pawankalyan-og(Image :X)
ఎంటర్‌టైన్మెంట్

Pawan Kalyan OG: ‘ఓజీ’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుదోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో దూసుకుపోతుంది. ఇటీవల విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ టీజర్‌తో ఇప్పటికే భారీ హైప్ ఏర్పడిన ఈ చిత్రం, ట్రైలర్ విడుదలతో మరింత ఫుల్ జోష్‌లోకి వస్తుందని అంచనా. ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రకారం, ‘ఓజీ’ ట్రైలర్ 18 సెప్టెంబర్ 2025న విడుదల కావచ్చతీ తెలుస్తుంది. అంటే, ఇంకా ఐదు రోజుల్లో ఫ్యాన్స్ కోసం ఈ ఎక్సైటింగ్ మూవీ గ్లింప్స్ రెడీ అవుతుంది. ఈ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ రూపంలో కనిపించి, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌తో అదిరిపోతారని ఊహాగానాలు. దీనికి తోడు, 20 సెప్టెంబర్ 2025న విశాఖపట్నంలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందని సమాచారం. ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన స్పీచ్ ఇచ్చి, ఫ్యాన్స్‌ను ఇన్‌స్పైర్ చేస్తారని అంచనా. మొత్తంగా, ఈ రెండు ఈవెంట్స్‌తో ‘ఓజీ’ హైప్ స్కై రాకెట్ అవుతుంది.

Read also-Shocking Video: అమెరికాలో ఘోరం.. వాషింగ్ మిషన్ కోసం.. భారతీయుడి తల నరికి హత్య

‘ఓజీ’ మూవీని యంగ్ డైరెక్టర్ సుజీత్ రాసి, డైరెక్ట్ చేస్తున్నారు. ‘సాహో’, ‘రన్ రాజా రన్’ వంటి ఫిల్మ్‌లతో తన ప్రత్యేక స్టైల్‌ను చూపించిన సుజీత్, ఈసారి పవన్ కళ్యాణ్‌తో కలిసి ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు. ప్రొడ్యూసర్ డి.వి.వి. దానయ్య, డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందించారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర పేరు ‘ఓజస్ గంభీర’ (Ojas Gambheera). ‘ఓజస్’ అంటే మాస్టర్ లేదా ఫైట్ మాస్టర్ అని అర్థం, ‘గంభీర’ అంటే బలం, గొప్పతనం. మొత్తం ‘ఓజీ’ అంటే ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అని కూడా సూచిస్తుంది. ఈ పాత్రలో పవన్ 10 సంవత్సరాల తర్వాత ముంబైకి తిరిగి వచ్చి, ఇతర క్రైమ్ బాస్ ‘ఓమీ’ని చంపాలని ప్లాన్ చేస్తాడు. ఈ కథలో లాయల్టీలు, బెట్రయల్స్, హార్ట్‌బ్రేకింగ్ ట్విస్ట్‌లు ఉంటాయని టీజర్ నుంచే తెలుస్తోంది.

Read also-Hyderabad Metro: మెట్రో నడపడం మా వల్ల కాదు.. ఆదాయం సరిపోవట్లేదు.. కేంద్రానికి ఎల్&టీ లేఖ

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం, సెప్టెంబర్ 24, 2025న యూఎస్ ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. ఇటీవలి ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, యూఎస్‌లో మాత్రమే ప్రీమియర్ షోలకు రూ. 10 కోట్లు (సుమారు USD 1.13 మిలియన్) దాటిన బుకింగ్స్ రికార్డ్ చేసింది, 39,000కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి, 425+ లొకేషన్లలో. ఉత్తర అమెరికా మొత్తం ప్రీ-సేల్స్ రూ. 11.10 కోట్లు (USD 1.26 మిలియన్) చేరాయి. ఇది ఇండియన్ సినిమాల్లో ఫాస్టెస్ట్ మైల్‌స్టోన్, పవన్ కళ్యాణ్ పాపులారిటీకి సాక్ష్యం. మరిన్ని లొకేషన్లు ఓపెన్ అయ్యేందుకు ముందు, రూ. 15-18 కోట్ల వరకు చేరే అంచనా. టికెట్ ధరలు స్టాండర్డ్ స్క్రీన్లలో సుమారు రూ. 2,100, XD/PLF స్క్రీన్లలో రూ. 2,500 వరకు ఉన్నాయి, 450+ XD షోలు ఏర్పాటు. ఇది పుష్ప 2, కూలీ వంటి ఫిల్మ్‌లను మించి, రికార్డులు బద్ధలు చేస్తోంది.

Just In

01

Mirai song Cut: ‘మిరాయ్’ ఫైనల్ ఎడిటింగ్‌లో సాంగ్స్ అవుట్.. తీసేసింది అందుకేనా?

Japan Centenarians: పాపం జపాన్.. ప్రపంచ రికార్డు బద్దలుకొట్టినా.. సంతోషం లేకపాయే!

Firecrackers Policy: టపాసులపై సుప్రీంకోర్టు అనూహ్య వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా నిషేధం!

Konda Surekha: అటవీ అమరవీరులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. మంత్రి కొండా సురేఖ స్పష్టం

The Girlfriend: అనుకోకుండా ఇంటికి వచ్చిన గర్ల్‌ఫ్రెండ్‌పై.. ఏం జరిగిందంటే?