Teja Sajja: ‘హనుమాన్’ సినిమాతో సూపర్ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్న తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న విడుదలవుతున్న ఈ సినిమా విశేషాలను హీరో తేజ సజ్జా మీడియాకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..
ఎలాంటి ఒత్తిడీ పడలేదు
‘‘హనుమాన్‌కి ఇప్పటికి నాలో మార్పు ఏమీ రాలేదు. ఏ సినిమా అయినా పడే కష్టంలో ఎలాంటి తేడా లేదు. ఇంతకుముందు ఎలాగైతే కొత్తరకం సినిమాలు చేయాలని అనుకున్నానో.. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. ‘హనుమాన్’కి ఎంత ఎఫర్ట్ పెట్టానో దాని కంటే ఎక్కువ ‘మిరాయ్’కి పెట్టాను. ‘హనుమాన్’ తర్వాత వస్తున్న ఈ సినిమా విషయంలో ఎలాంటి ఒత్తిడీ పడలేదు. ఇంకా చెప్పాలంటే ‘హనుమాన్’ విషయంలోనే చాలా ఒత్తిడి వుండేది. నేను సక్సెస్‌ని ఆపాదించుకోను. ఒక సినిమాకి మించి ఇంకో సినిమా చేయాలనే అంచనాలు, ఆలోచనలు ఏమీ ఉండవు. ఏ సినిమాకి ఆ సినిమానే ప్రత్యేకం. ఒక సినిమాకి 100 శాతం ఎఫర్ట్ పెడుతున్నానా? లేదా? అనేది మాత్రమే చూసుకుంటాను.
Also Read- Chiranjeevi: ఈ కట్టె కాలేంత వరకూ మీ అభిమానినే.. ఈ మాట అంది ఎవరో తెలుసా?
పెద్ద ఆపదని ఆపడానికి
‘మిరాయ్’లో నా పాత్ర గురించి చెప్పాలంటే.. ఒక మామూలు కుర్రాడు తన ధర్మాన్ని తెలుసుకొని, యోధులతో తనకి ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని, ఒక పెద్ద ఆపదని ఆపడానికి ఎంత దూరం వెళ్తాడు? తన తల్లి ఆశయం కోసం ఏం చేశాడు? ఇలా ఇతిహాసాల్లో ఉన్న సమాధానం కోసం జర్నీ చేసే పాత్రలో కనిపిస్తాను.ఇందులో దాదాపు 9 యాక్షన్ బ్లాక్ ఉన్నాయి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ దేనికదే ఛాలెంజ్. శ్రియ, జగపతిబాబు వంటి గొప్ప యాక్టర్స్‌తో నేను చిన్నప్పుడు నటించాను. వాళ్ళందరితో మళ్ళీ ఇప్పుడు కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మనోజ్ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఒక జీవితాన్ని చూసి వచ్చిన పాత్ర. ఆ పాత్రకి ఒక ఫిలాసఫీ కూడా ఉంటుంది. మన ఇతిహాసాలతో చాలా ఆర్గానిక్‌గా బ్లెండ్ అయిన కథ ఇది. బలవంతంగా ఇరికించింది కాదు. శ్రీరాముడికి సంబంధించి చిన్న పోర్షన్ ఉన్నప్పటికీ, వచ్చినప్పుడు స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ సినిమాలో రెండు సర్ ప్రైజ్‌లు వున్నాయి. అవి చూసినప్పుడు ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ వస్తాయి.
Also Read- Coolie Monica Song: జుమ్ జుమ్ జుమ్‌తాక్.. ‘కూలీ’ మోనికా వీడియో సాంగ్ వచ్చేసిందోచ్..
వెరీ క్లీన్ ఫ్యామిలీ ఫిలిం
హరి గౌర వంటి డెడికేషన్ ఉన్న టెక్నీషియన్ ఈ సినిమాకు దొరకడం చాలా చాలా ఆనందం. ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. నిర్మాత విశ్వప్రసాద్ వంటి వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. బిగినింగ్ నుంచి అద్భుతంగా సినిమా చేద్దామని ప్రతి అడుగులో సపోర్ట్ చేశారు. ఆడియన్స్‌కి మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశం ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. అలాంటి ప్రొడ్యూసర్‌తో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని వంటి వారెందరో మెసేజ్ పెట్టారు. చాలామంది దర్శకులు ఎన్నో మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కరణ్ జోహార్ ఈ సినిమా చూసి ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేను. మిరాయ్ వెరీ క్లీన్ ఫ్యామిలీ ఫిలిం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ అడ్వెంచరు ఫాంటసీ ఎమోషన్ డివోషనల్ ఎలివేషన్ అన్ని ఉంటాయి. ఒక ఇంటర్నేషనల్ స్థాయి సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో వర్క్ చేశాం. ప్రేక్షకులందరూ అదే ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు