Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) దాదాపు 4 దశాబ్దాలుగా ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే వారికి ఆయనే స్ఫూర్తి అంటే అతిశయోక్తి కానే కాదు. ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్స్ పబ్లిగ్గా, స్టేజ్‌లపై ఈ విషయాన్ని చెప్పారు. కొందరికి మెగాస్టార్ చిరంజీవి అంటే ఓ ఎమోషన్. ఆయన కలవాలని, ఒక ఫొటో దిగాలని అనుకునే వారు కొందరైతే.. ఆయనని అలా వెండితెరపై చూస్తూనే ఉండాలని కోరుకునే డై హార్డ్ ఫ్యాన్స్ ఇంకెందరో ఉన్నారు. ఇక కొరియోగ్రాఫర్స్ గురించి చెప్పేదేముంది. ఏ కొరియోగ్రాఫర్‌ని కదిలించినా, చిరంజీవి పేరు చెప్పిన తర్వాతే, ఇంకెవరి పేరైనా చెబుతారు. ఇప్పుడలాంటి కొరియోగ్రాఫరే ఒకరు.. ‘ఈ కట్టె కాలే వరకూ మీ ఫ్యాన్‌నే’ అంటూ పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆ కొరియోగ్రాఫర్ ఎవరు? ఏంటి కథ? అని అనుకుంటున్నారు కదా..
Also Read- Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. సియాటెల్ వినాయక చవితి లడ్డు! మ్యాటరిదే..
కొరియోగ్రాఫర్ ఎమోషనల్
ఈ పోస్ట్ చేసిన కొరియోగ్రాఫర్ ఎవరో కాదు.. పొలాకి విజయ్ (Polaki Vijay). ఈ మధ్యకాలంలో ఆయన పేరు, ఆయన సృష్టిస్తోన్న స్టెప్స్ బాగా వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడాయనకు మెగాస్టార్ చిరంజీవికి కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. అంతే, సోషల్ మీడియా వేదికగా తన ఎమోషన్‌ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి, నయనతారలపై హైదరాబాద్‌లో ఓ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ పాటకు పొలాకి విజయ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆయన మెగాస్టార్‌కు వీరాభిమాని. మెగాస్టార్‌కు స్టెప్స్ కంపోజ్ చేసిన ఆనందంలో.. ఆయన ఎమోషన్ అవుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. అందులో..
Also Read- Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’.. ఆ రాష్ట్రంలో విడుదల కావడం లేదా? అసలేం జరిగిందంటే?
దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్
‘‘చిన్నప్పటి కల.. ఎవరి డ్యాన్స్ చూసి పెరిగానో.. ఎవరి డ్యాన్స్ చూసి డ్యాన్స్ మీద ఇష్టం కలిగిందో.. ఎవరి డ్యాన్స్ చూసి నేను ఇండస్ట్రీకి వెళ్లాలి అని అనుకున్నానో.. ఎవరి డ్యాన్స్ చూసి నాకు ఆయనతో ఒక ఛాన్స్ వస్తుందా? అని ఫీలయ్యానో.. అలాంటి గాడ్ ఆఫ్ డ్యాన్స్ అయిన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవిగారికి నేను కొరియోగ్రఫీ చేసే అవకాశం రావడం నాకు దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్. 2025 నా లైఫ్‌లో ఒక పెద్ద సంవత్సరం అనుకుంటున్నా. ఈ రోజు మా బాస్‌తో పనిచేసే అవకాశం రావడానికి కారణం అనిల్ రావిపూడి సర్, సుస్మితగారు, సాహు గారు. మీ సహకారానికి ధన్యవాదాలు. ఇది నాకు మర్చిపోలేని బహుమతి. మీకెప్పటికీ రుణపడి ఉంటాను. సమీర్ సర్ మీ సహకారానికి ధన్యవాదాలు. ప్రతి ఒక్క డ్యాన్సర్ డ్రీమ్ బాస్‌తో కలిసి పనిచేయడం. నాకైతే ఇంకా స్పెషల్, ఎందుకంటే నాకు ఇష్టమైన హీరో. మా అమ్మానాన్నలకు ఇష్టమైన హీరో. వారి ఆశీస్సులు ఉండటం వల్ల నేను ఈరోజు ఆయన వరకూ చేరుకున్నానని భావిస్తున్నాను. చిరంజీవి సర్ మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ కట్టె కాలేంత వరకూ మీ ఫ్యాన్‌నే’’ అని విజయ్ (polaki vijay movies list) పేర్కొన్నారు.
Chinapati kala 🥹
evari dance chusi perigano ,
Evari dance chusi dance medha istam kaligindo
,evari dance chusi Nenu industry ki velali ani anukunano
,evari dance chusi Naku ayana tho Oka chance vasthada ani feel ayyano -alantidi god of dance aina one and only Mega star…— Polaki Vijay (@PolakiVijay) September 10, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు