Nidhhi Agerwal: అందానికి అందం ఉంది.. దానిని ఎక్స్‌పోజ్ చేసే టాలెంట్ కూడా ఉంది. అయినా కూడా లక్ మాత్రం ఈ హీరోయిన్‌కి అస్సలు కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు కెరీర్‌లో ఒక్కటంటే ఒక్కటే హిట్ ఉన్న ఆ భామ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.. ఇంకెవరు గ్లామర్ డాల్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal). ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar)తో హిట్ అందుకున్న ఈ భామకు ఆ తర్వాత సరైన హిట్టే లేదు. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఒకానొక దశలో అన్నీ తానై ప్రమోషన్స్ నడిపించింది. ఏకంగా పవన్ కళ్యాణ్‌ని కూడా కదిలించిన ఆమె.. సినిమాతో హిట్ అందుకోలేకపోయినా, ప్రమోషన్స్ విషయంలో ఆమె చూపిన తెగువ.. అంతకంటే మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ సినిమా కూడా తనకి మంచి హిట్‌గా నిలుస్తుందని ఎంతో ఆశ పడింది. కానీ, ఆమె ఆశ నెరవేరలేదు.
Also Read- Mirai success meet: ‘మిరాయ్’ సక్సెస్ మీట్‌లో ఎమోషనల్ అయిన మంచు మనోజ్.. ఎందుకంటే?
తీవ్ర నిరాశలో నిధి అగర్వాల్
ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం నిధి అగర్వాల్ దాదాపు ఐదేళ్లు వెయిట్ చేసింది. ఫైనల్‌గా ఈ రిజల్ట్ రావడంతో తీవ్ర నిరాశకు లోనైంది. ఇదిలా ఉంటే, తాజాగా థియేటర్లలోకి వచ్చిన ‘మిరాయ్’ సినిమా కూడా ఆమెను తీవ్ర నిరాశకు గురిచేసింది. అదేంటి ‘మిరాయ్’ (Mirai) బ్రహ్మాండంగా థియేటర్లలో దూసుకెళుతోంది కదా. అందులోనూ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ కాదు కదా.. ఎందుకు నిరాశ పడుతోంది? అని అనుకుంటున్నారు కదా. అదే కదా విషయం. ‘మిరాయ్’ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించలేదు కానీ, ఓ స్పెషల్ సాంగ్‌ని చేసింది. షారుఖ్ ఖాన్ ‘దిల్ సే’ మూవీలోని ‘ఛయ్య ఛయ్య ఛయ్యా’ అనే సాంగ్ తరహాలో.. ‘మిరాయ్’లో నిధి అగర్వాల్ ట్రైన్‌పై ఓ సాంగ్ చేసింది. సాంగ్ కూడా చాలా బాగా వచ్చిందని అప్పట్లో చిత్రయూనిట్ కూడా తెలిపింది. ఈ సినిమా విడుదల తర్వాత.. తనకు చాలా మంచి పేరు వస్తుందని నిధి భావించింది.
Also Read- Manchu Manoj: ‘మిరాయ్’ సక్సెస్‌తో మా అమ్మ గర్వపడుతోంది.. వీడియో వైరల్!
నిధి ఊహించుకుంది జరగలేదు
కానీ.. మనమొకటి తలిస్తే.. దైవం ఇంకోటి తలుస్తుంది.. అన్నట్లుగా నిధి ఒకటి ఊహించుకుంటే.. అక్కడ ఇంకోటి జరిగింది. అందరినీ సర్‌ప్రైజ్ చేయాలని ఈ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేయలేదు. కానీ సినిమా నిడివి దృష్ట్యా.. ఇందులోని రెండు సాంగ్స్‌ని మేకర్స్ కట్ చేశారు. విడుదలై గ్రాండ్ సక్సెస్ అయిన ‘వైబ్ ఉంది’ సాంగ్ కూడా సినిమాలో లేదు. ఆ సాంగ్‌తో పాటు నిధి అగర్వాల్ చేసిన స్పెషల్ సాంగ్‌ని కూడా మేకర్స్ తీసేశారు. దీంతో నిధి పాప బాగా ఫీలవుతోంది. తనకే ఎందుకు ఇలా జరుగుతుంది? అని తన స్నేహితుల వద్ద నిధి చెప్పుకుని బాధపడుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇక ఆమె ఆశలన్నీ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ (Prabhas The Raja Saab) పైనే పెట్టుకుంది. ఆ సినిమా రాబోయే సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అంటున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు