Jupally Krishna Rao (Image Source: Twitter)
తెలంగాణ

Jupally Krishna Rao: డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. అవసరమైతే ఆయుధాలు ఇస్తాం.. ప్రభుత్వం కీలక ప్రకటన

Jupally Krishna Rao: తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని.. అవసరమైతే ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు సైతం ఇచ్చేందుకు వెనుకాడబోమని తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు అన్నారు. గంజాయి, డ్రగ్స్‌, నాటుసారా, ఎన్‌డీపీఎల్‌ నేరాలపై ఉక్కు పాదం మోపాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఎక్సైజ్‌శాఖ భవన్‌లోని సమావేశ మందిరంలో ఎన్‌ఫొ ర్స్‌మెంట్‌‌ ఎస్.టి.ఎఫ్ అండ్ డి.టి.ఎఫ్ , ఎన్‌ఫొర్స్‌మెంట్‌ టీమ్‌లతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎస్.టి.ఎఫ్ (Special Task Force) టీమ్‌లో పని చేసేవారికి అవసరమైతే ఆయుధాలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నల్లబెల్లం తయారీ, అమ్మకాలు, వినియోగంపై పూర్తి స్ధాయిలో అధ్యయనం చేయాలని ఎక్సైజ్‌ శాఖను ఆదేశించారు. అదే సమయంలో ఎక్సైజ్ శాఖ పట్టుకున్న నల్ల బెల్లాన్ని రైతులకు సేంద్రియ ఎరువుల తయారీకి ఇవ్వడానికి మార్గ దర్శకాలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. ఇవ్వడానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

Also Read: Dog Name Controversy: పెంపుడు కుక్కకు.. పక్కింటోడి పేరు పెట్టిన యజమాని.. ఇంకేముంది రచ్చ రచ్చే!

నాన్‌డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ను పట్టుకున్నప్పుడు వాటిని పగలగొట్టకుండా వినియోంచుకోవడానికి అవకాశాలను పరిశీలించాలని మంత్రి జూపల్లి అధికారులకు సూచించారు. జాతీయ ఉత్పత్తిగా గుర్తించి అమ్మకాలు చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయితోపాటు సింథాటిక్‌ డ్రగ్స్‌ తయారీ, అమ్మకాలు, రవాణ, వినియోగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని మంత్రి సూచించారు. నాచారం, చర్లపల్లి లోని లీగల్‌ పరిశ్రమల్లోనూ తనిఖీలు చేయడానికి అవసరమైన కార్యచరణ తయారు చేసుకోవాలని సూచించారు.

Also Read: Husband Suicide: ‘నా భార్య వేధిస్తోంది.. భరించలేకపోతున్నా’.. అంటూ భర్త సూసైడ్

ఒకే బార్‌ లైసెన్స్‌ పై ఎక్కువ బార్లు నడుపుతున్న ఆరోపణలు వస్తున్నాయని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. ఫామ్ హౌస్ లపై కూడ ప్రత్యేక నిఘా పెట్టాలని, బ్రాంది షాపులు సిట్టింగ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. అయితే ఎక్సైజ్ శాఖ ఆదాయం తగ్గిందని మంత్రికి ఎక్సైజ్ కమిషనర్ సి. హరి కిరణ్ తెలిపారు. ఇందుకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. రానున్న దసరా సందర్భంగా ఎక్సైజ్‌ సెల్స్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

Also Read:Congress: మణిపూర్‌లో ప్రధాని పర్యటన.. లాజిక్‌ ప్రశ్నలతో ఏకిపారేసిన కాంగ్రెస్

Just In

01

Telangana Govt: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్… మండలానికో సెంట్రింగ్ యూనిట్!

Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్!

CM Revanth Reddy: కృష్ణా నీటి కోటా సాధించటంలో కేసీఆర్ విఫలం… సీఎం సంచలన కామెంట్స్!

Local body Elections: స్థానిక ఎన్నికలపై తెలంగాణ మంత్రుల కీలక నిర్ణయం!

India vs Pak Match: ‘భారత్-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్’ డిమాండ్లపై టీమిండియా ఫీల్డింగ్ కోచ్ స్పందన