస్తున్నాం. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ’’ అని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు