Modern Kitchens: షేక్ పేట, ధర్మపురిల్లో రూ.24లక్షలతో మోడ్రన్ కిచెన్ల(Modern kitchens)ను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని ఎస్సీ(SC), ఎస్టీ(ST) , మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) తెలిపారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఉద్యోగులను విస్మరించిందని మండిపడ్డారు. ట్రైబల్ వెల్ఫేర్లో పెండింగ్ ఉన్న 11కోట్ల బకాయిలు విడుదల చేశామన్నారు. వెల్ఫేర్ హాస్టల్స్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ సవ్యసాచి ఘోష్ ను నియమించామన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్స్, పార్ట్‌టైమ్ సిబ్బందికి జూలై, ఆగస్టు నెలల వేతనాలు రూ.11.53 కోట్లు విడుదల చేశామన్నారు.
రూ.1.04 కోట్లు సర్వీస్ ఛార్జీలు
సబ్జెక్ట్ అసోసియేట్స్(Subject Associates), సీనియర్ ఫ్యాకల్టీ(Senior Faculty), గేమ్స్ కోచ్(Games Coach)లకు ఏప్రిల్, ఆగస్టు నెలల వేతనం ₹2.38 కోట్లు, హెడ్‌ఆఫీస్‌లో పనిచేస్తున్న సిబ్బందికి రూ.22 లక్షలు, జూలై వరకు స్వీపింగ్, శానిటేషన్, కేటరింగ్ సేవలందిస్తున్న సిబ్బందికి రూ.1.04 కోట్లు సర్వీస్ ఛార్జీలుగా విడుదల చేశామన్నారు. అదే విధంగా జూలై, ఆగస్ట్ నెలలకు సంబంధించిన 9 కోట్లు విడుదల చేశామని తెలిపారు. 18 నియోజకవర్గాలల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ప్రారంభమయ్యాయని, గ్రీన్ ఛాలెంజ్ ద్వారా మా ప్రభుత్వం నిధులు కేటాయించిందని వివరించారు.
Also Read: Prabhas movie update: ‘రాజాసాబ్’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ రెడీగా ఉండండి
విద్యార్థులతో కలిసి భోజనం
గత ప్రభుత్వం ప్రగతి భవన్ కట్టుకోవడానికి నిధులు ఉన్నాయి కానీ.. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించలేదని మండిపడ్డారు. స్కూల్స్,పిల్లల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయకూడదని, సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు అన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ శాఖలకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరామన్నారు. పోస్టుమెట్రిక్ విద్యార్థులకు 75 శాతం వ్వాలని, ఐఐటీ, జేఈఈ విద్యార్థులకు నూరుశాతం స్కాలర్ షిప్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
భవిష్యత్తు విషయంలో తప్పు..
సీఎస్ఆర్ ఫండ్స్ తో హైదరాబాద్ లో హాస్టళ్లు ఏర్పాటు చేయాలని సీఎంను కోరినట్లు తెలిపారు. చదువుకుంటూ పోటీ పరీక్షలకు సిద్దమయ్యేవారి కోసం అశోక్ నగర్ ప్రాంతంలో నూతన ఎస్సీ హాస్టల్ ప్రారంభించాలనే ఆలోచన మా ప్రభుత్వము చేస్తోందన్నారు. గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారని బట్ట కాల్చి మీద వేయడం కాదు.. ఆధారాలు ఉంటే నిరూపించాలి, బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పిల్లల భవిష్యత్తు విషయంలో తప్పు చేయబోమన్నారు. ప్రభుత్వం పై నిరాధార ఆరోపణలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
Also Read: Damodara Rajanarasimha: గుడ్ న్యూస్.. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు