Pawan Kalyan Fans: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ మూవీ (OG Movie) సెప్టెంబర్ 25న విడుదలయ్యేందుకు భారీ స్థాయిలో రెడీ అవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆనందంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అస్సలు ఎక్కడా ఆగడం లేదు. కూకట్ పల్లిలో భారీగా కటౌట్స్ పెట్టి, ఇప్పటి వరకు లేని విధంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసేందుకు కొందరు ఫ్యాన్స్ రెడీ అవుతుంటే.. అమెరికా సియాటెల్ మహానగరంలోని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గణేష్ లడ్డూ (Ganesh Laddu) వేలంలో పాల్గొని, ఆ లడ్డూని దక్కించుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Ritika Nayak: హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్.. ‘మిరాయ్’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన హీరోయిన్
లడ్డూ వేలంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
అమెరికా సియాటెల్ (Seattle) మహానగరంలో నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన 11 రోజుల వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంలో పవన్ కళ్యాణ్ అభిమానులు (Pawan Kalyan Fans) పాల్గొని, లడ్డూను రూ.3 లక్షలకు దక్కించుకుని భక్తులకు పంచడం విశేషం. ఈ సందర్భంగా అభిమానుల్లో ఒకరైన అశోక్ గల్లా మాట్లాడుతూ.. రాబోయే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మేము లడ్డూ వేలంలో పాల్గొన్నాం. ఆ లడ్డూ మాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ‘ఓజీ’ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందనే నమ్మకంతో మేమంతా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ కమ్మిలి, భాస్కర్ గంగిపాముల, కృష్ణ ఉంగరాల, జనార్ధన్ చక్కా, రాజేష్ అర్జా, అశోక్ పసుపులేటి, లక్ష్మీనారాయణ ముమ్మిడి, హర్షా రేఖానా, శివ నరాలశెట్టి, నవీన్ గంధం, సతీష్ బత్తిన తదితరులు పాల్గొన్నారు.
Also Read- Trance of OMI: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నుంచి ‘ఓమి ట్రాన్స్’ విడుదల.. ఎలా ఉందంటే?
టీజీ విశ్వప్రసాద్‌కు కృతజ్ఞతలు
సియాటెల్‌లో ఈ ఉత్సవాలను నిర్వహించిన నాసా సంస్థ ప్రతినిధులు వినోద్ పర్ణా, శ్రీరామ్ సుంకరి, రాజా చౌదరి, వినయ్ రెడ్డి, రామ్ బోండా, అజయ్ మెతుకుల, సతీష్ చిగుళ్లపల్లి, శాంతి కుమార్, సీతారాం పెమ్మరాజు, శ్రీకాంత్ మొగరాల, సుహాగ్ గండికోట, సొమా జగదీష్, నితీష్, నరేంద్ర వంటి వారంతా మాట్లాడుతూ.. లడ్డూ వేలంలో వచ్చిన మొత్తాన్ని సియాటెల్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇస్తామని ప్రకటించారు. అలాగే, గత 11 రోజులుగా ప్రతిరోజూ సాయంత్రం ఐదు వందల మందికి పైగా భక్తులకు మహాప్రసాదం పంచినట్లుగా వారు పేర్కొన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సహకారం ఉత్సవాల విజయానికి కీలకమని ఆయనకు వారంతా కృతజ్ఞతలు తెలిపారు. ఇక ‘ఓజీ’ విషయానికి వస్తే.. ఈ సినిమాపై ఫ్యాన్స్ అంతా ఎంతో నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నారు. కచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న రికార్డులను ఈ సినిమా బద్దలు కొడుతుందని, వారెంతో ఆశతో ఉన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు