Telangana Govt: మహిళలను ఆర్థికంగా(Empower Women) బలోపేతం చేసేందుకు ఇప్పటికే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) సరికొత్త స్కీంకు శ్రీకారం చుట్టబోతుంది. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే సెంట్రింగ్ యూనిట్లను తొలిసారి మహిళలకు సంఘాలచే ఏర్పాటు చేయించబోతుంది. ఈ యూనిట్లు సక్సెస్ అయితే గ్రామస్థాయిలో ఏర్పాటు చేయాలని భావిస్తుంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం వడ్డీలేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, చేయూత, మహిళా క్యాంటీన్లు, మహిళామార్టులు ఇలా పలు స్కీంలను ప్రవేశపెట్టింది. వారిని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది.
Also Read: CM Revanth Reddy: కృష్ణా నీటి కోటా సాధించటంలో కేసీఆర్ విఫలం… సీఎం సంచలన కామెంట్స్!
అందులో భాగంగానే మరో స్కీంను అమలు చేయబోతుంది. రాష్ట్రంలో సెంట్రింగ్ యూనిట్లను నెలకొల్పొందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆ యూనిట్లను మహిళా సంఘాలకు అప్పగించబోతుంది. ఆ బాధ్యతను ప్రభుత్వం సెర్ప్ కు అప్పగించింది. దీంతో జిల్లాలోని డీపీఎంలు, పీడీ లకు లేఖలు రాశారు. మండలాల వారీగా ఆసక్తి ఉన్న మహిళా సంఘాల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని, ముందుకు వచ్చేవారి లిస్టులను పంపించాలని సెర్ప్ ఉన్నతాధికారులు సూచించారు. దీంతో ఇప్పటికే కొన్ని జిల్లాల నుంచి సెర్ప్ కార్యాలయానికి లిస్టు పంపినట్లు తెలిసింది. మిగిలిన జిల్లాల నుంచి వచ్చిన తర్వాత ఫైనల్ చేసి వారికి యూనిట్లు అప్పగించనున్నట్లు సమాచారం. మండలాల్లో సక్సెస్ అయితే గ్రామస్థాయిలో సెంట్రింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
80శాతం సబ్సిడీతో యూనిట్
తొలిసారి సెంట్రింగ్ రంగంలోకి మహిళలను భాగస్వామ్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మహిళాసంఘాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లు ఎక్కువగా ఉండటంతో వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ యూనిట్లు అని అధికారులు తెలిపారు. ఒక్కో యూనిట్ కు 80శాతం సబ్సిడీతో మహిళా సంఘాలతో ఏర్పాటు చేయిస్తుంది. 4.50లక్షలు ప్రభుత్వం అందజేస్తుంది. త్వరలోనే యూనిట్లను ప్రారంభించనున్నారు.
ప్లైయాష్ బ్రిక్స్
ప్లైయాష్ బ్రిక్స్ తయారీ సైతం మహిళా సంఘాలకు అప్పగించబోతున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతుంది. అయితే బ్రిక్స్ కొరత కారణంగా ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగకుండా చర్యలు తీసుకుంటుంది. బ్రిక్స్ కొనుగోలుకు గృహ నిర్మాణశాఖ తో ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
నాక్ తో ట్రైనింగ్
సెంట్రింగ్ యూనిట్ కు ఎంపికైన మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు. యూనిట్లలో ఏలా ఫలితాలు సాధించాలి.. ఏయే వాటిని అమ్మకం చేపట్టాలి.. ఎలా తయారీ చేయాలనే దానిపై నాక్ ద్వారా 3 నుంచి 4 రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అందుకు శిక్షణ సమయంలో భోజన, వసతి సదుపాయం కల్పించనున్నారు. అంతేకాదు సర్టిఫికెట్ సైతం ఇవ్వనున్నారు.
Also Read: Hanumakonda Task Force: హనుమకొండలో టాస్క్ ఫోర్స్ దాడులు.. భారీ మొత్తంలో నిషేధ గుట్కా స్వాధీనం