Konda Surekha (imagecredit:swetcha)
తెలంగాణ

Konda Surekha: ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బీసీ బ‌హిరంగ స‌భ!

Konda Surekha: ‘హలో బీసీ.. చలో కామారెడ్డి’ అని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) బీసీ వర్గాలకు పిలుపు నిచ్చారు. విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు క‌ల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని, బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) కుట్ర‌ల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు ఈ నెల 15న కామారెడ్డి(kamreddy)లో నిర్వహించే బహిరంగసభ ఏర్పాట్లపై మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) నివాసంలో సమావేశం నిర్వహించారు. మంత్రులు ధ‌న‌స‌రి అనసూయ సీతక్క(Seethakka), వాకిటి శ్రీహరి(Vakiti Srihari), వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy), సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy), రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) త‌దిత‌రుల‌తో సభపై చర్చించారు.

ఇచ్చిన మాట ప్రకారం

ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కామారెడ్డిలో బీసీ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించామ‌ని, అనంత‌రం బీసీ(BC)ల‌కు న్యాయం చేసేందుకు కృషి చేశామ‌ని గుర్తు చేశారు. కామారెడ్డి స‌భ‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తున్నామని, పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌(PCC Mahesh Kumar Goud), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో రాష్ట్రంలో బీసీల అభ్యున్న‌తి కోసం కృషి చేస్తున్న‌ట్టు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు సభ నిర్వహిస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్(Congress) ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను బీసిల కోసం కృషి చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయ‌ని సమావేశంలో మంత్రులంతా స‌మిష్టిగా అభిప్రాయపడ్డారు. కామారెడ్డి వేదికగా ఇచ్చిన బీసీ కులగణన హామీని సాధించామ‌ని వివ‌రించారు.

Also Read: Bellamkonda Sreenivas: వారికి బెల్లంకొండ బంపర్ ఆఫర్.. రైటర్స్ రెడీగా ఉండండి

నరేంద్ర మోడీ ప్రభుత్వం

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Min Ponguleti Srinivass Reddy) మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను బీసిల కోసం కృషి చేస్తుంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడ్డారు. కామారెడ్డి వేదికగా ఇచ్చిన బీసీ కులగణన హామీని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో సాధించామన్నారు.

Also Read: Nano Banana: గూగుల్ జెమినీలో 3డీ ఇమేజెస్‌ ఆప్షన్.. క్రియేట్ చేయడం చాలా ఈజీ!

Just In

01

Farmers Protest: వరంగల్ జిల్లాలో.. యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు.. రహదారి పై రాస్తారోకో

Mirai song Cut: ‘మిరాయ్’ ఫైనల్ ఎడిటింగ్‌లో సాంగ్స్ అవుట్.. తీసేసింది అందుకేనా?

Japan Centenarians: పాపం జపాన్.. ప్రపంచ రికార్డు బద్దలుకొట్టినా.. సంతోషం లేకపాయే!

Firecrackers Policy: టపాసులపై సుప్రీంకోర్టు అనూహ్య వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా నిషేధం!

Konda Surekha: అటవీ అమరవీరులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. మంత్రి కొండా సురేఖ స్పష్టం