CM Revanth Reddy: గోదావరి పుష్కరాలపై సీఎం కీలక ఆదేశాలు
CM Revanth Reddy (Image Source: Twitter)
Telangana News

CM Revanth Reddy: సీఎంగా తొలి గోదావరి పుష్కరాలు.. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy: 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్కరాలు ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే దృష్టి సారించింది. ఈ క్రమంలో పర్యాటక, నీటిపారుదల, దేవాదాయ శాఖ ఉన్నాతాధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లను పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు.

‘వాటికి తొలి ప్రాధాన్యత’
గోదావరి పుష్కరాల నేపథ్యంలో టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యత సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాలను తొలి ప్రాధాన్యతగా తీసుకుని.. శాశ్వత ఘాట్స్ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అనువైన వాటిని ఎంపిక చేయాలని సీఎం అన్నారు.

‘జాబితాను సిద్ధం చేయండి’
బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు ఇతర ప్రముఖ ఆలయాలను సందర్శించి జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల సమీపంలో ఉన్న గోదావరి పరివాహక ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ఘాట్స్ ను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు.

Also Read: Hyderabad Metro: మెట్రో నడపడం మా వల్ల కాదు.. ఆదాయం సరిపోవట్లేదు.. కేంద్రానికి ఎల్&టీ లేఖ

2 లక్షల మంది ఒకేసారి స్నానం చేసేలా..
పుష్కరాల సమయంలో దాదాపు 2 లక్షల మంది ఒకేసారి ఘాట్స్ వద్ద స్నానమాచరించే విధంగా అభివృద్ధి పనులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతీ ఆలయానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరుగా ఘాట్స్ డిజైన్లు రూపొందించాలని సీఎం సూచించారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని పర్యాటక, నీటిపారుదల, దేవాదాయ శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Also Read:  BJP vs Congress: ప్రధాని తల్లి ఏఐ వీడియో రచ్చ.. దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్

2027 జులైలో పుష్కరాలు!
గోదావరి పుష్కరాలు 2027 జులై 23 నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్లు గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడంపై దేవాదాయశాఖ దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా నదీతీరం వెంబడి ఉన్న 106 పుష్కరఘాట్లను ఆధునికీకరించడంతోపాటు కొత్తవి నిర్మించనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2015లో తొలిసారి గోదావరి పుష్కరాలు జరిగాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత వస్తోన్న తొలి పుష్కరాలు కావడంతో సీఎం రేవంత్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో బాసర నుంచి భద్రాచలం వరకూ గోదవారి ప్రవహిస్తోంది. తీరం వెంబడి బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, పర్ణశాల, భద్రాచలం వంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.

Also Read: Shocking Video: అమెరికాలో ఘోరం.. వాషింగ్ మిషన్ కోసం.. భారతీయుడి తల నరికి హత్య

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..